కడప జిల్లా నిర్లక్ష్యం నీడలో మగ్గుతుండేది. జిల్లా వాసి వైఎస్ 2004లో సీఎం అయ్యాక అభివృద్ధి పరుగులు తీసింది. మునిసిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్‌గాను, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లాలో యోగివేమన యూనివర్శిటీ, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, పశువైద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలోరూ.130 కోట్లతో రిమ్స్ వైద్య కళాశాలపూర్తి వివరాలు ...
Tags :kadapa
న్యూఢిల్లీ: తన సంస్థలలో పెట్టుబడులు, తన ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటీషన-ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీనిపై సుప్రీం కోర్టులో రెండు గంటలసేపు వాదనలు జరిగాయి. జగన్ తరపున ప్రముఖ న్యాయవాదులు రామ్ జెఠ్మాలనీ, ముకుల్ రోహత్గీ వాదించారు. సిబిఐ విచారణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. విచారణ జరుగుతున్న ఈ సమయంలో […]పూర్తి వివరాలు ...
న్యూఢిల్లీ: వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, కడప ఎంపి జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు సహజ న్యాయసూతాలకు వ్యతిరేకం అని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మాలానీ సుప్రీం కోర్టులో వాదించారు. జగన్ దాఖలు చేసిన లీవ్ పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ ప్రారంభమైంది. జగతి పబ్లికేషన్స్, సాక్షి టీవీల్లో పెట్టుబడులు, తన ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ ఆయన సుప్రీం కోర్టులో మూడు పిటిషన్లు […]పూర్తి వివరాలు ...
ప్రపంచంలో గల వృక్ష సంపదలో దాదాపు 12శాతం మొక్కలు భారత దేశంలో వున్నాయి. దేశంలో 5 వేల శైవలాల జాతులు, 1,600 లైకెన్ జాతులు, 20వేల శిలీంధ్ర జాతులు, 2,700 బ్రయోఫైట్‌లు, 600 టెరిడోఫైట్‌లు, 18000 పుష్పించు మొక్కల జాతులువున్నాయి.రాయలసీమ వైశాల్యం 69,043 చదరపు కీలోమీటర్లు. రాయలసీమలో మూడు రకాల అడవులున్నాయి.చిత్తడి ఆకురాల్చు అడవులు, మొదటివి. కర్నూలు జిల్లాలోనిపూర్తి వివరాలు ...
పులివెందుల, ఆగస్టు 11 : అవినీతి, అక్రమాల విషయంలో మచ్చలేని కుటుంబం తమదని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. స్థానిక లయోలా కళాశాల అవరణలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతి, అక్రమాల పర్వం తమ వంశంలోనే లేదన్నారు. మంచి తనం నేర్పించిన తమ తల్లిదండ్రులు మంచి బుద్ధిని కూడా ప్రసాదించారని తెలిపారు.పూర్తి వివరాలు ...
కడప : ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసిన వారి జాబితాలో తాజాగా కందుల సోదరులు చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బొత్సను కలిసి అభినందలు తెలిపారు. ఈ సందర్భంగా కందుల శివానందరెడ్డి, రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి పాటుపడిన వారికి డీసీసీ పదవి కట్టబెట్టాలని కోరారు. కడప అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు కృషి చేయాలని కోరారు. దీనికి స్పందించిన బొత్స స్థానిక సంస్థల ఎన్నికల్లో […]పూర్తి వివరాలు ...
ఇవి ప్రొద్దుటూరు బండెద్దులు… కడప జిల్లా కోడెద్దులు…. రంకేసి కాలు దువ్వితే ఎంతటి బండయినా పరుగులు తీయాల్సిందే! గాడి వదలి పోటీకి వెళితే బహుమతులు వాటి సొంతమే. విజేతలుగా ఇల్లు చేరి యజమానుల మోజు తీర్చే ఈ ఎద్దులు వారికి కన్నకొడుకులతో సమానం. ఈ బండలాగుడు ఎద్దులపై దోమ వాలినా వారిని కుట్టినట్లే బాధపడతారు. భీముడనే ఓ ఎద్దు ఇటీవల ఆకస్మిక మృతి చెందగా, దాని సంస్మరణ జరుపుతున్నారంటే వీటిపై యజమానులకుండే మమకారం వేరే చెప్పాల్సిన అవసరం […]పూర్తి వివరాలు ...
కడప : నగర శివార్లలోని రాజీవ్ గాంధీ వైద్య కళాశాల(రిమ్స్)ను శనివారం భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం తనిఖీ చేసింది. ఎంసీఐ ఇదివరకే రిమ్స్‌లో చివరి తనిఖీలు (మార్చి నెలలో) నిర్వహించింది. అప్పట్లో 562 జీవో అమలు, ఫార్మాకో విభాగం, లైబ్రరీ విభాగంలో పుస్తకాల కొరత, ఎక్స్‌రే ప్లాంట్‌లలో ఒకే యూనిట్, చెన్నూరు పీహెచ్‌సీలో కొన్ని కొరతలపై నివేదికను పంపించారు. ఆ నివేదికలతో పాటు ఎంసీఐ బృందం రిమ్స్ ఫైనలియర్ అనుమతికి కూడా ఎసరు పెట్టింది.పూర్తి వివరాలు ...
కలెక్టరేట్ ఎలా వుంటుంది? కలెక్టర్ కనుసన్నలలో నడుస్తూ, ప్రభుత్వ శాసనాల అమలును పర్యవేక్షిస్తూ నిరంతరం జన సందోహంతో రద్దీగా ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం… ఇలా రద్దీగా ఉండే కలెక్టరేట్‌లోకి అడుగుపెట్టిన రాయలసీమ పిల్లోడు దానిని పర్యవేక్షించే అధికారులను దగ్గరగా గమనించాడు. తను కూడా వారిలా ప్రజా సమస్యలను తీర్చే అధికారి కావాలని కలలు కన్నాడు.ఆ తరువాత ఆ కుర్రాడే ఐఏఎస్ అధికారిగా ఎంపికై వివిధ హోదాలలో పని చేశాడు. * * * […]పూర్తి వివరాలు ...