Tags :tavva obul reddy

కవితలు

తేల్సుకుందాం రార్రని తెగేసి సెప్పక!

ఒరే అబ్బీ..ఒరే సిన్నోడా పొగబండీ..ల్యాకపాయ ఒరే సంటోడా..ఒరే సన్నొడా ఎర్ర బస్సూ కరువైపాయ అబ్బ పాలెమాలినా.. జేజికి బాగ లేకపొయినా గుంతల దోవలే దిక్కైపాయ తాతల కాలం నుంచీ పొగబండ్లని ఇనడమేకానీ ఎక్కిన పాపాన పోల్యా ఉత్తర దిక్కు రైలు యెల్తాంటే సిత్తరంగా ముక్కున ఎగసూడ్డమే కానీ కాలు మింద కాలేసుకోని కూచ్చోని రోంత దూరమన్నా పోయింది ల్యాకపాయ మా సిన్నాయన ఒకసారి కనకదుర్గమ్మ తిన్నాలకు పోయుండ్య పొగబండ్లతోనే పైన మోడాలు ఆడ్తాండయంట ఊరూరికీ పొగబండ్లలోనే జనాలంతా […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

రేపటి నుండి నారాయణస్వామి శతారాధనోత్సవాలు

ఈనెల 27,28 తేదీలలో (గురు,శుక్రవారాలలో) బ్రహ్మంగారిమఠం మండలంలోని ఓబులరాజుపల్లె నారాయణస్వామి 100వ ఆరాధనోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మంగారిమఠంలోని సాలమ్మ మఠం, బొమ్మువారి మఠాలలో ఈ ఆరాధనోత్సవాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈ ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం, సంస్కృతిక,ఆధ్యాత్మిక కార్యక్రమాలను, భజనలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మంగారి మఠం సమీపంలోని శ్రీ నారాయణ స్వామి మఠం ఆధ్యాత్మిక భావనలతో వెలుగొందింది. కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం మిట్టపల్లె, గంగిరెడ్డిపల్లె గ్రామంలో నర్రెడ్డి గంగిరెడ్డి, రామాంబ దంపతులకు 1834 లో […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘గండికోట’కు పురస్కారం

కడప.ఇన్ఫో మరియు తెలుగు సమాజం మైదుకూరులు సంయుక్తంగా ప్రచురించిన ‘గండికోట’ పుస్తకానికి గాను పర్యాటక శాఖ అందించే ‘ఉత్తమ పర్యాటక రచన’ పురస్కారం లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27 రాత్రి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంత కుమార్, చేనేత, జౌళి శాఖా మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా పుస్తక రచయిత, కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు.పూర్తి వివరాలు ...

కవితలు

బహుళజాతి చిలుకలు (కవిత) – తవ్వా ఓబుల్ రెడ్డి

వాణిజ్య ప్రకటనల యవనిక పై ఏ సూడో రైతు నాయకుడో వెండితెర వేలుపో ప్రత్యక్షమై బహుళజాతి చిలుకల్లా పలుకుతున్నారు చితికిన కొబ్బరి రైతు సాక్షిగా బోండాముల్లో హలాహలాన్ని చిమ్మి కోలాల కోలాహలం సృష్టిస్తున్నారు ఖాజీపేట గోళీసోడా, మైదుకూరి నన్నారి షర్బత్‌, అనాగరిక పానీయాలంటున్నారు పులియో గరే, కుర్‌ కురే, పిజ్జా, బర్గర్లను మహాప్రసాదాలుగా అభివర్ణిస్తున్నారు చింతకుంట సాయిబులు ఒంటెద్దు బండ్లో ఉప్పునూ వంకమర్రి వాళ్లు చెంబుల పిండినీ అమ్మొచ్చినప్పుడు వీధుల్ని అలుముకునే జీవన నాదాన్ని నిర్ధాక్షిణ్యంగా నులిమేస్తున్నారు […]పూర్తి వివరాలు ...

కథలు సాహిత్యం

నవ వసంతం (కథ) – తవ్వా ఓబుల్ రెడ్డి

విజయరాఘవరెడ్డి మొగసాలలో అరుగుపై కూర్చుని గంగులయ్యతో గడ్డం గీయించుకుంటున్నాడు. గేటు దగ్గర ఇద్దరు అంగరక్షకులు పరిసరాలను గమనిస్తున్నారు. ఇస్త్రీ బట్టల మోదతో వచ్చిన రామన్న వాటిని మంచంపై పెట్టి రెడ్డెమ్మ కోసం ఇంట్లోకి కేక వేసినాడు. ”గడ్డం గీకేటప్పుడు సేతులెందుకు వణికిచ్చవురా? పిరికి నాయాలా” అద్దంలో మొహాన్ని చూసుకుంటూ గంగులయ్యను మందలించినాడు విజయరాఘవరెడ్డి. ”అబ్బెబ్బే… అదేం లేదులేబ్బా… నరాల జబ్బుతో సేతులు వణుకుతాండయ్‌” సంజాయిషీ చెప్పుకున్నాడు గంగులయ్య.పూర్తి వివరాలు ...

కథలు

కడుపాత్రం (కథ) – తవ్వా ఓబుల్‌రెడ్డి

”కేబుల్‌టీవీలు, గ్రాఫిక్‌సినిమాలతో హోరెత్తిపోతున్న ఈ కాలంలో ఇంకా బొమ్మలాటలు ఎవరు జూచ్చారు? మీకు ఎర్రిగాని… ఊళ్ళోకి వచ్చినందుకు అంతో ఇంతో లెక్క అడుక్కోని దోవ బట్టుకోని పోర్రి… ఎందుకింత సెమ!” నిన్నరాత్రి పొరుగూర్లో గ్రామపెద్దలు అన్నమాటలు, రోడ్డు గతుకుల్లా బండిలోని వెంకటరావును కుదిపివేస్తున్నాయి. ఆ రాత్రికి ఆ వూర్లోనే గడిపి, ఆటాడకుండా తెల్లవారుజామున్నే బృందాన్ని తట్టిలేపి, బండ్లు కట్టించి, చక్రాలపల్లెకు దారిపట్టించినాడు వెంకటరావు. చక్రాలపల్లె సమీపిస్తున్నకొద్దీ వెంకటరావులో తల్లి ఒడిలోకి చేరుకుంటున్న ఆనందం చోటు చేసుకోసాగింది. ఎనిమిదేళ్ళ […]పూర్తి వివరాలు ...

కథలు వ్యాసాలు

రాయలసీమ కథా సాహిత్య ప్రాభవ వైభవాలు -డాక్టర్ వేంపల్లి గంగాధర్

రాయలసీమలో వైవిధ్య భరితమైన సాహిత్య ప్రాభవ వైభవాలు  కనిపిస్తాయి. శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అల్లసాని పెద్దన, ప్రజాకవి వేమన, కాలజ్ఞానకర్త వీరబ్రహ్మం, పదకవితా పితామహుడు అన్నమయ్య వంటి మహానుభావులు ఎందరో ఈ ప్రాంతంలో సాహితీ సేద్యం చేశారు. కవిత్వం, అవధానం, నవల, విమర్శ, కథ వంటి సాహితీ ప్రక్రియలన్నీ ఆనాటి పునాదుల పైనే నిర్మితమవుతూ వచ్చాయి.పూర్తి వివరాలు ...

కథలు వార్తలు

కథకుల సందడితో పులకరించిన నందలూరు !

నందలూరు : ‘సాహిత్యం ద్వారానే సామాజిక స్పృహ పెరుగుతుంది. సమాజం మంచి మార్గంలో నడవడానికి కథ మార్గదర్శనం చేస్తోంది. కథకు మరణం లేదు’ అంటూ తెలుగు కథకు ఉన్న ప్రాధాన్యాన్ని పలువురు సాహితీ ప్రముఖులు వివరించారు. నందలూరులో ఆదివారం గొబ్బిళ్ల శంకరయ్య మెమోరియల్ స్కూల్ ఆవరణంలో కళింగాంధ్ర ప్రాంతానికి చెందిన కథకులు అట్టాడ అప్పల్నాయుడుకు కేతు కథా పురస్కారం, ఏఎన్ జగన్నాథశర్మకుపూర్తి వివరాలు ...