విద్వాన్ రామిరెడ్డి యల్లారెడ్డి గారు రాసిన భైరవేశ్వర ఆలయ చరిత్ర – ‘మోపూరు కాలభైరవుడు’. 2002లో ప్రచురితం.పూర్తి వివరాలు ...
Tags :మోపూరు
కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, రైల్వేకోడూరులోని ఎర్రచందనం పార్కు, ఇడుపులపాయలోని ఎకోపార్కు, నెమళ్ళ పార్కు, కడప నగరంలోని శిల్పారామం, రాజీవ్ స్మృతివనం. పుణ్యక్షేత్రాలు: అద్వైత: పుష్పగిరి దేవాలయాలు (విశేషం: […]పూర్తి వివరాలు ...
ప్రాచీన కాలం నుంచి కడప జిల్లా కవులకు, కళాకారులకే గాక వీరులకు, వీర నారీమణులకు, త్యాగధనులకు కూడా పుట్టినిల్లు. విజయనగర రాజులు వారి రాజ్యంలో పన్నులు వసూలు చేయుటకు పాళెగాండ్రను నియమించుకున్నారు. 16,17 శతాబ్దాములలో విజయనగర పతనానంతరము పాలెగాండ్రు, జమీందారుల ప్రాబల్యము పెరిగి, వీరు ప్రజాకంటకులుగా, దోపిడీదారులుగా, వర్ణనాతీతమైన దారుణాలకు పాల్పడుతూ, ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకునేవారు. క్రీ.శ. 1800 సంవత్సరం కడప జిల్లాకు కలెక్టరుగా వచ్చిన థామస్‌మన్రో, మేజర్ జనరల్ డి.క్యాంప్‌బెల్ అనే సేనానిని […]పూర్తి వివరాలు ...
స్మారక శిలలు, వీరగల్లులు … శాసన భేదాల్లో స్మారక శిలలు, వీరగల్లులను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం ఉంది. యుద్ధంలో మరణించిన వీరులకు, దైవానుగ్రహం కోసం ఆత్మబలి చేసుకున్న భక్తులకు స్మారక శిలలను ప్రతిష్ఠించే ఆచారం ఉండేది. బృహచ్ఛిలాయుగం నాటి సమాధులు, చారిత్రక యుగం నాటి ఛాయాస్తంభాలు, బౌద్ధస్తూపాలు కూడా స్మారక చిహ్నాలేనని చరిత్రకారుల అభిప్రాయం. రాజులు, రాణులు, మత గురువులు మరణించినప్పుడు వారి స్మృత్యర్థం ఛాయాస్తంభాలను నిలిపేవాళ్లు మరణించినవారి ఛాయ ఈ స్తంభంలో ఉంటుందని ఆనాటి […]పూర్తి వివరాలు ...
వైయెస్సార్ జిల్లా వేముల మండలంలోని నల్లచెరువుపల్లె సమీపంలోని మోపూరు భైరవ క్షేత్రం జిల్లాలోని విశిష్టమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. మొహనగిరి పై మోపూరు వద్ద ఈ పుణ్యక్షేత్రం వెలిసింది. మోపూరుకు దిగువన ప్రవహించే పెద్దేరు (గుర్రప్ప యేరు) , సింహద్రిపురం ప్రాంతం నుండీ పారే మొగమూరు యేరు ( చిన్నేరు ) , పులివెందుల ప్రాంతం నుండీ పారే ఉద్ధండవాగు నల్లచెరువు పల్లె వద్ద మోపూరు తిప్ప వద్ద కలుస్తాయి. ఈ భైరవేశ్వర దేవాలయం త్రివేణీ సంగమ […]పూర్తి వివరాలు ...