Tags :kadapa

వార్తలు

కడపలో గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

కడప : అభ్యర్థులు ఎంతకాలంగానో కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ పరీక్ష తేదీలను ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించింది. ఈ సంవత్సరం అక్టోబరు 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల ప్రిపరేషన్‌కు బాగా సమయం ఉండడం కొంత సౌలభ్యం. ఇంతకుమునుపు అభ్యర్థులు కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాదు వంటి నగరాలకు వెళ్లి వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇది తలకుమించిన భారంగా […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

వైభవంగా ఎర్రదొడ్డిపల్లి పురిగమ్మ వేల్పు

గాలివీడు: గాలివీడు మండలంలోని చీమలచెరువుపల్లి పంచాయతీ ఎర్రదొడ్డిపల్లిలో పురిగమ్మ వేల్పు శుక్ర, శనివారం ఘనంగా జరిగింది. 15 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేల్పునకు ప్రజలు భారీగా హాజరయ్యారు. శుక్రవారం రాత్రి వివిధ గ్రామాల నుంచి 12 నాణములు వేల్పులో పాల్గొన్నాయి. ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. శనివారం సాయంత్రం నిర్వహించిన దేవతా నాణములతో నీలకర్త కార్యక్రమం, పూజ, గందోడి కోలలాడే సంబరాలు,.పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడప నగరంలో తితిదే ఈ-సేవ కౌంటర్

కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ వెంకటేశ్వరస్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు. అందుకే ఆయన సన్నిధి ఎప్పుడూ జనసంద్రమే. ఆ స్వామిని సులభంగా దర్శించుకునే అవకాశం కల్పించడానికి, ఆయన సన్నిధిలో ఆర్జిత సేవలందించడానికి, తిరుమల గిరిపై శ్రమ లేకుండా ఒకరోజు సేద తీరేందుకు గదిని సంపాదించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ పద్ధతిలో ఈ-సేవ కౌంటర్లను ఏర్పాటు చేశారు.కడప నగరంలో మద్రాసురోడ్డులోని టీటీడీ కల్యాణ మండపంలో ఈ-సేవా కౌంటర్ ఏర్పాటు చేశారు.పూర్తి వివరాలు ...

చరిత్ర ప్రత్యేక వార్తలు

ప్రొద్దుటూరు మున్సిపాలిటికీ 96 వసంతాలు !

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పురపాలక సంఘాన్ని  ఏర్పాటు చేసి 96 సంవత్సరాలు గడిచాయి. 1915వ సంవత్సరంలో రామేశ్వరం, మోడంపల్లె, నడింపల్లె, బొల్లవరం గ్రామాలను కలిపి ప్రొద్దుటూరు మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.  2014 సంవత్సరంతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ శత వసంతాలు పూర్తి చేసుకోనుంది. తృతీయ శ్రేణి పురపాలక సంఘం నుంచి ప్రత్యేక స్థాయి మున్సిపాలిటీకి ఎదిగింది . ఐదారు గ్రామ పంచాయితీలను వీలినం చేసి అప్పట్లో ప్రొద్దుటూరు పురపాలక  సంఘాన్ని ఏర్పాటు చేశారు. .పూర్తి వివరాలు ...

అభిప్రాయం ప్రత్యేక వార్తలు

నిరాదరణకు గురైంది తెలంగాణా కాదు, రాయలసీమే -శ్రీ కృష్ణ కమిటీ

రాయలసీమలో 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో మూడు ప్రాంతాలను పోల్చి చూసినట్లయితే జీవనప్రమాణాలు బాగా దిగజారాయని,నిరాదరణకు గురయిన ప్రాంతం తెలంగాణా కాదనీ రాయలసీమేనని శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర అభివృద్ధి పై దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి అవలంభించిన దృక్ఫధాన్నే శ్రీ కృష్ణ కమిటీ కూడా ప్రతిబింబించడం గమనార్హం! గ్రామీణ ప్రాంతాల్లో ఆ దశాబ్దకాలంలో ఆదాయంలో మార్పులను గమనించినట్లయితే తెలంగాణలో సంపన్న వర్గాల్లోనే ఆదాయ వృద్ధి కనిపించింది.పూర్తి వివరాలు ...

అభిప్రాయం వార్తలు

” సీమ” భూమి పుత్రుడు “మాసీమ”కు జోహార్..!

రాయలసీమ ఉద్యమనేత, సీనియర్ పాత్రికేయుడు మాసీమ రాజగోపాల్ రెడ్డి గురువారం (19-05-2011) తెల్లవారుఝామున కడపలోని తమ స్వగృహంలో కన్ను మూశారు. రాయలసీమ జనబాహుల్యంలో “మాసీమ” గా ప్రసిద్ధుడైన రాజగోపాల్ రెడ్డి  వయస్సు 80 సంవత్సరాలు. వెనుకబడిన రాయల సీమ అభివృద్ధి పట్ల, ఈ ప్రాంత ప్రజ సమస్యల పట్ల ఎనలేని శ్రద్ధతో పోరు సాగించిన ఈ ధీరోదాత్తుని మరణం రాయల సీమ ప్రజానీకానికి పిడుగు పాటు లాంటిదే! ..పూర్తి వివరాలు ...

వార్తలు

మాసీమ రాజగోపాల్‌రెడ్డి ఇక లేరు !

కడప : సీనియర్ పాత్రికేయుడు, రాయలసీమ ఉద్యమనేత మాసీమ రాజ్‌గోపాల్‌రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు.ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.   ‘మాసీమ’ పత్రికను స్థాపించి సీమ గళాన్ని వినిపించడంలో రాజగోపాల్ తనదైన పాత్రను పోషించారు. ఆ తరువాతి కాలంలో ‘మాసీమ’ అనేది ఆయన పేరులో భాగమయ్యింది. రాయలసీమ వెనుకబాటుతనం పైనా, ఇక్కడి సాగునీటి అవసరాలపైనా జరిగిన ఉద్యమాలలో రాజగోపాల్ చురుకైన పాత్ర పోషించారు. ఆయన కుటుంబ సభ్యులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప […]పూర్తి వివరాలు ...

వార్తలు

24న రిమ్స్‌లో వాక్-ఇన్-ఇంటర్వ్యూలు

కడప : రిమ్స్ వైద్య కళాశాలలో ట్యూటర్స్, జూనియర్ రెసిడెంట్ డాక్టర్లగా కాంట్రాక్టు పద్దతిన పనిచేసేందుకు ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ (ఉదయం 10.30 గంటలకు) జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూకు  హాజరు కావాలని కళాశాల ఇన్‌చార్జి డెరైక్టర్ డాక్టర్ ఓబులేశు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు: ట్యూటర్స్‌కు ఎంబీబీఎస్ డిగ్రీ, ఎంఎస్సీ మెడికల్ ఫిజియాలజీ, ఫెథాలజీ, మైక్రో బయాలజీపూర్తి వివరాలు ...

రాజకీయాలు

వివేకా పయనమెటు?

పులివెందుల ఉప ఎన్నికలలో పరాజయం పాలైన వివేకానందరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవికి రాజనామా చేసిన అనంతరం తనకు పదవి ముఖ్యంకాదని, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతనే పదవి చేపడతానని, తన సేవలు అవసరం అనుకుంటే ప్రజలు గెలుపించుకుంటారని వివేకా ప్రకటించిన సంగతి తెలిసిందే.   తన అన్న అడుగుజాడల్లో నడుస్తానని, ఆయన ఆశయసాధనకు కట్టుబడి ఉంటానని, నియోజకవర్గంలో అర్ధంతరంగా నిలిచిన అభివృద్ధి పనులను భుజాలపై వేసుకుని వైఎస్‌ కలల సాకారం […]పూర్తి వివరాలు ...

error: