Tags :Kadapa Loksabha

వార్తలు

జగన్ అఫిడవిట్‌ సహేతుకం: నామినేషన్‌ను ఆమోదించిన ఈసీ

కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఒక్కొక్క గండాన్ని అధిగమించి ముందుకు సాగుతున్నారు. కడప పార్లమెంట్ సీటుకు రాజీనామా చేసినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటన్నింటిని ఎదుర్కొంటూ జగన్ నామినేషన్ ఘట్టానికి చేరుకున్నారు.    ఆయన నామినేషన్ల సందర్బంగా సమర్పించిన అఫిడవిట్‌లో తప్పులున్నాయంటూ ఆయన ప్రత్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. అనేక ఆస్తులను ఆయన చూపించలేదని అందువల్ల ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేకుండా అనర్హుణ్ని చేయాలని వారు డిమాండ్ చేశారు.పూర్తి వివరాలు ...

వార్తలు

‘ఉప’ ప్రచారానికి హనుమంతుడు

కడప : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మే 1, 2, 3 తేదీల్లో కడప లోక్‌సభ సెగ్మెంట్‌లో ఆయన ప్రచార కార్యక్రమం ఖరా రైంది. కడప ఉప ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ గులాం నబీ ఆజాద్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్యల షెడ్యూల్‌ ఖరారైంది.పూర్తి వివరాలు ...