సరస్వతిపుత్ర శ్రీ పుట్టపర్తి వారి శివతాండవం పై వ్యాఖ్య శివరాత్రి వచ్చిందంటే చాలు ఆ చిదానందరూపుడి వైభవాన్ని తలుచుకుంటూ ఉంటాం. మూడుకన్నులు.. మెడలో నాగులు.. ఒళ్లంతా విభూది.. ఈ వెండికొండ వెలుగు రేడు గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. ఇక ఆనందమొచ్చినా.. ఆగ్రహమొచ్చినా.. అనుగ్రహించే శివతాండవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ శివతాండవ చిత్రాన్ని ప్రముఖ కవి పుట్టపర్తి నారాయణాచార్యులు అత్యద్భుతంగా ఆవిష్కరించారు. శివతాండవమట-శివలాస్యంబట.. ఏమానందం-ఏమానందం, ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు అంటూ శివుడి నాట్యానికి సరితూగేలా […]పూర్తి వివరాలు ...
Tags :puttaparti
‘ఏమానందము భూమీతలమున శివతాండవమట.. శివలాస్యంబట! వచ్చిరొయేమో వియచ్ఛరకాంతలు జలదాంగనలై విలోకించుటకు ఓహోహోహో.. ఊహాతీతము ఈయానందము ఇలాతలంబున..!’ సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రొద్దుటూరు అగస్తేశ్వరస్వామి ఆలయంలో 18 రోజుల్లో రాసిన ‘శివతాండవంలోనివి ఈ పంక్తులు’. సంగీతం, సాహిత్యం మిళితమై నాట్యానికనుగుణంగా ఉన్న ఈ రచన ఆయనకు అనంత కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది.పూర్తి వివరాలు ...