Tags :padyam

వేమన పద్యాలు

హిమధాముడు లేని రాత్రి హీనములు సుమతీ

పికము వనములోన విలసిల్ల పలికిన భంగి ప్రాజ్ఞజనుల పలుకు గులుకు కాకి కూత బోలు కర్మబద్ధుల కూత విశ్వదాభిరామ వినురవేమ బుద్ధిమంతుల మాటలు తోటలోని కోకిల స్వరంలాగ మనోహరంగా ఉంటాయి. కాని అల్ప బుద్ధుల మాటలు అట్లా కాదు. కాకి కూతల్లా కర్ణ కఠోరంగా ఉంటాయంటున్నాడు వేమన. ప్రాజ్ఞుడు అంటే పండితుడు. అతడు కర్మదూరుడు. అంటే కర్మల్లో చిక్కుపడనివాడు. కోకిల లాగ మధురంగా మాట్లాడుతాడు. రెండోవాడుపూర్తి వివరాలు ...

వేమన పద్యాలు

వేమన వెలుగులు

ఆశల తెగ గోసి అనలంబు చల్లార్చి గోచి బిగియ బెట్టి కోపమడచి గుట్టు మీరువాడు గురువుకు గురువురా విశ్వదాభిరామ వినురవేమ కోరికలను మొదలంటా నరికేసుకోవాలి. మనసులో చెలరేగే మోహమనే నిప్పును ఉపశమింపజేసుకోవాలి. కామ ప్రక్రియతో పనిలేకుండా అంటే గోచిని విప్పే పనిలేకుండా చేసుకోవాలి. అయినదానికీ కానిదానికీ వచ్చే కోపాన్ని నిర్మూలించుకోవాలి. అప్పుడే బ్రహ్మ రహస్యం తెలుస్తుంది. అలా తెలుసుకున్నవాడే గురువవుతాడు. గురువు కాదు పరమ గురువవుతాడు అని సెలవిస్తున్నాడు వేమన.పూర్తి వివరాలు ...