మైదుకూరు: ప్రజా ప్రతినిధుల సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కెవీ రమణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి శుక్రవారం శాసనసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఆహ్వానించి, ఆపై పోలీసుల ద్వారా అడ్డుకొని ప్రజాప్రతినిధులను అవమానపరిచారని ఈ నేపథ్యంలో సెక్షన్ 168 కింద విచారణకు స్వీకరించి చర్యలు చేపట్టాలని ఆయన స్పీకర్‌ను కోరారు.పూర్తి వివరాలు ...
Tags :kv ramana
కడప: “అన్ని జిల్లాల్లో ఉన్నట్లు ఇక్కడ పరిశ్రమలు లేవు, పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన వాతావరణం జిల్లాలో లేదు. పెట్టుబడి పెట్టేటప్పుడు పారిశ్రామిక వేత్తలు అనువైన పరిస్థితులను ఎంచుకుంటారు. భూములు ఇస్తామన్నా ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక్కడి వారికి ఆవేశం ఎక్కువ అనే అభిప్రాయం ఉంది. ఆ కారణంగానే భయపడుతున్నారు. అంతే తప్ప జిల్లాపై ఎలాంటి రాజకీయ వివక్ష లేదు. జిల్లాలో ఆస్పత్రుల ఏర్పాటు, తాగునీటి పథకాల్లో కూడా రాజకీయాలు చేస్తున్నారు.” అని […]పూర్తి వివరాలు ...
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని కడప జిల్లా కొత్త కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. సోమవారం జాయింట్ కలెక్టర్ రామారావు నుంచి ఆయన కడప జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2003 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ రమణకు జాయింట్ […]పూర్తి వివరాలు ...