స్వార్థ ప్రయోజనాలతో, అధికార దాహంతో తెలుగుజాతిని చీల్చిన ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు రాజధాని కోసం ప్రజల ప్రయోజనాలు గాలికి వదిలి కోట్లకు పడగలెత్తిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులకూ, వారి ప్రయోజనాలను కాపాడే అవినీతి రాజకీయ బేహారుల కోసం గాలింపులు సాగిస్తున్నారు. అశాతవాహన, కాకతీయ, రాయల విజయనగర యుగాలు తెలుగుజాతి సమైక్యతకూ, శతాబ్దాల తరబడి భాషా, సాంస్కృతిక వైభవ ప్రాభవాలకూ మూలవిరాట్టులుగా, కొండగుర్తులుగా నిలిచాయి. ఆనాటి సామంతరాజులైన మండల పాలకుల స్థానిక […]పూర్తి వివరాలు ...
Tags :రాజధాని
కడప జిల్లా అంటే అదేదో వినకూడని పేరైనట్లు ప్రభుత్వ పెద్దలు చిన్నచూపు చూస్తుంటే తాజాగా రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ తానేమీ తక్కువ తినలేదని నిరూపించింది.రాయలసీమలోని మూడు జిల్లాలను పరిశీలించిన సదరు కమిటీ సభ్యులు ఒక్క కడప జిల్లాను మాత్రం విస్మరించారు. ఎంచేత? ప్రభుత్వ పెద్దలూ, కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్యులూ అంతా కమిటీతో సంబంధం లేకుండా తమ సామాజికవర్గం, ధనికుల ప్రాబల్యం అధికంగా ఉండే గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించేశారు. […]పూర్తి వివరాలు ...
సీమలో రాజధాని ఏర్పాటు చేయకుంటే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని విద్యార్థులు హెచ్చరించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి సంఘం కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ రాజధాని రాయలసీమ హక్కు అనే విషయాన్ని మన పాలకులు మరచిపోతున్నారన్నారు. సీమలో రాజధాని ఏర్పాటు కోసం కృషి చేయని రాజకీయ నాయకులను తరిమికొట్టాలన్నారు. […]పూర్తి వివరాలు ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాయలసీమ రాజధాని సాధన సమితి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐజీ హనుమంతరెడ్డి సహా ఇతరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమ జిల్లాలు చాలా వెనకబడి ఉన్నాయన్న జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, ఇదే విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ సైతం […]పూర్తి వివరాలు ...
రాజధానిని సీమలో ఏర్పాటుచేయడమనేది డిమాండు కాదని, తమ హక్కు అని రాయలసీమ విద్యార్థి వేదిక నినదించింది. రాజధాని విషయం కోస్తా నాయకులు, వారికి వంత పాడుతున్న సీమ ఏలికల కుట్రలను ప్రతిఘటిస్తామని విద్యార్థులు నినదించారు. సీమ మరోసారి నష్టపోకుండా రాజధానిని ఇక్కడే ఏర్పాటుచేయాలని, లేదంటే విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రతిఘటన తప్పదని విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని ఐటీఐ కూడలి నుంచి కోటిరెడ్డి కూడలి వరకూ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఎఫ్ కన్వీనరు భాస్కర్, […]పూర్తి వివరాలు ...
రాజధాని వాడికి రాళ్ళ గంప మనకు సాగు నీళ్ళు వాడికి కడగండ్లు మనకు స్మార్ట్ సిటీలు వాడికి చితి మంటలు మనకు వాటర్ బోర్డ్ వాడికి పాపర్ బ్రతుకులు మనకు ఎయిమ్స్ వాడికి ఎముకల గూల్లు మనకు అన్నపూర్ణ వాడికి ఆకలి చావులు మనకు పోలవరం వాడికి కరువు శాపం మనకు యూనివర్సిటీలు వాడికి యురేనియం సావులు మనకు కాసుల పంట వాడికి మాసిన సదువు మనకు కనక వర్షం వాడికి కూనీ సంస్కృతి మనకు ఉండేదంతా […]పూర్తి వివరాలు ...
కడప: రాష్ట్ర రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ రాజధాని సాధన సమితి కార్యకర్తలు బుధవారం ఆర్టీసీ బస్టాండు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు ఎం.నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సీపీఎం మినహా అన్ని పార్టీలు సమ్మతి తెలిపాయన్నారు. 1956కు ముందున్న మాదిరి తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించారని.. దీంతో ముఖ్యంగా రాయలసీమ వాసులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినపుడు 1956కు ముందున్న విధంగా ఆంధ్రప్రదేశ్ […]పూర్తి వివరాలు ...
దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న రాయసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. సీమను అభివృద్ధి చేసుకునే సమయం వచ్చిందనీ ఇప్పటికైనా సీమ ప్రజల గళమెత్తితేనే న్యాయం జరుగుతుందని రాయలసీమ సంఘర్షణ సమితి నిర్వహకులు డాక్టరు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులోని ఐఎంఏ హాలులో గురువారం సాయంత్రం రాయలసీమ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో భవిషత్తు కార్యాచరణపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత నాయకులు తొలుత రాజధాని, పరిపాలన విభాగాలను ఒకచోట […]పూర్తి వివరాలు ...
22న అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీలో బహిరంగసభ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన రాయలసీమలో రాజధాని నిర్మించడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి అన్నారు. విజయవాడ, గుంటూరు ఇప్పటికే పెద్ద నగరాలని, అక్కడ రాజధానికి తగినవిధంగా మౌలిక సదుపాయాలు లేవని, ప్రజలు తిరిగి హైదరాబాద్ మాదిరి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రాజధాని నిర్మాణ ఖర్చును భరిస్తానని కేంద్రం హామీ ఇచ్చినందున సీమలో రాజధాని నిర్మిస్తే అక్కడ రైల్వే, విమానాశ్రయాలు అందుబాటులోకి […]పూర్తి వివరాలు ...