రాజంపేట పట్టణ విశేషాలు, చరిత్ర, జనాభా వివరాలు మరియు ఫోటోలు. రాజంపేటకు వెళ్లే వారి కోసం అవసరమైన సమాచారం మరియు సూచనలు.పూర్తి వివరాలు ...
Tags :rajampeta
రాజంపేట: కడప జిల్లాలో ప్రభుత్వం 30వేల పింఛన్‌లు తొలగించిందని వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు. రాజంపేటలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్ని మభ్య పెట్టేందుకే ప్రభుత్వం జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చిందని పేర్కొన్నారు. జన్మభూమికి కేటాయించిన నిధులు మంత్రులు, అధికారులు తిరిగేందుకే సరిపోతాయన్నారు. రుణమాఫీ అంటూ రైతులను, డ్వాక్రా మహిళలలను బురిడీ కొట్టించారన్నారు. ఎన్నో ఆశలతో అధికారంలో కూర్చోబెట్టిన జనాన్ని నట్టేట ముంచడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పని […]పూర్తి వివరాలు ...
రాజంపేట: విప్‌ను ధిక్కరించి తెదేపాకు ఫిరాయించిన రాజంపేట మండలపరిషత్తు అధ్యక్షురాలు సుహర్లతపై అనర్హత వేటు పడింది. ఈమె ఏప్రిల్‌లో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో మండలంలోని వూటుకూరు-2 ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా తరుపున పోటీచేసి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో తెదేపా ప్రలోభాలకు లొంగి ఈమె వైకాపా నుండి ఫిరాయించి లాటరీ పద్ధతిలో తెదేపా తరపున ఎంపీపీగా ఎన్నికయ్యారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించడం వల్ల వైకాపా నాయకులు ఎన్నికల కమిషన్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో అధికారులు విచారణ […]పూర్తి వివరాలు ...
జిల్లాలో తెదేపా తరపున రాజంపేట శాసనసభ్యుడిగా గెలుపొందిన మేడా మల్లికార్జునరెడ్డికి అసెంబ్లీ విప్‌గా పదవి లభించింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లా నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి చంద్రబాబునాయుడు కొలువులో మంత్రిపదవి దక్కుతుందని అందరూ ఊహించారు. కానీ నారా వారు కడప జిల్లాను పక్కన పెట్టేయ్యడంతో మొదటి విడతలో మేడా వారికి మంత్రిగిరీ దక్కలేదు. కనీసం మలివిడతలో మంత్రిపదవి లభిస్తుందని మేడా వారు ఆశపడ్డారు. శుక్రవారం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా […]పూర్తి వివరాలు ...
2014 సార్వత్రిక ఎన్నికలలో రాజంపేట శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 20 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. రాజంపేట శాసనసభ స్థానం నుండి తెదేపా మరియు భాజపాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మేడా మల్లిఖార్జున రెడ్డి గెలుపొందారు. రాజంపేట శాసనసభ స్థానంలో ఆయా అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి … మేడా మల్లిఖార్జున రెడ్డి […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని రాజంపేట లోక్‌సభ స్థానం నుండి వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి గెలుపొందారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల తరపున ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీచేశారు. రాజంపేట లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసిన అభ్యర్తులకు దక్కిన ఓట్ల వివరాలు… మిథున్ రెడ్డి పి.వి – వైకాపా – 601752 (52.23%) పురందేశ్వరి దగ్గుబాటి – భాజపా […]పూర్తి వివరాలు ...
రాజంపేట లోక్‌సభ స్థానానికి వైకాపా తరపున పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులను ఢీకొని అధిక మెజారిటీతో ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలిసారిగా చట్టసభకు పోటీ చేసిన మిథున్ పార్లమెంటు సభ్యునిగా గెలుపొందడం కూడా విశేషమే. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీలో దిగారు. పురందేశ్వరి, సాయిప్రతాప్ ఇక్కడ మిథున్‌రెడ్డిని […]పూర్తి వివరాలు ...
రాజంపేట శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 20 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 20 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది. రాజంపేట శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల జాబితా మరియు వారికి కేటాయించిన గుర్తులు … 1 అమర్ నాద్ రెడ్డి ఆకేపాటి – వైకాపా – సీలింగ్ ఫ్యాన్ 2 సురేష్ […]పూర్తి వివరాలు ...
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజంపేట మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గత ఉపఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించినప్పటికీ సామాజిక సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పసుపులేటి బ్రహ్మయ్యకు టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అప్పటి నుంచి టీడీపీలో మదన్ అంటీ అంటనట్లుగా కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించినప్పటికీ ఆయన పట్ల చంద్రబాబునాయుడు మొగ్గుచూపలేదు. మదన్‌తోపాటు బ్రహ్మయ్యను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన మేడా మల్లికార్జునరెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈనేపథ్యంలో ఇటీవల తన వర్గీయులతో […]పూర్తి వివరాలు ...