ఎదురెదురు ‘‘ఎంత ధైర్యం సార్ సురేష్‌కు! యాభైవేల రూపాయలు పోగొట్టుకొన్నే .. లెక్కజెయ్యకుండా పేకాటకాన్నించి లెయ్యనే లెయ్యడంట… అబ్బా … ఆయప్పది గుండెకాయ కాదు సార్ – ఇనపముద్ద…’’ అన్నాడు వీరారెడ్డి.స్నానం చేసి గదిలోకొచ్చి తల తడుచుకొంటున్నాను. ‘‘ఏడీ సురేష్ .. పోయినాడా?’’ అడిగాను.‘‘ఇంగా యాడుండాడు! టైమైందంట. టిఫినన్నా చేసిపోమ్మంటే కుదరదంటాడే… వాల్ల …
పూర్తి వివరాలుకూలిన బురుజు (కథ) – కేతు విశ్వనాధరెడ్డి
కూలిన బురుజు ఊరు దగ్గరికొచ్చింది. అంతకు ముందు లేని పిరికితనమూ, భయమూ నాలో. రెండు వారాల కిందట ఖూనీ జరిగిన ఊళ్ళోకి అడుగుపెట్టబోతున్నాను. పుట్ట చెండ్లాట మాదిరి నాటుబాంబుల్తో ఆడుకున్న గ్రామ పార్టీల ప్రపంచంలోనికి ప్రవేశిస్తున్నాను. కక్షలూ, కార్పణ్యాల అడవిలోకి వెళుతున్నాను. కొత్త అనుభవం. పదేళ్ళ కిందట జ్ఞాపకాల్లో నిలిచిన ఊరు ఇది …
పూర్తి వివరాలుయంగముని వ్యవసాయం (కథ) – ఎన్. రామచంద్ర
యంగమునివ్యవసాయంకథ మోచేతులు దాటి ఖాకీ చొక్కా, మోకాలు దాటి ఖాకీ నిక్కరు, గడ్డపార భుజాన ఒకవైపు పికాసి, మరోవైపు చెట్లడ్డ, పారతో యంగముని, పంగలకర్ర, మచ్చుగత్తి, ప్లాస్టిక్ బిందెతో సావిత్రి, టైర్ లేయర్‌తో చేసిన ఆకు చెప్పలు వేసుకుని చీకటి విచ్చీ విచ్చకముందే ఒకవిడత ఉప్పుతో ఊరబెట్టిన అంబలితాగి, మధ్యాహ్నానికి రెండు ఎరగడ్డలు, …
పూర్తి వివరాలుపోతన మనుమలు స్తుతించిన ‘వరకవి సార్వభౌముడు’
బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు. దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు. ఆ గ్రంథం అముద్రితం. వావిళ్ల వారి శ్రీమదాంధ్ర భాగవత ముద్రణలోని శేషాద్రి రమణ …
పూర్తి వివరాలుకుప్పకట్లు (కథ) – బత్తుల ప్రసాద్
తెల్లబాడు నుండి కలసపాటి దావంబడి నడ్సుకుంటా వచ్చాడు నారయ్య. ఆ మనిషి కండ్లు మసక మసగ్గా కనపడ్తాండయి. సొగం దూరం వచ్చాక ఎడం పక్క ఆ మనిషికి కావాల్సింది కనిపిచ్చింది. మెల్లగ నడ్సుకుంటా జిల్లేడు శెట్టుకాడికి పొయినాడు. శెట్టు బాగా ఏపుగా పెరిగింది. ఒక్కొక్క ఆకు అరశెయ్యంత ఉంది. తెల్లగా శెట్టు నిగనిగలాడతా …
పూర్తి వివరాలుఏటుకాడు (కథ) – రామకృష్ణా రెడ్డి.పోసా
ఎహె… జరగండి అవతలికి అంటాడు ఏసోబు. ఒరే… బాబ్బాబూ…. అంటారు పెద్దమనుషులు. స్నానానికి వేన్నీళ్లు పెట్టవే బోసిడీ… అని పెళ్లాన్ని తిడతాడు ఏసోబు. ఇదిగో… పెడుతున్నాను స్వామో అని పరుగు తీస్తుంది పెళ్లాము. ఇప్పుడు కాదు వెళ్లండి… రేపు అంటాడు ఏసోబు. నువ్వు ఎప్పుడంటే అప్పుడే దేవరా… అంటారు కామందులు. బీడీ- అడుగుతాడు …
పూర్తి వివరాలువానరాయుడి పాట (కథ) – వేంపల్లి గంగాధర్
“ఉత్తరాన ఒక వాన ఉరిమి కురవాల దక్షిణాన ఒక వాన దాగి కురవాల పడమరా ఒక వాన పట్టి కురవాల తూర్పున ఒక వాన తుళ్ళి కురవాల…” పాట సాగిపోతూ వుండాది. పాట ప్రవహిస్తా వుండాది. పాట పరవళ్ళు తొక్కుతా వుండాది. పాట పరవశిస్తా ఆడతా వుండాది. తెల్లటి ఆకాశం మీద నల్లటి …
పూర్తి వివరాలురాతిలో తేమ (కథ) – శశిశ్రీ
మా జిల్లాల్లో మునిరత్నం పేరు చెప్తే చాలు ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తారు. ముని అంటే ముని లక్షణాలు కానీ, రత్నం అంటే రత్నం గుణం కానీ లేని మనిషి. పేరు బలంతోనైనా మంచోడు అవుతాడనుకొని ఉంటారు పేరు పెట్టిన అమ్మానాన్నలు. కానీ అదేం జరగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాక్షసుడు అని చెప్పవచ్చు. …
పూర్తి వివరాలుఇటు గరుడని నీ వెక్కినను – అన్నమాచార్య సంకీర్తన
composer : Rallapalli Ananta krishna sarma , kedara ragam ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలె ఎగసినగరుడని యేపున’ధా’యని జిగిదొలకచబుకు చేసినను నిగమాంతంబులు నిగమసంఘములు బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు గోపించినను సరుస నిఖిలములు జర్జరితములై తిరువున నలుగడ దిరదిర దిరిగె
పూర్తి వివరాలు