పిడికెడంత సీమ గుప్పెడంత ప్రేమ వేటకుక్కల్నే యంటబడి తరిమిన కుందేళ్ళు తిరిగాడిన చరిత్ర! రాళ్ళు కూడా రాగాలు పలికిన గడ్డ! కాలికింద కరువు ముల్లై గుచ్చుకుంటే కంట్లో నెత్తురు కారుచిచ్చై కమ్ముకుంది నెర్రెలిగ్గిన ఒళ్ళుపై గుక్కెడు నీళ్ళు సిలకరించు ఒళ్లంతా గొర్రుసాల్లో ఇత్తనమై సర్రున మొలకెత్తుతుంది. నిద్రబుచ్చేటోడూ, నిందలేసేటోడూ ఇద్దరూ దొంగలే! నిజం మాట్లాడేటోడు, నిగ్గుదేల్చోటోడే నికార్సైన నాయకుడు బువ్వ పెట్టిన సేతినే బూడిదపాలు జేసినోనిపై భూమి తిరగాబడక మానదు భుక్తే భుజాల్ని కలుపుతుంది వలసే నిలేసి […]పూర్తి వివరాలు ...
Tags :వేమన సీమ
ఆకు అల్లాడ్డంల్యా గాలి బిగిచ్చింది ఉబ్బరంగా ఉంది ఊపిరాడ్డంల్యా ఉక్క పోచ్చాంది వంతు తప్పేట్లు లేదు వంక పారేట్లే ఉంది. పొద్దు వాల్తాంది మిద్దెక్కి సూచ్చనా వానొచ్చాదా రాదా? పదునైతాదా కాదా? అదును దాట్తే ఎట్లా? ఏడు పదుల కరువు పందికొక్కుల దరువు పంకియ్యని ప్రభువు ముదనష్టపు అప్పు ఉరితాళ్ళ బతుకు. అద్దద్దో…ఆపక్క మోడం ఎక్కొచ్చాంది ఆ మూల నుంచి కుమిల్లు కుమిల్లు నల్లగ కలయబారతాంది కొత్తమిట్ట కాడికొచ్చె దున్నంగి పంపుల్లో దిగబడే అబ్బీ……వచ్చరా….వానొచ్చరా…. మాంచి మోదుబ్బీ… […]పూర్తి వివరాలు ...
కరువు గడ్డ కాదిది కాబోయే పోరు బిడ్డ నెత్తుటి గుడ్డ కాదిది కాబోయే ఉద్యమ అడ్డా మౌనాంగీకారం కాదు రా….. బద్దలవబోయే సీమ నిశ్శబ్ద ఘీంకారం ఎర్ర చందనం నీ సొత్తు కాదిక అది నా సీమ అస్తిత్వం అది మొరటుతనం కాబోదిక మాది నిప్పంటి సీమ కరుకుతనం కూరలో కరేపాకు కాదిక పోరులో కుర్రాళ్ళ జజ్జనక బీడుకట్టు కాదిక గోసెగ్గట్టిన ముళ్ళగట్టె నవ్యాంధ్ర కాదిక నాది నవసీమ గొంతుక జై రాయలసీమ జై జై రాయలసీమ […]పూర్తి వివరాలు ...