Tags :2014 ఎన్నికలు

రాజకీయాలు

కడప బరిలో తెదేపా అభ్యర్థిగా డిఎల్

తాను రాజకీయాల్లో కొనసాగాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు కాబట్టే.. వారి ఆకాంక్ష మేరకు రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ మాజీ మంత్రి, మైదుకూరు శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డి వెల్లడించారు. మైదుకూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్, తెదేపా కడప పార్లమెంట్ అభ్యర్థిగా తాను ఎన్నికల గోదాలోకి దిగనున్నట్లు ఆయన ప్రకటించారు.  బుధవారం సాయంత్రం తన స్వగ్రామమైన సుంకేశులలో అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

మైదుకూరు, ఎర్రగుంట్లలలో అభ్యర్థులు దొరకలేదు

శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పరిస్థితి కడప జిల్లాలో దయనీయంగా మారింది. ఈనెల 30న జరిగే పురపాలక పోరులో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే నాధుడే కరవయ్యారు. జిల్లాలోని ఏడు మున్సిపాల్టీల్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్య రెండంకెలకు మించలేదు. ముఖ్యంగా మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాల్టీల్లో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే అభ్యర్థి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దంపడుతోంది. కడప కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

వైకాపా అభ్యర్థుల జాబితా

 కడప జిల్లాలో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే వైకాపా అభ్యర్థుల జాబితాను  ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ రఘురామిరెడ్డి  కడపలో జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో సీమాంధ్ర ప్రాంతంలో వైకాపా 130 శాసనసభ, 23 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ అభ్యర్థులు: లోక్‌సభ అభ్యర్థులు:పూర్తి వివరాలు ...

రాజకీయాలు

మండలాధ్యక్ష రిజర్వేషన్లు – 27 పురుషులకు, 23 మహిళలకు

కడప జిల్లాలోని 50 మండలాధ్యక్ష స్థానాలలో (ఎంపిపి) 27 పురుషులకు, 23 మహిళలకు కేటాయించారు. దీనికి సంబంధించి శనివారం రాత్రి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ రిజర్వేషన్ల జాబితాపై సంతకం చేశారు. మండలాధ్యక్షుల రిజర్వేషన్లను పరిశీలిస్తే…  ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్‌కు 4, మహిళలకు 3 మండలాలు, బీసీ జనరల్‌కు 7, మహిళలకు 6 అన్‌రిజర్వుడు జనరల్‌కు 15, మహిళల కు 14 మండలాలను ఖరారు చేశారు. మండలాల వారీగా రిజర్వషన్ల వివరాలిలు.. [checklist] పులివెందుల […]పూర్తి వివరాలు ...

Uncategorized

కడప జిల్లాలో 20.75 లక్షల ఓటర్లు

జిల్లాలో 20.75 లక్షల ఓటర్లున్నారు.త్వరలో జిల్లా వ్యాప్తంగా పురపాలక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 30 శాతంగా  ఉన్న యువతరం ఓట్లు మన నేతల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. తొలుత కడప కార్పొరేషన్ , పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, బద్వేలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. కడప పార్లమెంట్ పరిధిలో కడప కార్పొరేషన్‌తోపాటు పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు , బద్వేలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.. ఇక అసెంబ్లీల వారీగా వస్తే బద్వేలు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

27న కడపకు చంద్రబాబు

27న కడపలో ప్రజాగర్జన నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో 27న ప్రజాగర్జన నిర్వహించడం వల్ల ఎన్నికల్లో లాభిస్తుందని తెదేపా నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు హాజరయ్యే గర్జనకు భారీ ఎత్తున జన సమీకరణ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజాగర్జన సభలో చేరతారా, లేక అంతకుముందే సైకిలెక్కుతారా అన్నది తెలియాల్సి ఉంది.పూర్తి వివరాలు ...

error: