Tags :apsrtc

వార్తలు

ఎంసెట్‌ రాసే అభ్యర్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

కడప: ఎంసెట్‌-2016 పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్ష రోజున ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు హాల్‌టిక్కెట్టు చూపించి ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కడప, ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండుల నుంచి పరీక్షా కేంద్రాల వరకు ఉదయం, మధ్యాహ్నం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలియచేశారు. కడప: ఎంసెట్‌-2016 పరీక్ష […]పూర్తి వివరాలు ...

వార్తలు

సిటీబస్సుల కోసం కడపలో మరో వాహనశాల

ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఖాళీ స్థలంలో మరో గ్యారేజి (వాహనశాల) నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించి ఆర్టీసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న ప్రాంతంలోనే గ్యారేజీని నిర్మించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గ్యారేజీ నిర్మాణానికి సుమారు రూ.4.20 కోట్లు కేటాయించారు. అందుకు సంబంధించి హైదరాబాదులో టెండర్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈనెల 9వ తేదీన టెండర్లను ఓపెన్ చేసి కాంట్రాక్టు ఖరారు చేయనున్నారు. నగరాలలో సిటీ బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సంకల్పించిన నేపధ్యంలో […]పూర్తి వివరాలు ...

వార్తలు

జిల్లాలోఅనధికారికంగా నిషేదాజ్క్షలు

కడప: జిల్లాలో  పలు చోట్ల అనధికారికంగా నిషేదాజ్క్షలను జారీ చేశారు. ఈ సాయంత్రం నుండి మైదుకూరు, బద్వేలు, కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సహా జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసుల మోహరించారు. కడప తిరుపతి మార్గంలో బస్సు సర్వీసులను కొద్ది సేపటి క్రితం నిలిపివేసినట్లు వార్తలు వెలుడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో విద్యుత్తూ సరఫరాను ఆపివేశారు.పూర్తి వివరాలు ...