ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది మొదలు రాయలసీమకు పాలకులు (ప్రభుత్వం) అన్యాయం చేస్తున్నా నోరు మెదపకుండా రాజకీయ పక్షాలన్నీ నోళ్ళు మూసుకున్న తరుణంలో… కోస్తా ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటును సీమ ప్రజలు వ్యతిరేఖిస్తున్న సందర్భంలో, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న భాజపా 23 ఫిబ్రవరి 2018 నాడు రాయలసీమ డిక్లరేషన్ వెలువరించింది. ఈ నేపధ్యంలో రాయలసీమ విషయంలో భాజపాతో పాటు ఇతర పార్టీల చిత్తశుద్ధిని గుర్తు చేస్తున్న తవ్వా ఓబుల్‌రెడ్డి, సీమకు జరిగిన వంచనను […]పూర్తి వివరాలు ...
Tags :సిద్దేశ్వరం
సిద్దేశ్వరం ..గద్దించే స్వరం రాయలసీమకు ఇది వరం పాలకుల వెన్నులో జ్వరం కడితే అది సిద్దేశ్వరం కాదంటే అది యుద్దేశ్వరం సాగునీటి ఉద్యమ శరం తోకతొక్కిన సీమ నాగస్వరం కృష్ణా-పెన్నార్ ను తుంగలోతొక్కి కరువు జనుల ఆశలను కుక్కి సాగరాలను నిర్మించుకుని మూడుకార్లు పండించుకుని గొంతెండుతోందని గోస పెడితే అరెస్టులతో అణచేస్తారా ? అదిగదిగో కదులుతోంది దండు ద్రోహులగుండెల్లో ఫిరంగి గుండు నలుదిశలా కనబడలేదా ? రాయలసీమ ఉద్యమ జండా సాగుతోంది సన్నని దారుల గుండా ! […]పూర్తి వివరాలు ...
కడప: కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మించాలని, గుండ్రేవుల వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ తో రేపు (మే 5న) భాజపా ఆధ్వర్యంలో ‘ఛలో సిద్ధేశ్వరం’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేవైఎం జాతీయ కార్యవర్గసభ్యుడు నాగోతు రమేష్ తెలిపారు. మంగళవారం రాజంపేటలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ రెండు ప్రాంతాల్లో అలుగు, బ్యారేజీ నిర్మాణం వల్ల రాయలసీమకు సుమారు 40 టీఎంసీల నీరు అదనంగా వచ్చే అవకాశముందన్నారు. వీటిని నిర్మించాలని […]పూర్తి వివరాలు ...
శ్రీశైలం డ్యామ్‌కనీస నీటిమట్టం విషయంలో ప్రభుత్వంస్పందించకపోతే ఉద్యమ బాట తప్పదని శాసనసభ్యులు, రైతు, ప్రజా సంఘాలనేతలు మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీమరైతు కోసరమని వారంతా ఆందోళన పథాన్ని ఎంచుకున్నారు. కర్నూలు: రాయలసీమ హక్కుల సాధన కోసం వైకాపా శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం (ఈ నెల ఏడున) శ్రీశైలం డ్యామ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమల అడవిలోని శ్రీశైలం డ్యామ్‌పరిసర ప్రాంతాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన […]పూర్తి వివరాలు ...