Tags :brahmani steels

చరిత్ర

బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ – పుట్టుక నుండి చావు వరకు

7 మే  2007 : 2017 నాటికి 25 వేల కోట్ల పెట్టుబడితో 10 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన ఉక్కు పరిశ్రమను కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఏర్పాటు చేయనున్నట్లు బళ్లారిలో గాలి జనార్ధనరెడ్డి ప్రకటన. 21 మే  2007 :  ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం. 6 జూన్ 2007 : బ్రాహ్మణికి భూకేటాయింపులను వ్యతిరేకిస్తూ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

బ్రాహ్మణి సూపర్ అంటున్న ‘ఈనాడు’

ఒకప్పుడు ‘బ్రాహ్మణి’ ఉక్కు కర్మాగారానికి వ్యతిరేఖంగా పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించిన ‘ఈనాడు’ దినపత్రిక ఇప్పుడు అదే కర్మాగారాన్ని ఆహా…ఓహో అని కీర్తిస్తోంది. ఇవాల్టి కడప జిల్లా టాబ్లాయిడ్ లో ఈనాడు దినపత్రిక ఇలా రాసింది… ‘జిల్లాలోనే ఎందుకు ఏర్పాటు చేయాలి: ఉక్కు పరిశ్రమ కోసం జమ్మలమడుగు- ముద్దనూరు మధ్యలో సుమారు 11వేల ఎకరాల భూమిని కేటాయించారు. విమానాశ్రయం కోసం మరో 4 వేల ఎకరాలు భూమి కేటాయించారు. జపాన్ నుంచి విలువైన యంత్రాలు ఇక్కడికి తెప్పించారు. టౌన్‌షిప్, […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఉక్కు కర్మాగారం ఏర్పాటు పరిశీలనకై వచ్చిన సెయిల్‌ బృందం

కడప: జిల్లాలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుకు ఉన్న అనుకూల, అననుకూల పరిస్థితులపరిశీలకై జిల్లాకు వచ్చిన 8 మంది సెయిల్‌(Steel Athority of India-SAIL) బృందం ఆదివారం సికె దిన్నెమండలంలోని కొప్పర్తి, జమ్మలమడుగు మండలంలోని బ్రహ్మణీ ప్లాంట్‌ స్థలం, మైలవరం మండలంలోని ఎం. కంబాల దిన్నె, ప్రాంతాన్ని పరిశీలించారు. మైలవరంరిజర్వయర్‌ను కూడా బృందం సభ్యులు పరిశీలించారు. రిజర్వయర్‌ లో నీటిసామర్థ్యం గత పది సంవత్సరాల కాలంలో సరాసరి నిల ్వవున్న నీటి వసతి వివరాలనుఅధికారుల ను అడిగి తెలుసుకున్నారు. రిజర్వయర్‌ […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఆ అంశాన్ని ఎందుకు చేర్చలేదు? – బి.వి.రాఘవులు

‘అనంతపురంతో పాటు వైఎస్సార్‌జిల్లాలో ఇనుపఖనిజం ఉంది. బ్రహ్మణి అంటారో.. కడప అంటారో… రాయలసీమ ఉక్కుఫ్యాక్టరీ అంటారో…ఏపేరైనా పెట్టుకోండి.. ఏమైనా చేయండి – ఇక్కడ ఇనుము – ఉక్కు పరిశ్రమను మాత్రం కచ్చితంగా స్థాపించి తీరాల్సిందే! అవకతవకలు జరిగాయని  ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని రకాల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది..పరిశ్రమ ఏర్పాటుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.. ‘ అని సీపీఎం రాష్ట్రకార్యదర్శి బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని పూర్తిచేయాలనే డిమాండ్‌తో పరిశ్రమ ఏర్పాటు […]పూర్తి వివరాలు ...

వార్తలు

బ్రహ్మణి స్టీల్స్‌ను ఆపొద్దు …

కడప: రాయలసీమ ప్రజల ఉపాధికి అవకాశాలున్న బ్రహ్మణి స్టీల్స్‌ను రాజకీయాలతో ముడిపెట్టి అడ్డుకోవద్దని రాయలసీమ కార్మిక, కర్షక సమితి డిమాండ్ చేసింది. వెనుకబడిన రాయలసీమ, ప్రత్యేకించి వైఎస్సార్ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్దేశించిన ఈ ప్రాజెక్టును రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమితి ఆరోపించింది. స్థానిక ప్రజల ఉపాధి కోసం తలపెట్టిన ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేలా పార్టీలకు అతీతంగా అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు […]పూర్తి వివరాలు ...