Tags :సాహిత్య నేత్రం

కథలు

చనుబాలు (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

చీకటి చిక్కబడింది. బలహీనంగా వెలిగే వీధిలైట్ల కాంతిలో వేపచెట్టు కింది అరుగుమీద మరింత దట్టమైన చీకట్లో నా చుట్టూ ఐదారు బీడీ ముక్కలు మినుకు మినుకుమంటున్నాయి. వాటి నిప్పు, వెలుగు అరుగు ముందు నిల్బున్న నాలుగైదు జతల కనుపాపల మీద ప్రతిఫలిస్తోంది. “మాదా కవలం తల్లీ! సందాకవలమమ్మా!” అంటూ బిక్షగత్తెలు ఇల్లిల్లూ తిరిగి గొంతెత్తే వేడికోళ్లు ఇక్కడిదాకా పాకుతున్నాయి. తెగులు చూపిన కోళ్లను అగ్గవగా ఎదరకపోతున్న బేరగాళ్లు వాటి కాళ్లకు తాళ్లు గట్టి సైకిలు మీద వేలాడేసుకు […]పూర్తి వివరాలు ...

వ్యాసాలు

‘శశిశ్రీ’కి పాలగిరి విశ్వప్రసాద్ నివాళి వ్యాసం

శశిశ్రీ 1995లో కడపలో ‘సాహిత్య నేత్రం’ పత్రికను మొదలుపెట్టాడు. అది మొదలెట్టే సమయానికి ఆయన జేబులో రూపాయి లేదు. పనిలోకి దిగితే అవే వస్తాయని మొదలెట్టాడు. ఇందుకు ఆయనకు సహకరించింది ఆయన మిత్రుడు డి.రామచంద్రరాజు, తన కన్నా వయసులో చిన్నవాడైన మరో మిత్రుడు నూకా రాంప్రసాద్‌రెడ్డి. పత్రిక తొలి సంచిక, మలి సంచిక రాగానే ఆంధ్రప్రదేశ్ సాహిత్యకారుల దృష్టంతా సాహిత్యనేత్రం వైపు తిరిగింది. అప్పటికే ‘రచన’, ‘ఆహ్వానం’ మార్కెట్లో ఉన్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా అంతకు మించి […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం వ్యాసాలు

భారద్వాజస గోత్రీకుడు షేక్ బేపారి రహంతుల్లా!

1997 ప్రాంతంలో ఒకసారి వేంపల్లెకు పోయినప్పుడు అక్కడి గ్రంథాలయంలో ‘సాహిత్యనేత్రం’ అని ఒక కొత్త పత్రిక కంటబడింది. మంచి కథలు, శీర్షికలు, కవితలు ఉన్న ఆ పత్రిక కడప నుంచి వెలువడుతోందని తెలిసి చాలా సంబరపడ్డాను. ఆ తర్వాత కడపకు పోయినప్పుడు నగర నడిబొడ్డైన ఏడురోడ్ల కూడలికి అతిసమీపంలో ఉన్న ఆ పత్రిక కార్యాలయానికి వెళ్ళి సంపాదకుడిని కలుసుకుని పాత సంచికలన్నీ తెచ్చుకున్నాను. ఆ సంపాదకుడు శశిశ్రీ. s తర్వాత అప్పుడప్పుడూ నేత్రం ఆఫీసుకు వెళ్తూ ఉండేవాడిని. […]పూర్తి వివరాలు ...

error: