Tags :rayalaseema movement

రాజకీయాలు

సీమ అభివృద్దిపై వివక్షకు నిరసనగా ఆందోళనలు

కడప: సీమ సమగ్రాభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్దిపైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకూ రాయలసీమ వ్యాప్తంగా సంతకాల సేకరణ, 24, 25 తేదీలలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయనున్నట్లు అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్యల జిల్లా నాయకులు చెప్పినారు. మంగళవారం స్థానిక రారా గ్రంథాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ… రాయలసీమపై వివక్ష చూపితే సహించేదిలేదని పరిస్థితిలో మార్పురాకపోతే ప్రభుత్వంపై తిరగబడతామని హెచ్చరించారు. […]పూర్తి వివరాలు ...

వార్తలు

విభజనోద్యమం తప్పదు

కడప: సీమహక్కులను కాలరాస్తే మరో విభజనోద్యమానికి నాందిపలుకుతాం… శ్రీశైలంలో 854 అడుగుల నీటినిల్వకై పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమం సాగిస్తామంటూ పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, రైతుసంఘాల నాయకులు, మేధావులు, ప్రముఖులు ఉద్ఘాటించారు. స్ధానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో గురువారం 107 జీవో ఉల్లంఘనపై అఖిలపక్ష, ప్రజాసంఘాల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నీలం సంజీవరెడ్డి రీసెర్చ్‌సెంటర్‌ పూర్వసంచాలకులు లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాలకుల వివక్ష కారణంగా ఒకనాటి రతనాల రాయలసీమ […]పూర్తి వివరాలు ...

రాయలసీమ వీడియోలు

హుషారెత్తిస్తున్న రాయలసీమ పాట

రాయలసీమ నిర్మాణ సమితి , రాయలసీమ కళాకారుల సమితి మరియు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలు కలిసి రూపొందించిన పాట సీమ గళాన్ని వినిపిస్తోంది. నిన్ననే ఈ పాటకు వీడియో రూపాన్ని you tube ద్వారా విడుదల చేశారు. హుషారైన ఈ పాట కడప.ఇన్ఫో వీక్షకుల కోసం…  పూర్తి వివరాలు ...

వార్తలు

27 నుంచి రాయలసీమ ఆత్మగౌరవయాత్ర

కడప: రాయలసీమ సమగ్రాభివృది కోసం ఈనెల 27 నుంచి ‘రాయలసీమ ఆత్మగౌరవయాత్ర’ను చేపడుతున్నట్లు రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్‌యూ) జిల్లా అధ్యక్షుడు జయవర్థన్ తెలిపారు. ఆత్మగౌరవయాత్రకు సంబంధించిన గోడపత్రాలను ఆదివారం స్థానిక గీతాంజలి కళాశాలలో విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు జయవర్థన్ మాట్లాడుతూ శతాబ్దాలుగా కరవు కాటకాలతో రాయలసీమ అల్లాడుతోందన్నారు. సీమ నేల మీద ఆత్మహత్యలు, వలస బతుకులు శ్ర్వసాదారనంయ్యాయన్నారు. తరతరాలుగా సాగు, తాగునీరు అందక సీమ గొంతు ఎండిపోతోందని, […]పూర్తి వివరాలు ...

వార్తలు

బంద్ విజయవంతం

కడప: కడప జిల్లా పట్ల ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యింది. సీమలో ఉక్కు పరిశ్రమ, నిరకజలాల సాధనకు ప్రాణ త్యాగాలు చేయడానికైనా వెనుకాడమని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు స్పష్టం చేశారు.  విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందగా మూసి బంద్‌కు  మద్దతు తెలిపారు. కొన్ని చోట్ల సంస్థలను సమాఖ్య ప్రతినిధులు మూయించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గంగాసురేష్, నగర అధ్యక్షుడు అంకుశం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు […]పూర్తి వివరాలు ...

వార్తలు

సీమ అభివృద్ధిని మరిచిపోయిన నాయకులు

రాయలసీమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి సీమకు నష్టం జరగకుండా చూడాలని మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి అన్నారు. కడప నగరంలోని ఆర్‌జేయూపీ కార్యాలయంలో ఆదివారం రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్‌యూ) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు దీక్షల ఫలితంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని.. అనంతరం విశాలాంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్‌ను రాజధానిగా చేశారన్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం […]పూర్తి వివరాలు ...

రాయలసీమ వీడియోలు

మౌనమెంత సేపే రాయలసీమ గడ్డ మీద (వీడియో పాట)

అరుణోదయ (ACF) వారి సహకారంతో రాయలసీమ నిర్మాణ సమితి , రాయలసీమ కళాకారుల సమితిలు కలిసి రూపొందించిన దృశ్యరూప రాయలసీమ ఉద్యమ గీతమిది. ఈ రోజు youtube ద్వారా విడుదలైన ఈ పాట ఆకట్టుకొంటోంది… మీరూ ఒకసారి వీక్షించండి!!  పూర్తి వివరాలు ...

వార్తలు

కడప గడపలో సీమ ఆకలి ‘కేక’ అదిరింది

ఉద్యమాలు నాయకుల నుంచి కాదు… ప్రజల్లో నుంచి వస్తాయి అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కొత్తతరం నాయకులతోనే రాయలసీమకు న్యాయం రాజధాని ప్రకటనతో ముఖ్యమంత్రి సీమ వాసులను కించపర్చారు “శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలతో పాటు హోం శాఖల నివేదికలు కూడా రాజధానిగా విజయవాడ అనుకూలం కాదని తేల్చి చెప్పాయి.. సోషల్ అసెస్‌మెంట్ కమిటీ వారు రాజధానికి విజయవాడ అనుకూలం కాదని తేల్చిచెప్పారు.. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రాష్ట్ర రాజధాని సాధన […]పూర్తి వివరాలు ...

పాటలు

ఏందిర ఈ సీంబతుకు (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

చింతల చీకట్లో–రైతన్నల కన్నీళ్లు వలసల వాకిట్లో–కూలన్నల పడిగాపులు కొలువుల పిలుపుకై–చదువరులా ఎదురుచూపు ఏందిర ఈ సీంబతుకు–ఎన్నాళ్లీ దేబిరింపు //చింతల// సీమ బీడు సాకుజూపు–నీటి వాట తెస్తారు వాన రాలేదనిఏడ్చి– రాయితీలు రాబట్తరు రాజకీయ రాబందులె–పంచేసు కొంటారు పల్లె జనాల నోట –దుమ్ము కొట్టుతుంటారు //చింతల// నీరు మీరు అంటారు–కన్నీరై కారుతారు కాళ్లబేరానికొచ్చి–ఓట్లనడుక్కు తింటారు కుర్చీలు ఎక్కగానె–కొండచిలువలైపోయి దిగమింగే కార్యాన్ని– దీక్ష తోన చేస్తారు //చింతల// వానలుకురిసే చోటుకు–వరదలు పొంగేనేలకు ప్రాజక్టుల నీళ్లన్నీ–సంతర్పణ చేస్తారు ఎడారి బీడు సీమకేమొ– […]పూర్తి వివరాలు ...