రాయచోతిలో అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీగా వైకాపా రికార్డు సృష్టించింది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి… టీడీపీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రాయచోటిలో కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. రాయచోటిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో సహా మొత్తం పోలైన ఓట్లు 1,59,201. అభ్యర్థికి ధరవతు రావాలంటే ఇందులో ఆరింట ఒక వంతు ఓట్లు అంటే 26,533 ఓట్లు దక్కాలి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి 25,344 […]పూర్తి వివరాలు ...
Tags :bypolls
అధికార యంత్రాంగం మొత్తం వైకాపాకు అనుకూలంగా పనిచేశారని కడప జిల్లా కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేయడం విశేషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున డి.సి.సి అధ్యక్షుడు మాకం అశోక కుమార్ దీనికి సంబంధించి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం ఆసక్తికరంగా ఉంది. జిల్లాలో మంగళవారం జరిగిన రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల ఉపఎన్నికల పోలింగ్‌లో పలువురు అధికారులు, ఉద్యోగులు ఏకపక్షంగా వ్యవహరించారని, ఆ మూడు నియోజకవర్గాల్లో అధికార […]పూర్తి వివరాలు ...
కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభనియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సైకిల్ పంక్చర్ అయ్యింది. ఫ్యాన్ హోరుకు సైకిల్ ఎదురు నిలువలేకపోయింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రం తెదేపా నియోజకవర్గ బాధ్యులు రామసుబ్బారెడ్డి డిపాజిట్ దక్కే స్థాయిలో ఓట్లు సాధించగలిగారు. కడప, మైదుకూర్, బద్వేల్ నియోజకవర్గాల్లో తెదేపా అత్యంత దయనీయమైన స్థితికి పడిపోయింది.పూర్తి వివరాలు ...
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు లక్షల మెజార్టీ వస్తే తమ ఆస్తులు రాసిస్తామని చెప్పిన మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి సవాలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెసేకు ఓటమి తధ్యం అని ప్రచారం ఊపందుకున్న ప్రస్తుత సమయంలో…ఆ సవాలుకు డీఎల్, వీరశివా కట్టుబడి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. వారు ఉప్పూ, కారం తిని ఉంటే, చీము నెత్తురు, కడప పౌరుషం ఉంటే ఆస్తులు రాసిస్తామనే మాటకు కట్టుబడి […]పూర్తి వివరాలు ...
కడప లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తాజాగా అందిన వివరాల ప్రకారం సుమారు పదిలక్షల ఓట్లు పోలయ్యాయి.అంటే మొత్తం కడప లోక్ సభ నియోజకవర్గంలో 77.48శాతం ఓట్లు పోలైనట్లు నమోదైంది. అత్యధికంగా కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో 84.56 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత స్థానంలో జమ్మలమడుగు సెగ్మెంట్ ఉంది. ఇక్కడ 83.18శాతం ఓట్లు పోలైనట్లు రికార్డయింది. తదుపరి పులివెందులలో 82.64శాతం ఓట్లు, మైదుకూరులో 81.25శాతం , ప్రొద్దుటూరులో 76.4,బద్వేలులో 75.25శాతం, కడప అసెంబ్లీ […]పూర్తి వివరాలు ...
వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రీపోలింగ్ గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలనాధికారులు అందించే నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మాట్లాడని పులివెందుల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి , దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి భార్య వై.ఎస్.విజయలక్ష్మి ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా మాట్లాడలేదు. అవిడను మాట్లాడవలసిందిగా మీడియా పదే,పదే కోరినా, నవ్వుతూ తిరస్కరించారు. కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీలకు ఉప […]పూర్తి వివరాలు ...
కడప లోక్ సభ నియోజకవర్గం లో మొదటి గంటలో 15 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయంత్రానికి ఎనబైశాతం నుంచి ఎనభై ఐదు శాతం ఓట్లు పోల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.కాగా కొన్ని చోట్ల ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. ఎండల కారణంగా కూడా ప్రజలు ఉదయానే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.ముఖ్య ఎన్నికల అధికారి బన్వర్ లాల్ వీడియో ద్వారా ప్రత్యక్ష ప్రసారం లో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పులివెందుల శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ […]పూర్తి వివరాలు ...
టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పులివెందుల పర్యటనలో జనాన్ని రెచ్చగొట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోడ్ షో నిర్వహించారు. వైఎస్ జగన్‌రెడ్డికి ఈ గ్రామంలో బాగా పట్టుంది. చంద్రబాబునాయుడు ముందుగా లింగాల మండలంలోని పార్నపల్లెకు చేరుకొని కార్యకర్తలు, ప్రజలనుద్ధే శించి ప్రసంగించారు. అనంతరం కోమన్నూతల గ్రామానికి చేరుకొని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అవినీతిపై మాట్లాడుతుండగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు […]పూర్తి వివరాలు ...
కడప : జిల్లా లో ఎన్నికల ప్రచారంలో చిరంజీవితో కలిసి అభ్యర్దులు డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి, వై.ఎస్.వివేకానందరెడ్డిలు పాల్గొన్నారు. చక్రాయపేటలో జరిగిన ఈ పర్యటనలో చిరంజీవి స్టార్ స్పీకర్. మంత్రులు రవీంద్రరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ ఆయనతోపాటు ఉన్నారు.కాని చిరంజీవే ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. వీరంతా కలిసి పర్యటిస్తుంటే తులసీరెడ్డిని ఎవరూ పట్టించుకోకపోవడం ఆయనకు బాద కలిగించింది. ఆయా నేతలు కనీసం తన పేరు కూడా ప్రస్తావించకపోవడంతో ఆయన అలిగి వెళ్లిపోబోయారు. అయితే వివేకానందరెడ్డి ఆయనను బతిమిలాడాల్సి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడిగా […]పూర్తి వివరాలు ...