Tags :peddacheppali temples

ఆలయాలు చరిత్ర

పెద్దచెప్పలి ఆలయాలు – చరిత్ర

కమలాపురం సమీపం లోని పెద్దచెప్పలి గ్రామంలో వెలసిన పురాతన దేవలాలకు ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. అగస్త్యేశ్వర ఆలయం ఇక్కడి కామాక్షి సహిత అగస్త్యేశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రేనాటి చోళరాజైన పుణ్యకుమారుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన పెద్దచెప్పలిని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. తన శాసనాలన్నింటినీ తెలుగులోనే వాడాడనటానికి అగస్త్యేశ్వరాలయంలోని స్తంభాలకు చెక్కబడిన తెలుగు శాసనాలే నిదర్శనం. ఇక్కడి ఆలయంలోని మూలవిగ్రహాలను అగస్త్యముని ప్రతిష్ఠించినట్లు మాలేపాడు శాసనం ద్వారా తెలుస్తోంది. […]పూర్తి వివరాలు ...