అనంతపురం గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర సోమవారం సాయంత్రం ఘనంగా ముగిసింది. శనివారం తెల్లవారు జామున అనంతపురం గంగమ్మ ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం కుర్నూతల గంగమ్మ ఆలయానికి రాగానే నిండు తిరునాళ్ల ప్రారంభమైంది. సోమవారం మైల తిరునాళ్ల నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించి, జాతర నిర్వహణ ముసిగిందని ప్రకటించారు. గత మూడు రోజుల పాటు అనంతపురం గ్రామం జనసంద్రంగా మారింది. […]పూర్తి వివరాలు ...
Tags :lakkireddypalle
భారతదేశపు దూర దక్షిణ ప్రాంతానికి కర్నాటకమని పేరు. ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధాలు కర్నాటక యుద్ధాలుగా పేరు పొందాయి. భారతదేశంలో ఆంగ్ల, ఫ్రెంచి రాజకీయ భవితవ్యమును ఈ కర్నాటక యుద్ధాలే నిర్ణయించినాయి. ఈ యుద్ధాలే ఆంగ్ల సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినట్లు చరిత్ర చెబుతోంది. క్రీ.శ.1748-56 సంవత్సరాల మధ్య జరిగిన రెండవ కర్నాటక యుద్ధంలో కడప నవాబు మౌసింఖాన్ (మూచామియా), కర్నూలు నవాబు హిమ్మత్ బహదూర్ ఖాన్ లు పాల్గొని అనేక రాజకీయ హత్యలకు కారణమైనారు. దక్కన్ […]పూర్తి వివరాలు ...