Tags :kadapa sahityam

కథలు

కూలిన బురుజు (కథ) – కేతు విశ్వనాధరెడ్డి

కూలిన బురుజు ఊరు దగ్గరికొచ్చింది. అంతకు ముందు లేని పిరికితనమూ, భయమూ నాలో. రెండు వారాల కిందట ఖూనీ జరిగిన ఊళ్ళోకి అడుగుపెట్టబోతున్నాను. పుట్ట చెండ్లాట మాదిరి నాటుబాంబుల్తో ఆడుకున్న గ్రామ పార్టీల ప్రపంచంలోనికి ప్రవేశిస్తున్నాను. కక్షలూ, కార్పణ్యాల అడవిలోకి వెళుతున్నాను. కొత్త అనుభవం. పదేళ్ళ కిందట జ్ఞాపకాల్లో నిలిచిన ఊరు ఇది కాదనిపిస్తోంది. పక్క కళ్ళాల్లో మేపు కోసం వాముల దగ్గర కొచ్చే రైతుల సందడి లేదు. బండ్ల బాటలో నిత్యం ఎదురవుతుండే ఎద్దుల బండ్ల […]పూర్తి వివరాలు ...

చరిత్ర వ్యాసాలు

పోతన మనుమలు స్తుతించిన ‘వరకవి సార్వభౌముడు’

బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు. దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు. ఆ గ్రంథం అముద్రితం. వావిళ్ల వారి శ్రీమదాంధ్ర భాగవత ముద్రణలోని శేషాద్రి రమణ కవుల ‘భాగవత ప్రశంస’ నుండి ఆ ప్రశంసా పద్యాన్ని ఎత్తి చూపుతున్నాను. ఆ పద్యమిది. చ|| నెఱిగుఱిగల్గు నన్నయమనీషిని దిక్కన శంభుదాసునిన్‌ బరువడి […]పూర్తి వివరాలు ...

కథలు

ఏటుకాడు (కథ) – రామకృష్ణా రెడ్డి.పోసా

ఎహె… జరగండి అవతలికి అంటాడు ఏసోబు. ఒరే… బాబ్బాబూ…. అంటారు పెద్దమనుషులు. స్నానానికి వేన్నీళ్లు పెట్టవే బోసిడీ… అని పెళ్లాన్ని తిడతాడు ఏసోబు. ఇదిగో… పెడుతున్నాను స్వామో అని పరుగు తీస్తుంది పెళ్లాము. ఇప్పుడు కాదు వెళ్లండి… రేపు అంటాడు ఏసోబు. నువ్వు ఎప్పుడంటే అప్పుడే దేవరా… అంటారు కామందులు. బీడీ- అడుగుతాడు ఏసోబు. సిగరెట్టు తీసుకో ఏటుకాడా- అని అతడి పాదాల దగ్గర పెడతారు. ఇదే ఏసోబు నిన్న మొన్నటి దాకా పూచిక పుల్ల. గాలికి […]పూర్తి వివరాలు ...

కథలు

తరం-అంతరం (కథ) – చెన్నా రామమూర్తి

ఎడ్లబండి కదిలింది. చెరువు కానుకొని ఉండే దట్టమైన చీకిచెట్ల నుంచి కీచురాళ్లు రొద చేస్తానే ఉండాయి ఆగకుండా! చుక్కలు లేని ఆకాశం చినుకులు కురిపించడానికి సిద్దమవుతున్నట్లుగా ఉంది. కందెన తక్కువై ఇరుసు చేస్తున్న శబ్దం… రాయి ఎక్కి దిగినపుడు చక్రం మీదున్న కమీ చేస్తున్న శబ్దం… ఎద్దుల గిట్టల శబ్దం… సుతారంగా కదిలే ఎద్దుల మెడలోని పట్టీల గజ్జల శబ్దాలు తప్ప ఇంకేమీ విన్పించటం లేదు. కుదుపు.. సన్నటి కుదుపు… అలాంటి కుదుపే మనసులోనూ… బండి రెడ్డిగారిండ్ల […]పూర్తి వివరాలు ...

కథలు

ఓడిపోయిన సంస్కారం (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా )

సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే ఆమె చాలా […]పూర్తి వివరాలు ...