పిల్లల్ని బడికి పంపడానికిపెద్దలు తాయిలం పెడతారు. అయితే మేఘనాథ్ తండ్రికి.. బడే తాయిలం అయింది! ‘పశువుల పని పూర్తి చేస్తేనే… ఇవాళ నీకు బడి…’ అని తండ్రి పెట్టే ఆశకు, చదువుపై ఉన్న ఇష్టానికి మధ్య… గొడ్ల చావిడిలో ఆయన బాల్యం నలిగిపోయింది! అదిగో అలా పడింది ఈశ్వర్‌రెడ్డి మనసులో… తన పిల్లల చదువు… తన చదువులా తాయిలం కాకూడదని. చదువే సర్వస్వం అన్నాడు. చక్కగా చదివించాడు. అందుకే… సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించిన మేఘనాథ్ సక్సెస్‌స్టోరీలో […]పూర్తి వివరాలు ...
Tags :proddatur
కడప నగరంలో పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని సిటీ బస్సులు నడపాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నిర్మల అన్నారు. శుక్రవారం నగరం, పురపాలక సంస్థ కమిషనర్లు, అర్టీసీ, ఇతర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కడప నగరంతో పాటు ప్రొద్దుటూరు పురపాలకలో కూడా సిటీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అందుకు పురపాలక సంస్థల అధికారులు సహకరించాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరా, భూసేకరణ, రోడ్లు వెడల్పు, ఆక్రమణలు, తదితరాలపై సమీక్షించడం […]పూర్తి వివరాలు ...
కడప : ప్రొద్దుటూరు పట్టణంలో నవంబరు 2వ వారంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (Science fair) నిర్వహించనున్నట్లు డీఈవో కె.అంజయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాదు ఎస్‌సీఈఆర్‌టీ డైరక్టర్ నవంబరు 2వ వారంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించాలని ఆదేశించారన్నారు. కావున ప్రధానోపాధ్యాయులందరూ వారి పాఠశాలల నుంచి ఒక ఉపాధ్యాయుడిని, ఇద్దరు విద్యార్థులను, ఒక ఎగ్జిబిట్‌తో పంపాలని కోరారు.పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: జిల్లా అభివృద్ధికి, తాగునీటి ఎద్దడి నివారణకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలని జిల్లాలోని ముగ్గురు మంత్రులమయిన సీ.రామచంద్రయ్య, అహ్మదుల్లా, తాను ఎన్నో సార్లు కలిసి విన్నవించినా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించడంలేదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలిసేందుకు శుక్రవారం ప్రొద్దుటూరుకు వచ్చిన డీఎల్ ఈ మ్లేరకు విలేకరులతో మాట్లాడారు.పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారికి చేయించిన వజ్రకిరీట సంప్రోక్షణ కార్యక్రమంలో శుక్తరవారం తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. 10.50 గంటలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రొద్దుటూరు చేరుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు ఆయనకు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు.పూర్తి వివరాలు ...
‘ఏమానందము భూమీతలమున శివతాండవమట.. శివలాస్యంబట! వచ్చిరొయేమో వియచ్ఛరకాంతలు జలదాంగనలై విలోకించుటకు ఓహోహోహో.. ఊహాతీతము ఈయానందము ఇలాతలంబున..!’ సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రొద్దుటూరు అగస్తేశ్వరస్వామి ఆలయంలో 18 రోజుల్లో రాసిన ‘శివతాండవంలోనివి ఈ పంక్తులు’. సంగీతం, సాహిత్యం మిళితమై నాట్యానికనుగుణంగా ఉన్న ఈ రచన ఆయనకు అనంత కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది.పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: ఈనెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రొద్దుటూరుకు రానున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ బుధవారం సాయంత్రం స్థానిక అధికారులతో కలిసి హెలిప్యాడ్ నిర్మాణానికి అనువైన ప్రదేశాలను పరిశీలించారు. మొదట గోపవరం గ్రామ పంచాయతీలోని కొర్రపాడు రోడ్డు రింగ్ రోడ్డు వద్ద ఉన్న అపెరల్ పార్కు దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశాన్ని, తర్వాత పాలిటెక్నిక్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు.పూర్తి వివరాలు ...
ఇవి ప్రొద్దుటూరు బండెద్దులు… కడప జిల్లా కోడెద్దులు…. రంకేసి కాలు దువ్వితే ఎంతటి బండయినా పరుగులు తీయాల్సిందే! గాడి వదలి పోటీకి వెళితే బహుమతులు వాటి సొంతమే. విజేతలుగా ఇల్లు చేరి యజమానుల మోజు తీర్చే ఈ ఎద్దులు వారికి కన్నకొడుకులతో సమానం. ఈ బండలాగుడు ఎద్దులపై దోమ వాలినా వారిని కుట్టినట్లే బాధపడతారు. భీముడనే ఓ ఎద్దు ఇటీవల ఆకస్మిక మృతి చెందగా, దాని సంస్మరణ జరుపుతున్నారంటే వీటిపై యజమానులకుండే మమకారం వేరే చెప్పాల్సిన అవసరం […]పూర్తి వివరాలు ...
1929 (౧౯౧౯౨౯) మే 17 వ తారీఖున గాంధీజీ కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు ప్రొద్దుటూరుకు చేరినారు. మహాత్మా గాంధి అమ్మవారిశాలను సందర్శించి శ్రీ వాసవీ మాతను సేవించారు. ఈ అన్ని చోట్లా గాంధీజీని అత్యంత ఉత్సాహముతో ఆదరించి సన్మానించారు. ముద్దనూరులో… గాంధీజీ రాత్రి 9 గంటలకు ముద్దనూరు చేరినారు. ముద్దనూరులో గాంధీజీ దర్శనార్థం , అక్కడకు 12 మైళ్ళ దూరములో ఉన్న జమ్మలమడుగు […]పూర్తి వివరాలు ...