Tags :పులివెందుల

    చరిత్ర

    కడప జిల్లాలో రేనాటి చోళులు – 1

    తెలుగు భాష చరిత్రలో, ఆంధ్రదేశ చరిత్ర నందు కడప జిల్లాను పాలించిన రేనాటి చోళ రాజులకు ఒక విశిష్ట స్థానముంది. కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తాలుకాలు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, వాయల్పాడు తాలుకాలు ప్రాచీన ఆంధ్ర దేశమునందు రేనాడుగా పిలువబడి, ఈ రాజుల కాలంలో తెలుగు భాష శాసన భాషగా మొదటిసారిగా ఉపయోగించబడింది. అదే విధంగా రేనాటి చోళులు పాలనాపరంగా, సంస్కృతిపరముగా ప్రవేశపెట్టిన విధానాలు తరువాతి ఆంధ్రదేశ రాజులకు మార్గదర్శకంగా నిలిచాయి. ఆదికవి […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    జిల్లాలో 48 కరువు మండలాలు

    కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు

    కదిరి చిన్నదానా …. జానపదగీతం

    వర్గం: యాలపాట పాడటానికి అనువైన రాగం: మాయా మాళవ గౌళ (త్రిశ్ర ఏకతాళం) కదిరి చిన్నదానా కదిరేకు నడుముదానా నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సిల్కు సీరెకు రేణిగుంట్ల రేయికాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సైజు చేతులకు సైదాపురం గాజులకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| పులివెందుల పూలాకు నీ వాలు జడలాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| ముద్దనూరి ముద్దులకు నీ సన్న పెదవులకు ముద్దెట్ల […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    గుండెపోటుతో చవ్వా చంద్రశేఖర్‌రెడ్డి మృతి

    హైదరాబాద్: ప్రభుత్వ మాజీ సలహాదారు, సినీ నిర్మాత, విసు సంస్థల అధినేత సీసీరెడ్డి (చవ్వా చంద్రశేఖర్‌రెడ్డి, 76) సోమవారం రాత్రి 7.10 గంటలకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయనకు డయాలసిస్ చేస్తున్న సమయంలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కక్కడికక్కడే మృతి చెందినట్లు కేర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సీసీ రెడ్డి కడప జిల్లా పులివెందుల సమీపంలోని చినకుంట్ల గ్రామంలో 1938 […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    పులివెందులలో అఖిల భారత టెన్నిస్ పోటీలు ప్రారంభం

    పులివెందుల: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మెయిన్), రమణప్ప సత్రం, మైదానాల్లో సోమవారం పన్నెండేళ్ళ లోపు బాలబాలికల (అండర్-12) అఖిల భారత ఛాంపియన్‌షిప్ టెన్నిస్ టోర్నీ ప్రారంభమైంది. అక్టోబర్ 3తేదీ వరకు జరిగనున్న ఈ పోటీలను ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ ఈ.సి.గంగిరెడ్డి ప్రారంభించారు. టోర్నీలో పాల్గొనేందుకు చెన్నై, బెంగళూరు, కొయంబత్తూరు, విశాఖపట్టణం, శివకాశి, హైదరాబాద్, కేరళ తదతర ప్రాంతాల నుంచి 50 మందికి పైగా క్రీడాకారులు తరలివచ్చారు. పారిశ్రామికవేత్త గంగాధర, స్వామి వివేకానంద పాఠశాల అధిపతి సోమశేఖర్‌రెడ్డి […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    పాలకవర్గాలు ఏర్పడినాయి!

    కడప నగరపాలికతోపాటు, ఆరు పురపాలికల్లో పాలకవర్గాలు గురువారం కొలువు దీరాయి. జమ్మలమడుగులో మాత్రం ఓ కౌన్సిలర్ కనిపించకుండా పోవడంతో తెదేపా నేతలు వీరంగం చేశారు. దీంతో అక్కడ పాలకవర్గం ఎన్నికను ఈరోజుకు వాయిదా వేశారు. బద్వేలులో ఛైర్మన్‌గా తెదేపా కౌన్సిలర్ పార్థసారధిని ఎన్నుకోగా, వైస్ ఛైర్మన్ అభ్యర్థిపై స్పష్టత రాకపోవడంతో ఆ ఎన్నిక వాయిదా వేశారు. కడప నగరపాలికలోని మేయర్, డిప్యూటీ మేయర్, ఏడు పురపాలికల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు గురువారం ఎన్నిక నిర్వహించారు. అన్ని చోట్లా […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    పురపాలికల ఏలికలెవరో తేలేది నేడే!

     ఈరోజు కడప కార్పొషన్‌తోపాటు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, రాయచోటి పురపాలికల పాలకవర్గం కొలువుదీరనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. కార్పొరేటర్లు/ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం కడపలో మేయర్, డిప్యూటీ మేయర్, ఆయా పురపాలక సంఘాలలో చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎంపికకు ఎన్నికలు జరుగన్నాయి. కలెక్టర్ కోన శశిధర్ కడప కార్పొరేషన్ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. కొత్త పాలకవర్గాల ఎన్నికకు కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని  మున్సిపాలిటీలు ముస్తాబయ్యాయి. ఎన్నికకు కేవలం […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    పులివెందులను గబ్బుగా చూపిన ‘జంపు జిలాని’

    పులివెందులలో చోటా మోటా నాయకులు ఇళ్ళ ముందు చూడడానికి భయంకరంగా ఉండే మనుషులను పెట్టుకుని బాంబులు చుట్టిస్తూ.. కత్తులు పట్టుకుని తిరుగుతుంటారట – అంతే కాదండోయ్ పులివెందులలో కేవలం ఫ్యాక్షనిస్టులు, నేరస్తులు, రౌడీలు మాత్రమే ఉంటారుట – ఇదీ ‘జంపు జిలానీ’ అనే పేరుతో ఇటీవల విడుదలయిన ఒక సినిమాలో పైత్యం శ్రుతిమించి చూపించిన సన్నివేశం. అంతేనా సినిమాలో పలుచోట్ల పులివెందుల అనగానే అయ్యా బాబోయ్ అది ఫ్యాక్షనిస్టుల ఊరు నేను రాను అంటూ కథానాయకుడితో సంభాషణలు […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    పులివెందులలో ఎవరికెన్ని ఓట్లు?

    పులివెందుల శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన మరియు ఉపసంహరణల అనంతరం మొత్తం 14 మంది తుది పోరులో తలపడ్డారు. ఇక్కడ వైకాపా తరపున బరిలోకి దిగిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సుమారు 75 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి సతీష్ రెడ్డి (తెదేపా + భాజపాల ఉమ్మడి అభ్యర్థి) పై విజయం సాధించారు. జగన్‌మోహన్‌రెడ్డి, యెడుగూరి సందింటి – […]పూర్తి వివరాలు ...