Tags :tavva obulreddy

    పర్యాటకం

    ఒంటిమిట్ట కోదండరామాలయం

    రాష్ర్టవిభజన నేపథ్యంలో భద్రాచల రామాలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమి వేడుకలను అధికార లాంఛనాలతో కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం వేదికగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ ఆలయ విశేషాల పట్ల తెలుగువారిలో సహజంగానే ఆసక్తి నెలకొంది. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎన్నో విశిష్టతలను సంతరించుకున్న ఈ రామాలయం వివరాలు… కడప నుంచి తిరుపతికి వెళ్లే ప్రధానమార్గంలో కడపకు 24 కి.మీ. దూరంలో మండలకేంద్రం ఉంది. ఈ గ్రామం త్రేతాయుగం నాటిదని స్థలపురాణం వివరిస్తోంది. […]పూర్తి వివరాలు ...

    కథలు

    సియ్యల పండగ (కథ) – తవ్వా ఓబుల్‌‌రెడ్డి

    ”మా ఉళ్ళో ఏ పండగ వచ్చినా, ఏ సంబరం జరిగినా, గవినికాడి పుల్లయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు ! సిన్నప్పటి నుంచీ పుల్లయ్య యవ్వారమే అంత అని మా నాయన చెబుతా ఉంటాడు. సంకురాత్రి పండగయితే పుల్లయ్యను పట్టుకోడానికి పగ్గాలుండవ్‌! ఊళ్ళో ఇళ్ళిళ్ళూ తిరుగుతా ఉంటాడు. ఏ ఇంట్లో ఏ వంటలు సేచ్చాండారు? ఏఏ ఊర్లనుండీ చుట్టాలు వచ్చినారు? ఊళ్ళో దేవుని మేరవని  ఎట్ల జేచ్చే బాగుంటది? పార్యాట ఆపొద్దు  ఏ జామున యాటపొట్టేళ్ళు, […]పూర్తి వివరాలు ...

    చరిత్ర

    దివిటీల మల్లన్న గురించి రోంత…

    కడపలోని యోగివేమన యూనివర్శిటీ చరిత్ర విభాగం పరిశోదనలో ‘దివిటీలమల్లు సెల’గా స్థానిక ప్రజలు భావించే కొండపేటు ఆదిమానవుల ఆవాసంగా ఉండేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ”మల్లుగానిబండ’గా స్థానికులు పిలిచే ఈ ప్రదేశంలో ఆదిమానవులు యెర్రటి కొండరాళ్ళపై తెల్లటి వర్ణాలతో జంతువులు, మనుషుల చిత్రాలను గీశారు. దీంతో మైదుకురు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం భూమాయపల్లెలో యాదవ కుటుంబంలో పుట్టి రేకలకుంటలో ఒక పాలెగాని ఇంట పెరిగి అత్యంతసాహసవంతుడిగా పేరుగాంచి, బ్రిటీషువారినే ఎదిరించిన దివిటీలమల్లు ఆదిమానవుడికి అవాసమైన కొండపేటులోనే తలదాచుకున్నట్లు […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు సమాచారం

    కరువుసీమలో నీళ్ళ చెట్లు!

    రాయలసీమలో ఇప్పటికీ గుక్కెడు నీటికోసం అలమటించే అభాగ్య జీవులున్నారు. ఇంటికి భోజనానికి వచ్చిన చుట్టాన్ని కాళ్లు కడుక్కోమనడానికి బదులుగా, చేయి కడుక్కోమని చెప్పాల్సిన దుర్భర పరిస్థితులు సీమ ప్రాంతంలో తారసపడుతుంటాయి!గంజి కరువూ, డొక్కల కరువూ పేరేదైనా బుక్కెడు బువ్వ కోసం, గుక్కెడు నీటి కోసం నకనకలాడిన రాయలసీమ చరిత్రకు కైఫీయత్తులు సైతం సాక్ష్యాధారంగా నిలుస్తున్నాయి. సీమ రైతులు , తమ కంట్లో పెల్లుబుకుతున్న కన్నీటి చెమ్మను తుడుచుకుంటూ నీటిచెమ్మ కోసం భూమిని 500 అడుగుల లోతు దాకా […]పూర్తి వివరాలు ...