Tags :పులివెందుల

    చరిత్ర ప్రసిద్ధులు

    వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

    వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు ఇవే… విద్యారంగం: యోగివేమన విశ్వవిద్యాలయం సిపిబ్రౌన్ భాషాపరిశోధనా కేంద్రానికి ఏటా ౩౦ లక్షల రూపాయల […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    15న జిల్లాకు చిన’బాబు’

    రాజంపేట: ముఖ్యమంతి చంద్రబాబు కొడుకు, చినబాబుగా తెదేపా శ్రేణులు పిలుచుకొనే నారా లోకేష్ ఈనెల 15న జిల్లాకు వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆదివారం అధికారికంగా తెలియచేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు నారా లోకేష్ రాజంపేటకు చేరుకుని పాతబస్సుస్టాండు బైపాస్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారని తెలిపారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండు వరకూ నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటారన్నారు. అనంతరం ఒంటిమిట్ట కోదండరామస్వామిని దర్శించుకుని, కడప మీదుగా […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ‘పులివెందులకు తాగునీటి ఇక్కట్లు తప్పవు’

    జలాశయాలను పరిశీలించిన జగన్ 16 టిఎంసిల నీళ్ళు ఇవ్వాల్సి ఉంటే 2.55 టిఎంసీలే ఇచ్చారు పులివెందుల: విపక్ష నేత, పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్ శుక్రవారం మాయిటాల పులివెందులకు నీరందించే పెంచికల బసిరెడ్డి జలాశయం, పైడిపాలెం జలాశయాలను సందర్శించారు. అలాగే పార్నపల్లె తాగునీటి పథకాన్ని, అలాగే వెలిదండ్లలోని నీటికుంటను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. జగన్ ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ… ‘‘పెంచికల బసిరెడ్డి జాలశయం (చిత్రావతి […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    పశుగణ పరిశోధనా కేంద్రాన్నిఉపయోగంలోకి తీసుకురండి

    ప్రభుత్వానికి విపక్షనేత జగన్ విజ్ఞప్తి పులివెందుల: 247 కోట్ల రూపాయల నిధులూ, 650 ఎకరాల క్యాంపస్ కలిగిన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తే రైతులకు మేలు జరుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం పులివెందులలోని అధునాతన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని (ఐజీ కార్ల్) సందర్శించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. ”వ్యవసాయం గిట్టుబాటు కాని దుస్థితి ఉంది. పశుపోషణ […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు

    కడప : శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ  రోజు నుంచి ఏప్రిల్ 6 వరకు జిల్లాలోని 8 డిపోల పరిధిలో ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని చెప్పారు. కడప డిపో నుంచి 25, రాజంపేట 30, ప్రొద్దుటూరు 15, బద్వేలు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగు డిపోల నుంచి పది బస్సుల చొప్పున మొత్తం 120 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు వెల్లడించారు.ఆర్టీసీ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    పట్టిసీమకు అనుకూలంగా తెదేపా నేతల ర్యాలీ

    పట్టిసీమ ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకురావడానికి సీఎం చంద్రబాబు మహాయజ్ఞం చేస్తుంటే, విపక్ష నేత జగన్ దీనికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ శాసనమండలి ఉపాధ్యక్షులు సతీష్‌కుమార్‌రెడ్డి (తెదేపా) ఆధ్వర్యంలో సోమవారం పులివెందుల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లాలోని తెదేపా నేతలంతా హాజరై పట్టిసీమకు అనుకూలంగా మాట్లాడటం విశేషంగా ఉంది. అనంతరం ర్యాలీనుద్దేశించి సతీష్‌రెడ్డి, తెదేపా నేతలు ప్రసంగించారు. వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితి మున్ముందు […]పూర్తి వివరాలు ...

    పర్యాటకం

    కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

    కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, రైల్వేకోడూరులోని ఎర్రచందనం పార్కు, ఇడుపులపాయలోని ఎకోపార్కు, నెమళ్ళ పార్కు, కడప నగరంలోని శిల్పారామం, రాజీవ్ స్మృతివనం. పుణ్యక్షేత్రాలు: అద్వైత: పుష్పగిరి దేవాలయాలు (విశేషం: […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు

    పులివెందులలో కొత్త సీఎస్ఐ చర్చి ప్రారంభం

    పులివెందుల: పట్టణంలో రూ.3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త సీఎస్ఐ చర్చిని గురువారం రాయలసీమ బిషప్ బీడీ ప్రసాద్‌రావు, మోడరేటర్, మోస్టు రెవరెండ్ దైవ ఆశీర్వాదం తదితరులు ప్రారంభించారు. అంతకుముందు భక్తులు, వివిధ ప్రాంతాల చర్చిల ఫాదర్లు స్థానిక ఆర్అండ్‌బీ అతిధి గృహం సమీప నుంచి ర్యాలీగా చర్చికి చేరుకున్నారు. చర్చి ప్రాంగణమంతా భక్తులతో రద్దీగా మారింది. చర్చి ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన కూటమి నిర్వహించారు. బిషప్ బీడీ ప్రసాదరావు ప్రభువు సందేశాన్ని వినిపించారు. […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    బాబును గద్దె దింపాలనే దుర్బుధ్ధితోనే…

    పులివెందుల: స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట గురువారం తెలుగు తమ్ముళ్లు జగన్ దీక్షకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టడం వింతగా కనిపిస్తోంది. ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ నిరసన దీక్షకు దిగడం సిగ్గుచేటంటూ  తెదేపా రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించినారు. కడప జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాలో గళమెత్తావా? ఇప్పుడెందుకు నిరసన దీక్షలు చేయబోతున్నావు? […]పూర్తి వివరాలు ...