జీవో నెంబర్ : 69 (సాగునీటి పారుదల శాఖ) విడుదల తేదీ : 15.06.1996 ప్రధాన ఉద్దేశ్యం : ‘కృష్ణా జలాలను ఎక్కడా ఆపకుండా వీలైనంత త్వరగా డెల్టాకు చేరవేయడం‘ అని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటారు. జీవో 69 సారాంశం : విద్యుత్ ఉత్పత్తి నెపంతో అధికారికంగా శ్రీశైలం నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలించేందుకు ‘జీవో 69’ని ఆం.ప్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో శ్రీశైలం జలాశయ కనీస నిర్వహణా నీటిమట్టాన్ని 834 అడుగులుగా […]పూర్తి వివరాలు ...
Tags :srisailam
శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీరు 854 అడుగుల వరకు నిండినా రాయలసీమకు నీటిని విడుదల చేయకపోవడం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్ బాషా విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్ట్‌లకు నీటి విడుదల చేసిన తర్వాతే కిందికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణాలను రీషెడ్యూల్ చేయడానికి ఆర్బీఐ, ఇతర బ్యాంక్లు కుదరదన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, […]పూర్తి వివరాలు ...
జీవో 233 రద్దుకు డిమాండ్ నంద్యాల : కర్నూలు – కడప సాగునీటి కెనాల్ (కేసీ) దుస్థితిపై ఆయకట్టు రైతులు గళమెత్తారు. గురువారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య, కర్నూలు జిల్లా వరి ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కేసీ కెనాల్ సాగునీటి భవితవ్యంపై రైతు సదస్సు నిర్వహించారు. రైతుసంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి కర్నూలు, కడప జిల్లాలకు చెందిన వివిధ రైతు సంఘాల నాయకులు, రైతులు […]పూర్తి వివరాలు ...
శ్రీశైలం జలాశయం నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదివరకు కర్నూలు ముంపునకు గురయ్యేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులే కారణమని, దీంతో ప్రజలు భారీగా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...