Tags :రాయలసీమ ఉద్యమం

వార్తలు

‘సీమ కోసం సభలో నోరెత్తండి’

కడప:  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనందున సీమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో గళం విప్పాలని, సీమలో రాజధాని ఏర్పాటుపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీమ ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించాలన్నారు. సీమకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అసెంబ్లీని వేదికగా చేసుకొని […]పూర్తి వివరాలు ...

వార్తలు

సీమ కోసం గొంతెత్తిన సాహితీకారులు

రాయలసీమ స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని రాయలసీమకు చెందిన కవులు, రచయితలు డిమాండ్ చేశారు. తుఫానులు, భూకంపాల ప్రాంతంగా జిఎస్‌ఐ నివేదిక పేర్కొన్న విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అశాస్త్రీయమని వారు గుర్తు చేశారు. కడప సిపిబ్రౌన్ గ్రంధాలయ పరిశోధన కేంద్రంలో కుందూ సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాయలసీమ కవులు, రచయితలతో సమాలోచన జరిగింది. ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేంద్రసాహితీ అకాడమి అవార్డు […]పూర్తి వివరాలు ...

వార్తలు

రాయలసీమ సమస్యలపై ఉద్యమం

మైదుకూరు, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా నూతన ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రులో కూడా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాద సూచికలు సంభవిస్తున్నాయని, వాటి సమస్యల పరిష్కారం కోసం రాయలసీమలోని రచయితలు, కవులు, కళాకారులు ఉద్యమానికి సన్నద్ధం కావాలని రాయలసీమ కుందూసాహితీసంస్థ ఏకగ్రీవంగా తీర్మానించింది. స్థానిక జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణలో ఆదివారం కుందూసాహితీసంస్థ ఆధ్వర్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ భవితవ్యము అనే అంశంపై సంస్థ కన్వీనర్ లెక్కలరెడ్డి అధ్యక్షతన రచయితలు, కవులు, కళాకారుల […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు

మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి

కడప జిల్లా నిడిజివ్వి గ్రామంలో జన్మించిన మైసూరారెడ్డి ‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. సుమారు 25 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగిన ఈ వైద్య పట్టభద్రుడు 2004లో తెలుగుదేశంలో చేరారు. ఒక టర్మ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఆ మధ్యన  ఎం.వి.మైసూరారెడ్డితో ‘సాక్షి’ ప్రతినిధులు డి.శ్రీనాథ్, పూడూరి రాజిరెడ్డి సంభాషించారు. సారాంశం ఆయనదైన రాయలసీమ మాండలికంలోనే… మొదట్నుంచీ రైతు కుటుంబము. సిర్రాజుపల్లి అనే చిన్న గ్రామం నుంచి […]పూర్తి వివరాలు ...