పడమటి పక్క పొద్దు నల్లమల కొండల్లోకి సిన్నగ జారిపాయ. జంగిలిగొడ్లు కాయను మిట్టకు పోయిన ఆవుల రామన్న, మేకల్ను తోలకపోయిన చెవిటి కమాల్ అప్పుడే ఊళ్ళోకి బరుగొడ్లను, మేకల్ను తోలకచ్చిరి, సవరాలు, గడ్డాలు, చెయ్యడానికి పక్క పల్లెలకు పోయిన మంగళోల్ల రామన్న సంకకు పెట్టె,భూజాన మూటె ఎత్తుకుని వచ్చినాడు. ఏట్టో గుడ్డలుతకడానికి బొయిన సాకలోల్లు ఉతికిన గుడ్డల మూటల్ను ఈపునెత్తుకొని వర్సగా గూడ్సుబండ వచ్చినట్లు వచ్చాండిరి. చేలల్లోకి పన్లకు పోయిన ఆడోళ్ళునెత్తిన గడ్డిగంపలెత్తుకుని కొందరు, కూరాక్కు తమేటాలో, […]పూర్తి వివరాలు ...