కడప: ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని.. లేదంటే ప్రభుత్వ మెడలు వంచి చేయిస్తామని వైకాపా నేతలు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కడప కలెక్టరేట్ ఎదుట వైకాపా నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీరుపైన విమర్శలు గుప్పించారు. సొంతమామనే వెన్నుపోటు పొడిచిన బాబుకు రైతుల్ని, మహిళల్ని నిలువునా ముంచడం పెద్ద విశేషమేమి కాదని పలువురు శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. నగర మేయర్ సురేష్‌బాబు […]పూర్తి వివరాలు ...
Tags :వైకాపా
కడప: నగరంలో నేడు వైకాపా ధర్నా కార్యక్రమానికి వచ్చే నేతలు, రైతులు, పార్టీ కార్యకర్తల వాహనాల రాకపోకలకు సంబంధించి కడప డీఎస్పీ అశోక్‌కుమార్ ఆంక్షలు విధించారు. మైదుకూరు, కమలాపురం, పులివెందుల రోడ్డు మార్గంలో వచ్చే వాహనాలను మోచంపేట వద్ద ఉన్న మరాఠీ మఠం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. బద్వేలు, రాజంపేట, రాయచోటి మార్గం నుంచి వచ్చే వాహనాలకు రాజారెడ్డివీధిలోని సీఎస్‌ఐ చర్చి వెనుక ఖాళీ స్థలాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు […]పూర్తి వివరాలు ...
కడప: ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ బుధవారం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు తహసీల్ధార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశాయి. ఈ ధర్నాల్లో వైకాపాకు చెందిన నేతలు, శాసనసభ్యులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హామీ ఇచ్చిన విధంగా తక్షణమే ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్వోలకు వినతిపత్రాలను సమర్పించారు. పులివెందులలో మాజీ మంత్రీ వివేకానందరెడ్డి, వేముల, వేంపల్లెలలో కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరులో […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళుతున్నారని, ఇందులో భాగంగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రొద్దుటూరులో పోటీ చేస్తారని, ఇందుకుగాను రూ.36కోట్లకు ఒప్పందం కుదిరిందని, టీ దుకాణాల వద్ద తెదేపా నేతలు ప్రచారం చేయిస్తున్నారన్నారని వైకపా శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాదరెడ్డి వాపోయారు. ఇందుకు కొనసాగింపుగానే ఎంపిక చేసిన పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఇదే మాదిరిగా జమ్మలమడుగు, రాయచోటి నియోజకవర్గాలలో ప్రచారం చేయిస్తున్నారన్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. అలాగే తనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళుతున్నట్లు […]పూర్తి వివరాలు ...
కడప: గురువారం కడపలో కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగితే కొంతమంది కీలక నేతలు పార్టీ మారే ఆలోచనతోనే సమావేశానికి రాలేదని మీడియాలో వచ్చిన కథనాలను వైకాపా నేతలు ఖండించారు.శుక్రవారం రాత్రి స్థానిక వైకాపా కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కుమారుడు నాగిరెడ్డి సమక్షంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి విలేకరులతో […]పూర్తి వివరాలు ...
కడప: గురువారం కడపలో జరిగిన వైకాపా జిల్లా సర్వసభ్య సమావేశానికి కొంతమంది నేతలు హాజరు కాలేదు. దీంతో ఆయా నేతలు వైకాపాకు దూరంగా జరుగుతున్నారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. రాజంపేట పార్లమెంటు సభ్యడు మిథున్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు కూడా హాజరు కాలేదు. ఇలా ముఖ్య నేతలు ముందస్తు సమాచారం […]పూర్తి వివరాలు ...
రాజంపేట: కడప జిల్లాలో ప్రభుత్వం 30వేల పింఛన్‌లు తొలగించిందని వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు. రాజంపేటలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్ని మభ్య పెట్టేందుకే ప్రభుత్వం జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చిందని పేర్కొన్నారు. జన్మభూమికి కేటాయించిన నిధులు మంత్రులు, అధికారులు తిరిగేందుకే సరిపోతాయన్నారు. రుణమాఫీ అంటూ రైతులను, డ్వాక్రా మహిళలలను బురిడీ కొట్టించారన్నారు. ఎన్నో ఆశలతో అధికారంలో కూర్చోబెట్టిన జనాన్ని నట్టేట ముంచడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పని […]పూర్తి వివరాలు ...
కడప: వైకాపా జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమరనాథరెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్, మైదుకూరు శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. నగరంలోని వైఎస్ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అమరనాథరెడ్డిని నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆకేపాటి పార్టీని అన్ని రకాలుగా పటిష్టం చేయగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర […]పూర్తి వివరాలు ...
ఎర్రగుంట్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులుగా కౌన్సిలర్ స్థానాలకు పోటీచేసి గెలిచిన తర్వాత తెదేపాకు ఫిరాయించిన ఎనిమిది మంది కౌన్సిలర్లపై అనర్హత వేటు పడింది. ఈ విషయాన్ని కమిషనర్ ప్రభాకర్‌రావు శనివారం విలేకర్లకు వెల్లడించారు. అనర్హులుగా ప్రకటించిన వారిలో ఎస్.పురుషోత్తం(ఒకటోవార్డు), వి.సరస్వతి(మూడో వార్డు), ఎ.గంగాభవాని (అయిదోవార్డు), జి.నారాయణరెడ్డి(ఆరోవార్డు), ఎస్.ఆసియాబేగం(పదోవార్డు), జె.మహిత(పన్నెండోవార్డు), ఎస్.మస్తాన్‌వలి(పదమూడోవార్డు), వి.లక్ష్మి(పద్నాలుగో వార్డు) కౌన్సిలర్లు ఉన్నారని ఆయన వివరించారు. నగర పంచాయతీకి జులై నెల 3న జరిగిన మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్ ఎన్నికల సమయంలో […]పూర్తి వివరాలు ...