Tags :బండలాగుడు పోటీలు

ఆచార వ్యవహారాలు

11 రోజులపాటు పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

కడప: పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 20న చందనోత్సవం, 21న గరుడవాహనం, 22న కల్యాణం, 23 రధోత్సవం నిర్వహిస్తారు. వెయ్యిసంవత్సరాల పురాతత్వ విశేషం కలిగిన పుష్పగిరిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు వల్లూరు మండల అధికారులు, పుష్పగిరి మఠం వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో తొలిసారిగా ఏడు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ క్రీడలు, మేధోక్రీడలు, చిత్రలేఖన సాహిత్యం, సంస్కృతికి ప్రతిబింబాలుగా ఏడు అంశాలలో, […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

నేడు మొయిళ్లకాల్వ ఉరుసు

కడప: పెండ్లిమర్రి మండలంలోని మొయిళ్లకాల్వ గ్రామంలో వెలసిన హజరత్ హుస్సేని వల్లీదర్గాలో శుక్రవారం ఉరుసు ఉత్సవం జరుగుతుందని దర్గాకమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రాత్రి 9గంటలకు గంధం, శ్రీనివాసరావు బృందంచే శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర నాటకం ఉంటుందని, రాత్రి అన్న సంతర్పణ నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. 10గంటలకు పూలచాందినితో గ్రామపురవీధుల్లో ఫకీర్ల మేళతాళాలతో చదివింపులు సమర్పిస్తామన్నారు. బండలాగుడు పోటీలు మద్యాహ్నం 2గంటల నుంచి వృషభరాజములచే బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గెలుపొందిన ఎడ్ల యజమానులకు ప్రథమ […]పూర్తి వివరాలు ...