శాసనము : వండాడి శాసనము ప్రదేశం : వండాడి, రాయచోటి తాలూకా శాసనకాలం: ఎనిమిదవ శతాబ్దం రేనాటి చోళుల తరువాత ఎనిమిదవ శతాబ్ది తుదియందు కడప మండలము బాణ రాజులకును,వైదుంబ రాజులకును వశమయ్యెను. వైదుంబులు మొదట చిత్తూరు మండలములో నుండెడివారు. వారికి వైదుమ్బవ్రోలు అను నగరము రాజధాని. తర్వాత రేనాటి చోళులను నిర్జించి చిర్పులి నాక్రమించుకొనిరి.కొంతకాలమునకు పొత్తపి (రాజం పేట తాలూక), కలకడ (వాయల్పాడు తాలూక) నగరములు కూడ వీరికి రాజధానులయినట్లు శాసనము లందు కలదు.రేనాటి చోళులవలె […]పూర్తి వివరాలు ...
Tags :రేనాడు
తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన తొలినాటి దిగ్గజాలను అందించిన రాయలసీమకు నేడు అదే సినిమాలలో అంతులేని అపఖ్యాతి లభిస్తోంది. సీమ సంస్కృతిపై ఏ మాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు తోడై ఒక హింసాయుత విధ్వంసకర దృశ్యానికి సీమలోని ఊర్లపేర్లు పెట్టి “రాయలసీమ సంస్కృతి” అంటే ఇదే అనుకునే భ్రమను యావదాంధ్రులకు కలిగిస్తున్నారు. తెలుగులో శబ్దచిత్రాలు ప్రారంభమయ్యాక మల్లీశ్వరి వంటి సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన బి.నాగిరెడ్డి, బి.ఎన్.రెడ్డి […]పూర్తి వివరాలు ...
రేనాటి చోళుల పాలన – ఇతర విశేషములు రేనాటి చోళులు మొదట పల్లవుల తరువాత బాదామి చాళుక్యుల సామంతులుగా ఉన్నట్లు తెలుస్తుంది. అయినప్పటికి పల్లవ మహేంద్రవర్మ కాలమునందు పుణ్య కుమారుడు స్వతంత్ర ప్రతిప్రత్తితో రేనాటి రాజ్యమును పాలించినట్లు అతడు వేయించిన తామ్ర శాసనములు, రామేశ్వరం శిలాశాసనం సూచిస్తున్నవి. రేనాటి చోళరాజులు తమను ప్రాచీన చోళరాజు కరికాలునికి చెందినవారుగా చెప్పుకొనుటవలన, కొందరి రాజుల పేర్లు చోళ మహారాజులని ఉండుట చేతను, వీరు కావేరి తీరమున గల ఆది చోళ […]పూర్తి వివరాలు ...
తెలుగు భాష చరిత్రలో, ఆంధ్రదేశ చరిత్ర నందు కడప జిల్లాను పాలించిన రేనాటి చోళ రాజులకు ఒక విశిష్ట స్థానముంది. కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తాలుకాలు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, వాయల్పాడు తాలుకాలు ప్రాచీన ఆంధ్ర దేశమునందు రేనాడుగా పిలువబడి, ఈ రాజుల కాలంలో తెలుగు భాష శాసన భాషగా మొదటిసారిగా ఉపయోగించబడింది. అదే విధంగా రేనాటి చోళులు పాలనాపరంగా, సంస్కృతిపరముగా ప్రవేశపెట్టిన విధానాలు తరువాతి ఆంధ్రదేశ రాజులకు మార్గదర్శకంగా నిలిచాయి. ఆదికవి […]పూర్తి వివరాలు ...