కడప: ఈ రోజు నుండి పుష్పగిరి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 4వ తేదీ బుధవారం క్షేత్రాధిపతి వైద్యనాధేశ్వరస్వామి, క్షేత్రపాలకుడు చెన్నకేశవస్వాముల గర్భాలయంలో గణపతి పూజలు, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, విశ్వక్షేనపూజ, మేధినీ పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. 5వ తేదీ సాయంత్రం కొండపై వెలసిన చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం, హోమాలు ఉంటాయి. 8న చందనోత్సవం నిర్వహిస్తారు. అక్షతదియ తిరుణాల ఈ నెల 9న ప్రారంభమవుతుంది. […]పూర్తి వివరాలు ...
Tags :పుష్పగిరి బ్రహ్మోత్సవాలు
కడప: పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 20న చందనోత్సవం, 21న గరుడవాహనం, 22న కల్యాణం, 23 రధోత్సవం నిర్వహిస్తారు. వెయ్యిసంవత్సరాల పురాతత్వ విశేషం కలిగిన పుష్పగిరిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు వల్లూరు మండల అధికారులు, పుష్పగిరి మఠం వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో తొలిసారిగా ఏడు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ క్రీడలు, మేధోక్రీడలు, చిత్రలేఖన సాహిత్యం, సంస్కృతికి ప్రతిబింబాలుగా ఏడు అంశాలలో, […]పూర్తి వివరాలు ...
మే 2 నుంచి తిరుణాళ్ళ హరిహరులు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరి వైద్యనాదేశ్వరస్వామి, చెన్నకేశవస్వాముల బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మేనెల 6 వరకూ 10 రోజులపాటు సాగుతాయి. ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ ఛైర్మన్ వెంకటసుబ్బారెడ్డి, ఆలయ ప్రధానర్చకులు సుమంత్‌దీక్షితులు తెలిపారు. పది రోజులపాటు క్షేత్రాధిపతి శ్రీవైద్యనాదేశ్వరస్వామి, క్షేత్రపాలకుడు శ్రీలక్ష్మీచెన్నకేశవస్వాములకు ఉదయం సాయంత్రం వాహనసేవలు నిత్యపూజలు అభిషేకాలు, తోమాలసేవలు, హోమాలు నిర్వహిస్తారు. మూడురోజుల తిరునాళ్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 30న చెన్నకేశవస్వామికి అష్టోత్తర […]పూర్తి వివరాలు ...