Tags :సొదుం శ్రీకాంత్

అభిప్రాయం

కడప.ఇన్ఫో పేరుతో విషం చల్లుతున్నామా?

ఇప్పటికి సరిగ్గా పదేళ్ళ కిందట 2006లో కడప.ఇన్ఫో ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో కడప.ఇన్ఫోలో కొన్ని వ్యాసాలను/అభిప్రాయాలను ప్రచురించిన నేపధ్యంలో వివిధ అంశాల మీద కొంతమంది వీక్షకులు అసహనం వ్యక్తం చేస్తూ స్పందించారు.ముఖ్యంగా మూడు రకాలైన ప్రశ్నలను/ఆరోపణలను విజ్ఞులైన వీక్షకులు లేవనెత్తారు. అందులో మొదటిది ముఖ్యంగా రాయలసీమకు/కడప జిల్లాకు సంబంధించి వివిధ అంశాలపైన ప్రచురించిన వ్యాసాలు/అభిప్రాయాలు ఇతర ప్రాంతాల మీద విషం చల్లేవిగా ఉన్నాయన్నది వారి ఆరోపణ. ఇక రెండవది తెదేపాకు ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామట, […]పూర్తి వివరాలు ...

కవితలు

వానొచ్చాంది (కవిత)

ఆకు అల్లాడ్డంల్యా గాలి బిగిచ్చింది ఉబ్బరంగా ఉంది ఊపిరాడ్డంల్యా ఉక్క పోచ్చాంది వంతు తప్పేట్లు లేదు వంక పారేట్లే ఉంది. పొద్దు వాల్తాంది మిద్దెక్కి సూచ్చనా వానొచ్చాదా రాదా? పదునైతాదా కాదా? అదును దాట్తే ఎట్లా? ఏడు పదుల కరువు పందికొక్కుల దరువు పంకియ్యని ప్రభువు ముదనష్టపు అప్పు ఉరితాళ్ళ బతుకు. అద్దద్దో…ఆపక్క మోడం ఎక్కొచ్చాంది ఆ మూల నుంచి కుమిల్లు కుమిల్లు నల్లగ కలయబారతాంది కొత్తమిట్ట కాడికొచ్చె దున్నంగి పంపుల్లో దిగబడే అబ్బీ……వచ్చరా….వానొచ్చరా…. మాంచి మోదుబ్బీ… […]పూర్తి వివరాలు ...

కవితలు

వాటమైన కేటుగాడు (కవిత) – సొదుం శ్రీకాంత్

నిధుల్లో వాటా సెప్పల్య నీళ్ళ కాడ కాటా బెట్టల్య ఉద్యోగాల్లో కోటా ముట్టల్య ఎముకలేని నాళికతో గాలిమేడల మాటల్తో నోటికాడ కూడు లూటీ సేసే వాటమైన కేటుగాడు ఈడు ఒరేయ్………. జూట్ కా బేటా నీ తాట ఒల్సి మెట్లుగుట్టుకోడానికి నా రాయలసీమ రాటు దేల్తాంది జిల్లాల వారీ ప్రణాళికలట గల్లీల్ని కూడా ఖిల్లాల్ని సేచ్చాడట కరువు సీమకు కన్నీళ్ళ సెరువులట కోయలకు నెత్తుటి పో’లవరాలట’ పుకార్ల పోట్లంతో షికార్లు సేసి తల్లి వేరునే తెగనరికే టక్కర్ […]పూర్తి వివరాలు ...

కవితలు

సావైనా బతుకైనా (కవిత) – సొదుం శ్రీకాంత్

రాళ్ళసీమ అంటనారు గదా రాసుకున్న హామీలపత్రం కూడా ఉంది గదా అదేదో ఆ సింగపూరన్నా కాలబడి మా ఊరికొచ్చే బేకారుగా తిరిగే మా పిల్ల నాయాల్లకు రెండు జీతం పరకలన్నా దొరుకతాయి అని ఆశపడి రాజధానిని అడుగుదామని పోతే ‘రస్తాలో లేవు పోచ్చాయ్ ……’ రౌడీ నా కొడకా అంటా ఎగిచ్చి తమ్తిరి! ఉరితాళ్ళు మీ ఇంట యాలాడనప్పుడు దుక్కిసాల్లు నిన్ను యంటబడి ఏటాడి మట్టుబెట్టనప్పుడు అవును మరి, కరువు ఎవరికి సేదు? ఒక్క మా రాయలసీమ […]పూర్తి వివరాలు ...

కవితలు

జై రాయలసీమ (కవిత) – సొదుం శ్రీకాంత్

తోరణాలు దిగేయండి పావురాలు ఎగిరేయండి బారులుగా కూరండి మాలలుగా మారండి అడుగుల మడుగై అరవండి జోరుగా జై రాయలసీమ ( నేను అరుచ్చనా, అన్నా ఇనపచ్చాంది గదా? మళ్ళా అర్సాల్నా? ) జై జై రాయలసీమ ( ఇది మీరు -నాకినపల్యా, ఎది ఇంగోసారి, గా……ట్టిగ, గూబ పగల్లాల కొడుకులకు ) ఇంగా ఏముంది ఎదురుజూడ్దానికి? కొట్టం కాలిపాయ బతుకు బుగ్గైపాయ కరువు పుండాయ బతుకు ఎండిపాయ నిండా మునిగినాక సలేంది, గిలేంది! ఇంగ మన బాట […]పూర్తి వివరాలు ...

కవితలు

రాయలసీమ బిడ్డలం (కవిత) – సొదుం శ్రీకాంత్

అమ్మని ఆదరిచ్చే కమ్మని గోరుముద్దలమైతాం కొమ్ముగాసి రొమ్ము గుద్దితే పోరుగిత్తలమైతాం రాగిసంగటి ముద్దలం రాయలసీమ బిడ్డలం బందువుగా చూశావా బాహువుల్లో బందిచ్చాం బానిసగా ఎంచితే పిడిబాకులమై కబళిచ్చాం రేగటిసేను విత్తులం రాయలగడ్డ బిడ్డలం కలిసి నడిచ్చే కారే కన్నీటికి సాచిన దోసిల్లమైతాం కాదని నమ్మిచ్చి నడ్డిడిచ్చే కారుచిచ్చై దహిచ్చాం రేపటితరం స్వప్నాలం రాయలసీమ బిడ్డలం సాగు నీళ్ళిచ్చి సాగనంపితే సావాసగాళ్ళం ఐతాం సాగుతున్న దగాని సాగదీచ్చే సానపట్టిన గళాలమై సాగుతాం రాతిగుండె పిల్లోల్లం రాయలగడ్డ బిడ్డలం జై […]పూర్తి వివరాలు ...

కవితలు

సీమ సినుకయ్యింది – సొదుం శ్రీకాంత్

సీమ సినుకయ్యింది ముసురు మొబ్బయ్యింది దారి ఏరయ్యింది ఊరు పోరయ్యింది సినుకు సినుకే రాలి సుక్క సుక్కే చేరి ఊరి వంకై పారి ఒక్కొక్కటే కూరి పెన్నేరుగా మారి పోరు పోరంట ఉంది పోరు పెడతా ఉంది సీమ సినుకయ్యింది ముసురు మొబ్బయ్యింది దారి ఏరయ్యింది ఊరు పోరయ్యింది మెడలు వంచాలంది మడవ తిప్పాలంది మడమ తిప్పకు అంది తడవ మనదే అంది కడవ పగలాలంది అడుగు మడుగయ్యింది గొడవ దడి చేరింది సీమ సినుకయ్యింది ముసురు […]పూర్తి వివరాలు ...

కవితలు

రాజధాని వాడికి…రాళ్ళ గంప మనకు

రాజధాని వాడికి రాళ్ళ గంప మనకు సాగు నీళ్ళు వాడికి కడగండ్లు మనకు స్మార్ట్ సిటీలు వాడికి చితి మంటలు మనకు వాటర్ బోర్డ్ వాడికి పాపర్ బ్రతుకులు మనకు ఎయిమ్స్ వాడికి ఎముకల గూల్లు మనకు అన్నపూర్ణ వాడికి ఆకలి చావులు మనకు పోలవరం వాడికి కరువు శాపం మనకు యూనివర్సిటీలు వాడికి యురేనియం సావులు మనకు కాసుల పంట వాడికి మాసిన సదువు మనకు కనక వర్షం వాడికి కూనీ సంస్కృతి మనకు ఉండేదంతా […]పూర్తి వివరాలు ...