శ్రీభాగ్ ఒప్పందం మేరకు సీమలో రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండుతో సోమవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చనట్లు రాయలసీమ విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. బంద్‌కు సంబంధించిన కరపత్రాలను ఆదివారం సమాఖ్య కోకన్వీనరు దస్తగిరి, నాగార్జున యోగివేమన విశ్వవిద్యాలయంలో విడుదల చేశారు. ఆర్ఎస్ఎఫ్ బంద్‌కు పిలుపునివ్వడం వెనక ప్రధాన ఉద్దేశం రాజధాని లేకపోతే రాయలసీమకు జరిగే నష్టం వివరించే అన్నీ విషయాలు అందులో పొందుపరిచారు. బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొనాలని వారు కోరారు.పూర్తి వివరాలు ...
Tags :రాయలసీమ
అమ్మని ఆదరిచ్చే కమ్మని గోరుముద్దలమైతాం కొమ్ముగాసి రొమ్ము గుద్దితే పోరుగిత్తలమైతాం రాగిసంగటి ముద్దలం రాయలసీమ బిడ్డలం బందువుగా చూశావా బాహువుల్లో బందిచ్చాం బానిసగా ఎంచితే పిడిబాకులమై కబళిచ్చాం రేగటిసేను విత్తులం రాయలగడ్డ బిడ్డలం కలిసి నడిచ్చే కారే కన్నీటికి సాచిన దోసిల్లమైతాం కాదని నమ్మిచ్చి నడ్డిడిచ్చే కారుచిచ్చై దహిచ్చాం రేపటితరం స్వప్నాలం రాయలసీమ బిడ్డలం సాగు నీళ్ళిచ్చి సాగనంపితే సావాసగాళ్ళం ఐతాం సాగుతున్న దగాని సాగదీచ్చే సానపట్టిన గళాలమై సాగుతాం రాతిగుండె పిల్లోల్లం రాయలగడ్డ బిడ్డలం జై […]పూర్తి వివరాలు ...
కేటాయింపులున్న రాయలసీమ పరిస్థితి పట్టదా? పోలవరం ద్వారా ఆదా అయ్యే 45 టీయంసీల నీటిని, పులిచింతల నిర్మాణం ద్వారా ఆదా అయ్యే 54 టీయంసీల నీటిని, కృష్ణా డెల్టాలో పంటల మార్పిడి ద్వారా ఆదా అయ్యే నీటిని తక్షణమే గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నికర జలాలు పొందేలాగా బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు నివేదికలు ఇవ్వాలి. రాష్ట్ర విభజన బిల్లులో పూర్తిచేస్తామన్న పై ప్రాజెక్టులు అన్నింటికీ బడ్జెట్ కేటాయింపులు ఇచ్చి ఒకటి రెండేళ్ళలో పూర్తిచెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన […]పూర్తి వివరాలు ...
శుక్రవారం (18.07.2014) నాటి సాక్షి దినపత్రికలో ‘రాజధానిగా బెజవాడే బెస్ట్’ అన్న పేరుతో కొండలరావు గారు రాసిన వ్యాసం (లంకె: http://www.sakshi.com/news/opinion/vijayawada-can-be-the-best-capital-city-for-andhra-pradesh-149336) చదివాను. అందులో రావుగారు ఇలా చెబుతున్నారు ‘వెనక బడిన తమ ప్రాంతం రాజధాని అయితేనైనా అభివృద్ధి అవు తుందని కొందరు అంటున్నారు. విభజనను సెంటిమెంట్ గా చూసినవారు రాజధాని ఏర్పాటునూ అలాగే చూస్తు న్నారు. ఆచరణాత్మకంగా, వాస్తవికంగా, తమతో పాటు మిగతా ప్రాంతాల వారి ప్రయోజనాలపరంగా చూడటం లేదు’ అని. రాజధానిని రాయలసీమ వాసులు […]పూర్తి వివరాలు ...
నాకు సిపిఐ పార్టీ అంటే ఎప్పటినుంచో అభిమానం ఉంది కానీ ఈ మద్యన ఆ అభిమానాన్ని చంపుకోవాల్సి వస్తుంది… రాయలసీమ సిపిఐ నాయకులు రాయలసీమకు రాజధాని ,నీళ్ళు కావాలని అంటారు కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాయలసీమకు చెందినవాడే – కానీ ఆయన మాత్రం… రాజధాని గుంటూరు-విజయవాడ మద్య ఉండాలంటాడు ..!. కృష్ణా డెల్టాకునీళ్ళు కావాలంటాడు…! పోలవరాన్ని నిర్మించాలంటాడు…! కాకినాడ -వైజాగ్ కారిడార్ నిర్మించాలంటాడు! కానీ ఈయనకు రాయలసీమ లో కరువుకు నీళ్ళులేక అల్లాడుతున్న ప్రజల దుస్థితి పట్టదు పశువులకు […]పూర్తి వివరాలు ...
ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అధ్యక్షుడు అందరూ రాయలసీమ వాసులేనని, కానీ ఇక్కడి ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి ఆరోపించారు. జిల్లాకు వచ్చిన ఆయన ఆదివారం రాత్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమలోనే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సారవంతమైన మాగానిలో భూములను కొనుగోలు చేసి రాజధానిని నిర్మించడం వల్ల పచ్చని పంటపొలాలను పోగొట్టుకుంటామన్నారు. రాయలసీమలో గడ్డికూడా మొలవని భూములున్నాయని చెప్పారు. ఒక నాడు మద్రాసు […]పూర్తి వివరాలు ...
ఆంద్రుల స్మృతి పథంలో చెరగని ముద్ర వేసిన ముగ్గురు ఈస్టిండియా కంపెనీ అధికారులలో థామస్ మన్రో ఒకరు. ఈయన 1761 మే 27వ తేదీన ఇంగ్లండ్‌లోని గ్లాస్కోలో జన్మించారు. ఇతని తండ్రి అలెగ్జాండర్ మన్రో ఒక వర్తకుడు. థామస్ మన్రో గ్లాస్కో విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఉద్యోగం కొరకు తన పంతొమ్మిదో ఏట అనగా 1780 జనవరిలో 15న మద్రాసుకు వచ్చాడు. అదే సమయంలో హైదరాలీ, టిప్పుసుల్తాన్లతో జరిగిన రెండు, మూడు […]పూర్తి వివరాలు ...
రాయలసీమ అనే పేరు చెప్పడానికి నాయకులు భయపడుతున్న పరిస్థితి దాపురించడం హేయంగా ఉందని కేతువిశ్వనాథరెడ్డి అన్నారు. గురువారం స్థానిక సీపీబ్రౌన్ భాషాపరిశోధనకేంద్రంలో జరిగిన మాచిరెడ్డి వెంకటస్వామి స్మారకోపన్యాసాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాగునీరు, సాగునీరు, విద్యాప్రయోజనాలు కలిగించే ప్రాజెక్టు రూపకల్పన, నగరాభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ వంటి మాటలు నాయకుల నోటి రాకపోవడం బాధకరంగా ఉందన్నారు. రాయలసీమ పౌరసమాజం చైతన్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. సీమ సమాజవికాసం కోసం స్థబ్దుగా ఉన్న పౌరులను చైతన్యం వైపు […]పూర్తి వివరాలు ...
సీమ సినుకయ్యింది ముసురు మొబ్బయ్యింది దారి ఏరయ్యింది ఊరు పోరయ్యింది సినుకు సినుకే రాలి సుక్క సుక్కే చేరి ఊరి వంకై పారి ఒక్కొక్కటే కూరి పెన్నేరుగా మారి పోరు పోరంట ఉంది పోరు పెడతా ఉంది సీమ సినుకయ్యింది ముసురు మొబ్బయ్యింది దారి ఏరయ్యింది ఊరు పోరయ్యింది మెడలు వంచాలంది మడవ తిప్పాలంది మడమ తిప్పకు అంది తడవ మనదే అంది కడవ పగలాలంది అడుగు మడుగయ్యింది గొడవ దడి చేరింది సీమ సినుకయ్యింది ముసురు […]పూర్తి వివరాలు ...