Tags :bypolls

వార్తలు

కడపకు 70 కంపెనీల కేంద్ర బలగాలు

హైదరాబాద్: కడప పార్లమెంట్, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ భారీస్థాయిలో కేంద్ర బలగాలను రంగంలోకి దించుతోంది. సుమారు 70 కంపెనీల పారా మిలటరీ బలగాలను వినియోగించనున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు. దానికి అనుగుణంగా మొత్తం 127 కంపెనీల బలగాలు కావాలంటూ పోలీసుశాఖ ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదించింది.పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ఉప ఎన్నికలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు

హైదరాబాద్ : ఉపఎన్నికలు జరగనున్న కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. కడప నుంచి రాజ్యసభసభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, పులివెందుల నుంచి మర్రెడ్డి రవీంద్రనాధ్‌రెడ్డి (బీటెక్ రవి) పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే బాబు అభ్యర్థులను ప్రకటించడం ఇదే తొలిసారి. వైఎస్సార్ కడప జిల్లా నేతలు, టీడీపీ సీనియర్లుపూర్తి వివరాలు ...

రాజకీయాలు

15, 16న నామినేషన్ వేయనున్న జగన్, విజయలక్ష్మి

కడప: యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయలక్ష్మి ఈ నెల 16న నామినేషన్ వేయనున్నారు. కడప, పులివెందుల స్థానాల్లో మే 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మిపూర్తి వివరాలు ...

వార్తలు

మే 8న కడప, పులివెందుల ఉప ఎన్నికలు

ఏప్రిల్ 11న నోటిఫికేషన్.. మే 8న పోలింగ్.. మే 13న కౌంటింగ్ జిల్లాలో అమల్లోకి ఎన్నికల నియమావళి కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాల ఉప ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా మొత్తం నాలుగు రాష్ట్రాల్లోని ఐదు స్థానాలకు (రెండు లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు) ఉప ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఈ షెడ్యూలు ప్రకారం కడప, పులివెందుల స్థానాల్లో మే 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల […]పూర్తి వివరాలు ...