అతడు : తుమ్మేదలున్న యేమిరా… దాని కురులు కుంచెరుగుల పైన – సామంచాలాడెవేమిరా ఆమె : ఏటికి పోరా శాపల్ తేరా – బాయికి పోరా నీళ్లు తేరా బండకేసి తోమర మగడ – సట్టికేసి వండర మగడా శాపల్ నాకు శారూ నీకూరా ఒల్లోరె మగడా! బల్లారం మగడా బంగారం మగడా… అహ శాపల్ నాకు శారూ నీకూరా || తుమ్మేద || ఆమె : కూలికి బోరా కుంచెడు తేరా – నాలికి పోరా […]పూర్తి వివరాలు ...
Tags :మునెయ్య
ఒక పడుచు పిల్లగాడు తన అందమైన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయిదేశం పోయినాడు. వాడు చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన మగడిని చూసి అలిగింది ఆ అందాలభామ. ఆ మగడు ఆమెను ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో చూడండి. వర్గం: జట్టిజాం పాట (బృందగేయం) పాడటానికి అనువైన రాగం:తిలకామోద్ స్వరాలు (మధ్యాది తాళం) ఏమే రంగన పిల్లా నీ మకమే సిన్నబాయ – సెప్పే పిల్లా ఆలూరు సంతాకు పోతాన్ పిల్లా అడిగినన్ని […]పూర్తి వివరాలు ...
అందమైన ఆ పల్లె పిల్ల ఆకు వేసి, తమ్మ పుక్కిట పెట్టి చెంగావి రంగు సీర కట్టుకొని బుంగ తీసుకుని ఒయ్యారంగా నడుస్తూ నీటి కోసం ఏటికి వచ్చింది. ఏటి దగ్గర ఒక కొంటె కోనంగి సరదాపడి రాయి విసిరినాడు. ఆ రాయి గురి తప్పి ఆ గడుసు పిల్ల కడవకు తగిలి అది పగిలిపోయింది. ఆ పిల్ల రాయి విసిరిన పిల్లగాడిని నిలేసి ఇలా అడుగుతోంది… వర్గం: యాలపాట పాడటానికి అనువైన రాగం: ఆనందభైరవి స్వరాలు […]పూర్తి వివరాలు ...
ఒకప్పుడు రామాయణ, భారత, భాగవత కథలు జానపదుల జీవితంలో నిత్య పారాయణాలు. వారికి ఇంతకంటే ఇష్టమైన కథలు మరేవీ ఉండవేమో! పితృవాక్య పరిపాలనకై శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యాలకు వచ్చినాడు. ఆ సమయంలో భరతుడు అక్కడ లేడు. వచ్చిన తర్వాత జరిగిన ఘోరానికి బాధపడి తల్లి కైక దురాశను నిందించి అడవిలో అన్నను కలుసుకుంటాడు. భరతుని రాకకు సంతోషించిన రాముడు అయోధ్యలోని అందరి యోగక్షేమాలు అడిగినాడు. భరతుడు గుండెలవిసేట్లు ఏడుస్తూ తండ్రి చనిపోయిన విధం చెప్పి […]పూర్తి వివరాలు ...
అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు. విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు అతని సూటిపోటి మాటలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా, సహించలేని తన భర్తను గురించి ఆమె ఇలా చెప్తోంది… వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శుద్ధ సావేరి స్వరాలు (దేశాది తాళం) సుక్కబొట్టు పెట్టనీడు సుట్టాల సూడనీడు ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ ఎన్నాళ్ళు కాయిలుంటడో పచ్చబొట్టు పెట్టనీడు పసుపుసీరె కట్టనీడు ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ ఎన్నాళ్ళు […]పూర్తి వివరాలు ...
వాడు వ్యసనాలకు బానిసై చెడ తిరిగినాడు. ఇల్లు మరిచినాడు. ఇల్లాలిని మరిచినాడు. తాగుడుకు బానిసైనాడు. చివరకు అన్నీ పోగొట్టుకుని చతికిల పడినాడు. వాడి (దు)స్థితిని జానపదులు హాస్యంతో కూడిన ఈ జట్టిజాం పాటలో ఎలా పాడుకున్నారో చూడండి. వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శంకరాభరణం స్వరాలు (తిశ్ర ఏకతాళం) కల్లు గుడిసెల కాడ – కల్లు గుడిసెల కాడ కయిలాసం పోతాండ్య కొన్నాల్లూ కల్లు తాగి వాడింటికీ వచ్చాంటే పెండ్లాము తన్నింది కొన్నాల్లూ దొరల […]పూర్తి వివరాలు ...
రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన . చెక్క భజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు అనుగుణంగా చెక్కలు కొడుతుంటారు. గురువు మధ్యలో ఉండి పాట పాడతాడు. పాటలో వేగం పెరిగే కొద్దీ అడుగులు వేగంగా కదుల్తాయి. ఇటీవలి కాలంలో […]పూర్తి వివరాలు ...
వర్గం: యాలపాట పాడటానికి అనువైన రాగం: మాయా మాళవ గౌళ (త్రిశ్ర ఏకతాళం) కదిరి చిన్నదానా కదిరేకు నడుముదానా నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సిల్కు సీరెకు రేణిగుంట్ల రేయికాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సైజు చేతులకు సైదాపురం గాజులకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| పులివెందుల పూలాకు నీ వాలు జడలాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| ముద్దనూరి ముద్దులకు నీ సన్న పెదవులకు ముద్దెట్ల […]పూర్తి వివరాలు ...
వర్గం: చెక్కభజన పాట పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏక తాళం) ఈ పొద్దు వానొచ్చె మలిపొద్దు సినుకోచ్చె కొండంత మబ్బొచ్చె కోరినా వానల్లు కురిపిచ్చి పోతావని ఆశలే సూపిచ్చివా – వరుణా అన్యాలమే సేచ్చివా ఏరులెండి పాయ సెరువులెండి పాయ దొరువులెండి పాయ సేల్లు బీల్లయిపాయ నీకు సేసిన పూజలన్ని భంగములాయ ఆశసంపి పొతివా – వరుణా అన్యాలమే సేచ్చివా గడ్డిపాసలు ల్యాక పసువులెండి పాయ తిననీకి తిండిల్యాక కండల్కరిగి పాయ గింజ గింటలు […]పూర్తి వివరాలు ...