॥పల్లవి॥చిత్తములో నిన్నుఁ జింతించనేరకమత్తుఁడఁనై పులుమానిసినైతి॥చ1॥అరుత లింగము గట్టి యది నమ్మఁజాలకపరువతమేఁగిన బత్తుడఁ నైతిసరుస మేఁకపిల్లఁ జంకఁబెట్టుక నూఁత-నరయు గొల్లనిరీతి నజ్ఞాని నైతి॥చ2॥ముడుపు కొంగునఁగట్టి మూలమూలలవెదకే-వెడమతినై నే వెర్తుడ నైతివిడువ కిక్కడ శ్రీవేంకటేశ్వరుఁ డుండపొడగానక మందబుద్ధి నేనైతి రాగము: ముఖారి రేకు: 0003-06 సంపుటము: 1-19 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారిపూర్తి వివరాలు ...