ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది మొదలు రాయలసీమకు పాలకులు (ప్రభుత్వం) అన్యాయం చేస్తున్నా నోరు మెదపకుండా రాజకీయ పక్షాలన్నీ నోళ్ళు మూసుకున్న తరుణంలో… కోస్తా ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటును సీమ ప్రజలు వ్యతిరేఖిస్తున్న సందర్భంలో, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న భాజపా 23 ఫిబ్రవరి 2018 నాడు రాయలసీమ డిక్లరేషన్ వెలువరించింది. ఈ నేపధ్యంలో రాయలసీమ విషయంలో భాజపాతో పాటు ఇతర పార్టీల చిత్తశుద్ధిని గుర్తు చేస్తున్న తవ్వా ఓబుల్‌రెడ్డి, సీమకు జరిగిన వంచనను […]పూర్తి వివరాలు ...
Tags :సిద్దేశ్వరం అలుగు
చంద్రబాబుకు కోపం వచ్చింది. పట్టిసీమ నుంచి నీళ్లిస్తామని చెబితే వినకుండా సిద్ధేశ్వరం అలుగు కట్టుకుంటామని వెళతారా? అని పోలీసులను ఉసిగొలిపాడు. వాళ్లకు చేతనైనదంతా వాళ్లు చేశారు. మీ పట్టిసీమ మాకెందుకు? సిద్ధేశ్వరం కట్టుకుంటే చాలని అనడమే శాంతిభద్రతల సమస్య అయింది. ముందు రోజే హౌస్ అరెస్టులు చేశారు. నాయకుల కోసం ఆరా తీసి ఆందోళన పెట్టారు. సిద్ధేశ్వరం దారులన్నీ జనమయం అవుతాయని అటకాయించారు. ఇటు నందికొట్కూరు నుంచి, అటు వెలుగోడు నుంచి చెక్‌పోస్టులు తెరుచుకున్నాయి. అసలు దారులు, […]పూర్తి వివరాలు ...
ఆటంకాలు దాటుకొని అలుగుకు శంకుస్థాపన నిర్భందాలు దాటుకుని వేలాదిగా తరలి వచ్చిన జనం అడుగడుగునా అడ్డంకులు కల్పించిన ప్రభుత్వం సిద్దేశ్వరం వెళ్ళే దారిలో వందలాది తనిఖీ కేంద్రాలు రైతునాయకుల అరెస్టుకు పోలీసుల విఫలయత్నం ప్రతిఘటించిన రైతులు (సిద్దేశ్వరం నుండి మా ప్రత్యేక ప్రతినిధి) వాళ్ళు దారి పొడవునా తనిఖీల పేరుతో కాపు కాశారు. కొంతమందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని మార్గమధ్యంలోనే నిలువరించారు. అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. నాలుగు జిల్లాల నుండి తరలివచ్చిన వాహన శ్రేణులను అడ్డుకోవాలని […]పూర్తి వివరాలు ...
సిద్దేశ్వరం ..గద్దించే స్వరం రాయలసీమకు ఇది వరం పాలకుల వెన్నులో జ్వరం కడితే అది సిద్దేశ్వరం కాదంటే అది యుద్దేశ్వరం సాగునీటి ఉద్యమ శరం తోకతొక్కిన సీమ నాగస్వరం కృష్ణా-పెన్నార్ ను తుంగలోతొక్కి కరువు జనుల ఆశలను కుక్కి సాగరాలను నిర్మించుకుని మూడుకార్లు పండించుకుని గొంతెండుతోందని గోస పెడితే అరెస్టులతో అణచేస్తారా ? అదిగదిగో కదులుతోంది దండు ద్రోహులగుండెల్లో ఫిరంగి గుండు నలుదిశలా కనబడలేదా ? రాయలసీమ ఉద్యమ జండా సాగుతోంది సన్నని దారుల గుండా ! […]పూర్తి వివరాలు ...
బరితెగించిన తెదేపా ప్రభుత్వం పోలీసుల అదుపులో బొజ్జా గృహనిర్భందంలో భూమన్ ప్రభుత్వానికి మద్ధతుగా బరిలోకి దిగిన పచ్చ నేతలు, మీడియా కడప: శాంతియుతంగా సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కోసం సిద్ధమవుతున్న రాయలసీమ రైతు నాయకులపైకి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. అలుగు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉద్యుక్తులవుతున్న నేతలను కర్నూలు జిల్లాలో పలుచోట్ల పోలీసులు సోమవారం గృహనిర్భంధం చేశారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ముందస్తు వ్యూహంలో భాగంగా బొజ్జా అర్జున్ ను ఆత్మకూరులో పోలీసులు అదుపులోకి తీసుకోగా, […]పూర్తి వివరాలు ...
మీడియా దృష్టి మరల్చేందుకు ప్రభుత్వ వ్యూహరచన? కడప: రాయలసీమ జిల్లాల నుండి రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమానికి తరలివెళ్ళే అవకాశం ఉండటంతో నిఘావర్గాలు రంగంలోకి దిగాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాయలసీమ నాలుగు జిల్లాల నుండి ఎంతమంది రైతులు సిద్దేశ్వరం వెళ్ళవచ్చు అనే అంశంపై ఒక అంచనాకు వచ్చిన నిఘా వర్గాలు అలుగు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించాయి. రాయలసీమ జిల్లాల నుండి […]పూర్తి వివరాలు ...