Tags :kadapa

వార్తలు

ఆ అంశాన్ని ఎందుకు చేర్చలేదు? – బి.వి.రాఘవులు

‘అనంతపురంతో పాటు వైఎస్సార్‌జిల్లాలో ఇనుపఖనిజం ఉంది. బ్రహ్మణి అంటారో.. కడప అంటారో… రాయలసీమ ఉక్కుఫ్యాక్టరీ అంటారో…ఏపేరైనా పెట్టుకోండి.. ఏమైనా చేయండి – ఇక్కడ ఇనుము – ఉక్కు పరిశ్రమను మాత్రం కచ్చితంగా స్థాపించి తీరాల్సిందే! అవకతవకలు జరిగాయని  ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని రకాల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది..పరిశ్రమ ఏర్పాటుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.. ‘ అని సీపీఎం రాష్ట్రకార్యదర్శి బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని పూర్తిచేయాలనే డిమాండ్‌తో పరిశ్రమ ఏర్పాటు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడపలో జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

టోర్నీకి వివిధ రాష్ట్రాల నుండి 500 మంది  కడప: నగరంలోని  వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 4 నుంచి 10 వరకూ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఏపీ బ్యాడ్మింటన్ రాష్ట్ర కార్యదర్శి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి(ఈవెంట్) పున్నయ్య చౌదరి ప్రకటించారు. ఆల్ ఇండియా సబ్‌జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహణ విషయమై ఏజేసీ సుదర్శన్‌రెడ్డిని బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పున్నయ్య చౌదరి, వైస్సార్ క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి రామచంద్రారెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

సీమ కన్నీటి ధారల ‘పెన్నేటి పాట’

ఎట్టకేలకు తెలంగాణ గొడవకు తెరదించే పనికి కాంగ్రెస్ పూనుకుంది. ఇది ఆ ప్రాంత ప్రజా పోరాట ఫలం. వారికి ధన్యవాదాలు! కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్న సీమకు కృష్ణా నికరజలాల కేటాయింపు హామీ ఏమైంది? ఈ సందర్భంలో విడిపోయే రాష్ట్రంలో సీమ వాసులు కలిసుంటే మిగిలేది మట్టే. రాయలసీమ అస్తిత్వం కొనసాగాలన్న ఇక్కడ సాగు, తాగు నీరు కావాలన్న ప్రత్యేక రాయలసీమే శరణ్యం. దీనికోసం పాలకులు, ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించాల్సిన తరుణమిది. రాయలసీమ ఎలా వంచనకు గురైంది […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడప, ప్రొద్దుటూరుల్లో సిటీ బస్సులు

కడప నగరంలో పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని సిటీ బస్సులు నడపాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నిర్మల అన్నారు. శుక్రవారం నగరం, పురపాలక సంస్థ కమిషనర్లు, అర్టీసీ, ఇతర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కడప నగరంతో పాటు ప్రొద్దుటూరు పురపాలకలో కూడా సిటీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అందుకు పురపాలక సంస్థల అధికారులు సహకరించాలన్నారు. విద్యుత్‌, తాగునీటి సరఫరా, భూసేకరణ, రోడ్లు వెడల్పు, ఆక్రమణలు, తదితరాలపై సమీక్షించడం […]పూర్తి వివరాలు ...

చరిత్ర

1921లో కడపలో మహాత్మాగాంధీ చేసిన ఉపన్యాసం …

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు. అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

గుండాల కోన

పరుచుకున్న పచ్చదనం.. పక్షుల కిలకిలా రావాలు.. గలగలపారే సెలయేరు.. నింగికి నిచ్చెన వేసినట్లున్న కొండలు.. కనువిందు చేసే కమనీయ దృశ్యాలు.. మేను పులకరించే ప్రకృతి అందాలు.. ఈ అందాలను తనివితీరా చూసి తరించాలంటే గుండాల కోనను దర్శించాల్సిందే. పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్యలో కొలువు దీరిన నీలకంఠేశ్వరుడు ఈ కోనకు ప్రత్యేక ఆకర్షణ. ఓబులవారిపల్లి మండలం వై.కోటనుంచి 15 కిలోమీటర్లు, రైల్వేకోడూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో శేషాచల అడవుల్లో గుండాల కోన క్షేత్రం ఉంది. […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా పద్మ విభూషణ్ డాక్టర్ వై.వి.రెడ్డి

కడప జిల్లాకు చెందిన పద్మ విభూషణ్ ఢాక్టర్ యాగా వేణు గోపాల్ రెడ్డి 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది అక్టోబరు 31కల్లా నివేదిక అందజేయాల్సిందిగా ఆర్థిక సంఘాన్ని కోరినట్లు ఆర్థిక మంత్రి చిదంబరం బుధవారం చెప్పారు. ఆర్థిక సంఘంలో సభ్యులుగా ప్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ (ప్రణాళికా సంఘం సభ్యుడు), సుష్మా నాథ్‌ (మాజీ కేంద్ర ఫైనాన్స్‌ కార్యదర్శి సభ్యులు), డాక్టర్‌ ఎం గోవిందరావు (డైరెక్టర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ), సుదీప్తో ముండ్లే […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

దేవుని కడప రథోత్సవం వైభవం తెలిపే అన్నమయ్య సంకీర్తన

Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మిక సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించినాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించినాడు. కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప […]పూర్తి వివరాలు ...

వార్తలు

ప్రొద్దుటూరులో తమిళనాడు గవర్నర్

ప్రొద్దుటూరు: స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారికి చేయించిన వజ్రకిరీట సంప్రోక్షణ కార్యక్రమంలో శుక్తరవారం తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. 10.50 గంటలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రొద్దుటూరు చేరుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు ఆయనకు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు.పూర్తి వివరాలు ...

error: