ఐదు వందల ఏళ్లకు పైగా ఆధ్యాత్మికంగా , రాజకీయంగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన గంజికుంట నేడు పట్టించుకునేవారు కరువై క్రమక్రమంగా చీకటి పుటల్లోకి నెట్టివేయబడుతోంది. విజయనగర సామ్రాజ్య కాలంలో వనిపెంట , మైదుకూరు, దువ్వూరు ప్రాంతాలకు రాజకీయ కేంద్రంగా విలసిల్లిన గంజికుంట సీమ చరిత్రకు శ్రీకృష్ణ దేవరాయల, అచ్యుతదేవరాయల కాలంనాటి శిలాశాసనాలు(16వ శతాబ్దం ) ఆధారాలుగా నిలుస్తున్నాయి. బ్రిటీషువారి రికార్డులకు ఎక్కిన పాలెగాళ్ళు పట్రా విటలపతినాయుడు వెలమ వెంకోజీ నాయుడు , వన్నూరమ్మలు రాజకీయ కార్యకలాపాలకు గంజికుంట […]పూర్తి వివరాలు ...
Tags :భైరవకోన
భైరేని లేదా భైరవకోన కడప జిల్లాలోని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రము. మైదుకూరు పట్టణానికి ౩౦ కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతం లో వెలసిన భైరవకోన లేదా భైరేని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఏట శివరాత్రి సందర్భంగా భైరవకోన తిరుణాల వైభవోపేతంగా జరుగుతుంది. ఈ భైరవకోన చరిత్ర ఇలా ఉంది . పూర్వం అహోబిలం సమీపంలో నల్లమలలో ప్రవహించే భవనాశి నది జలప్రళయానికి సూచనగా ఉప్పొంగడం మొదలయ్యింది. దీనితో అహోబిల నరసింహ స్వామి ఈ […]పూర్తి వివరాలు ...