మొన్న పద్దెనిమిదో తేదీ ఈనాడులో వచ్చిన వార్తాకథనంలో రాష్ట్రంలో పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెయ్యడానికి ఎంపిక చేసిన 11 ప్రాంతాల జాబితా ఇచ్చారు: పైడి భీమవరం – శ్రీకాకుళం జిల్లా అచ్యుతాపురం – విశాఖపట్నం జిల్లా నక్కపల్లి – విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం – విశాఖపట్నం జిల్లా కాకినాడ – తూర్పుగోదావరి జిల్లా కంకిపాడు – కృష్ణా జిల్లా గన్నవరం – కృష్ణా జిల్లా జగ్గయ్యపేట – కృష్ణా జిల్లా కొప్పర్తి – కడప జిల్లా ఏర్పేడు-శ్రీకాళహస్తి […]పూర్తి వివరాలు ...
Tags :నెల్లూరు
తెలుగువారందరి ప్రత్యేక రాష్ట్రం విశాలాంధ్ర ఏర్పాటుకు అంగీకరించి రాయలసీమ వాసులు అన్ని విధాలా నష్టపో యారు. సర్కారు జిల్లాలతో ఐక్యత పట్ల నాటి సీమ నేతలలో పలువురికి ఆంధ్ర మహాసభ కాలం నుండి అనుమానాలు ఉండేవి. ఆంధ్ర విశ్వవిద్యా లయ కేంద్రాన్ని అనంతపురం లో ఏర్పాటు చేయాలంటూ యూనివర్సిటీ సెనేట్ కమిటీ 1926లో చేసిన తీర్మానాన్ని సైతం లెక్కచేయక దాన్ని విజయవాడ నుండి విశాఖపట్టణానికి తరలించారు. ఇలాంటి వైఖరి కారణంగానే తమిళుల ఆధిపత్యం వదు ల్చుకొని సర్కారు […]పూర్తి వివరాలు ...
తెలుగు భాష చరిత్రలో, ఆంధ్రదేశ చరిత్ర నందు కడప జిల్లాను పాలించిన రేనాటి చోళ రాజులకు ఒక విశిష్ట స్థానముంది. కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తాలుకాలు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, వాయల్పాడు తాలుకాలు ప్రాచీన ఆంధ్ర దేశమునందు రేనాడుగా పిలువబడి, ఈ రాజుల కాలంలో తెలుగు భాష శాసన భాషగా మొదటిసారిగా ఉపయోగించబడింది. అదే విధంగా రేనాటి చోళులు పాలనాపరంగా, సంస్కృతిపరముగా ప్రవేశపెట్టిన విధానాలు తరువాతి ఆంధ్రదేశ రాజులకు మార్గదర్శకంగా నిలిచాయి. ఆదికవి […]పూర్తి వివరాలు ...
అనుకున్నట్లుగానే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మళ్లీ మొండి చేయి చూపారు. రాష్ట్రానికి చెందిన ముప్పై ముగ్గురు అధికార పార్టీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలు గానే మిగిలారు. లాలూప్రసాద్ బాటలోనే మమతాబెనర్జీ కూడా తెలుగు ప్రజల ఉనికిని ఏ మాత్రం లెక్కచేయలేదు. రెండు కొత్త రైళ్లను, రెండు రైళ్ల పొడి గింపును, కొత్త రైలు లైన్ల నిర్మాణానికి మూడు చిన్నా చితక ప్రతిపాదనలనూ, ఒక డబ్లింగ్ పనినీ, ఒక విద్యుద్దీకరణనూ, ఒక గేజ్ మార్పిడి పనినీ ఆంధ్ర ప్రజలకు […]పూర్తి వివరాలు ...