Tags :kadapa

అభిప్రాయం

అలాంటి ప్రశ్న అడగవచ్చునా?

కడప జిల్లాకు కలెక్టర్ గా నియమితులైన కే.వీ. రమణ గారిని ఒక పాత్రికేయ మిత్రుడు అడిగిన ప్రశ్న చూడండి. ప్ర: రాయలసీమలో తొలిసారిగా పనిచేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా? స: మొదటి నుంచి కోస్తా, తెలంగాణ జిల్లాల్లో నా సర్వీసు అంతా కొనసాగింది. 2000 సంవత్సరంలో సత్యసాయిబాబా 75వ జన్మదిన వేడుకల సమయంలో రెండున్నర నెలలపాటుఅనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓఎస్డీగా పనిచేశాను. అది మినహా రాయలసీమలో ఎక్కడా పని చేయలేదు. అధికారులు, ప్రజలతోపాటు, పార్టీలతో సంబంధం లేకుండా […]పూర్తి వివరాలు ...

వార్తలు

కడప జిల్లాకు కొత్త కలెక్టర్

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని కడప జిల్లా కొత్త కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. సోమవారం జాయింట్ కలెక్టర్ రామారావు నుంచి ఆయన కడప జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2003 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ రమణకు జాయింట్ […]పూర్తి వివరాలు ...

వార్తలు

సీమ కోసం గొంతెత్తిన సాహితీకారులు

రాయలసీమ స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని రాయలసీమకు చెందిన కవులు, రచయితలు డిమాండ్ చేశారు. తుఫానులు, భూకంపాల ప్రాంతంగా జిఎస్‌ఐ నివేదిక పేర్కొన్న విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అశాస్త్రీయమని వారు గుర్తు చేశారు. కడప సిపిబ్రౌన్ గ్రంధాలయ పరిశోధన కేంద్రంలో కుందూ సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాయలసీమ కవులు, రచయితలతో సమాలోచన జరిగింది. ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేంద్రసాహితీ అకాడమి అవార్డు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

చింతకొమ్మదిన్నెలో ‘కత్తి’ సినిమా షూటింగ్

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటిస్తున్న ‘కత్తి’ సినిమా చిత్రీకరణ గురువారం చింతకొమ్మదిన్నెలో జరిగింది. స్థానిక అంగడివీధి సమీపంలోని తెలుగుగంగ కార్యాలయ ఆవరణలో షూటింగ్ నిర్వహించారు. తెలుగుగంగ కార్యాలయం ముందు తమిళంలో కలెక్టరేట్ బోర్డుతో చిత్రీకరణ జరిపారు. పేదలు తమ సమస్యల్ని చెప్పుకునేందుకు రావడం.. పోలీసులు వారితో చర్చించడం తదితర సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో హీరో విజయ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ షూటింగ్‌లో రెండో రోజున సమంత […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

పాలకవర్గాలు ఏర్పడినాయి!

కడప నగరపాలికతోపాటు, ఆరు పురపాలికల్లో పాలకవర్గాలు గురువారం కొలువు దీరాయి. జమ్మలమడుగులో మాత్రం ఓ కౌన్సిలర్ కనిపించకుండా పోవడంతో తెదేపా నేతలు వీరంగం చేశారు. దీంతో అక్కడ పాలకవర్గం ఎన్నికను ఈరోజుకు వాయిదా వేశారు. బద్వేలులో ఛైర్మన్‌గా తెదేపా కౌన్సిలర్ పార్థసారధిని ఎన్నుకోగా, వైస్ ఛైర్మన్ అభ్యర్థిపై స్పష్టత రాకపోవడంతో ఆ ఎన్నిక వాయిదా వేశారు. కడప నగరపాలికలోని మేయర్, డిప్యూటీ మేయర్, ఏడు పురపాలికల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు గురువారం ఎన్నిక నిర్వహించారు. అన్ని చోట్లా […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

పురపాలికల ఏలికలెవరో తేలేది నేడే!

 ఈరోజు కడప కార్పొషన్‌తోపాటు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, రాయచోటి పురపాలికల పాలకవర్గం కొలువుదీరనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. కార్పొరేటర్లు/ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం కడపలో మేయర్, డిప్యూటీ మేయర్, ఆయా పురపాలక సంఘాలలో చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎంపికకు ఎన్నికలు జరుగన్నాయి. కలెక్టర్ కోన శశిధర్ కడప కార్పొరేషన్ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. కొత్త పాలకవర్గాల ఎన్నికకు కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని  మున్సిపాలిటీలు ముస్తాబయ్యాయి. ఎన్నికకు కేవలం […]పూర్తి వివరాలు ...

వార్తలు

రాజధాని కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

రాజధానిని సీమలో ఏర్పాటుచేయడమనేది డిమాండు కాదని, తమ హక్కు అని రాయలసీమ విద్యార్థి వేదిక నినదించింది. రాజధాని విషయం కోస్తా నాయకులు, వారికి వంత పాడుతున్న సీమ ఏలికల కుట్రలను ప్రతిఘటిస్తామని విద్యార్థులు నినదించారు. సీమ మరోసారి నష్టపోకుండా రాజధానిని ఇక్కడే ఏర్పాటుచేయాలని, లేదంటే విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రతిఘటన తప్పదని విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని ఐటీఐ కూడలి నుంచి కోటిరెడ్డి కూడలి వరకూ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఎఫ్ కన్వీనరు భాస్కర్, […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

జులై 2న కడప విమానాశ్రయం ప్రారంభం కానుందా?

కడప విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి ఈనాడు దినపత్రిక ఇవాల్టి కడప టాబ్లాయిడ్లో ఒక కధనాన్ని ప్రచురించింది. ఆ కధనం ప్రకారం … జులై 2న కడప విమానాశ్రయంలో విమానాలు దిగనున్నాయి. ఢిల్లీ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. విమానాశ్రయ సంబంధిత ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రారంభ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఇదివరకు కూడా ఈనాడు, సాక్షి దినపత్రికలు ఇదే మాదిరి కధనాలను చాలా సార్లు ప్రచురించాయి. గత సంవత్సరం […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

మీ కోసం నేను రోడెక్కుతా!

వైకాపా అధినేత జగన్‌ ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో గురువారం నగరంలోని వైఎస్ గెస్ట్ హౌస్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి కార్పొరేటర్‌ను పరిచయం చేసుకున్నారు. సమావేశానికి వచ్చిన కార్యకర్తలను పలకరిస్తూ వారికి ధైర్యం చెపుతూ కన్పించారు. వచ్చిన వారందరితో బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసి, ఫొటోలు దిగారు. ప్రతి కార్యకర్త చెప్పే మాటలను వింటూ ఎంపీ అవినాష్ ఉన్నాడు… ఎమ్మెల్యేలు అంజాద్‌బాష, రవిరెడ్డి, సురేష్‌బాబులు ఉన్నారంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం […]పూర్తి వివరాలు ...

error: