జాతీయ రహదారులకు గతంలో ప్రాధాన్యతా క్రమంలో ఇస్తూ వచ్చిన నంబర్లలో ఏవో కొన్ని ప్రధానమైన జాతీయ రహదారుల నంబర్లు తప్ప మిగతావి కొంత గందరగోళంగా తయారయ్యాయనే చెప్పాలి. ఏదైనా ఒక జాతీయ రహదారిని తీసుకుని దానితో కలుస్తున్న లేదా దాన్నుంచి విడిపోయిన ఇతర జాతీయ రహదారుల నంబర్లేమిటని చూస్తే చాలా సందర్భాలలో అవి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండేవి. అందువల్ల గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమయ్యేది. దాంతో పదేండ్ల కిందట 2010లో రోడ్డు రవాణా & జాతీయ రహదారుల […]పూర్తి వివరాలు ...
Tags :నందలూరు
కడప : నందలూరు సౌమ్యనాథస్వామి దేవాలయాన్ని తితిదేలోకి విలీనం చేసినట్లు రాజంపేట ఎమ్మెల్యే, తితిదే పాలక మండలి సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. శుక్రవారం సౌమ్యనాథున్ని దర్శించుకున్న మేడా విలేకరులతో మాట్లాడుతూ…. అన్నమయ్య ఆరాధించిన సౌమ్యనాథస్వామి ఆలయం తితిదేలోకి విలీనం చేయడం ముదావహమన్నారు. ఇటీవల తిరుమలలో నిర్వహించిన తితిదే పాలకమండలి సమావేశంలో ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు. దీనితో పాటు రాష్ట్రంలోని ఆరు ఆలయాల విలీనానికి పాలకమండలి ఆమోదం లభించిందన్నారు. 32 వేల కీర్తనలను రచించిన తాళ్లపాక […]పూర్తి వివరాలు ...
బౌద్ధ ప్రదీప కడప కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నాగనాదేశ్వరుని కొండ నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు– బుద్ధుడి మధుర జ్ఞాపకాలు, భావితరాలకు నిత్య స్ఫూర్తి దీపికలు. కడప జిల్లాను కూడా బౌద్ధ పర్యాటకం లో భాగం చేసి, ఇక్కడి బౌద్ధ ప్రదేశాలను అభివృద్ధి చేయవలసిందిగా జిల్లా ప్రజలు, పర్యాటక ప్రియులు, బౌద్ధ విశ్వాసులు కోరుతున్నారు. కడప జిల్లాలో వేల సంవత్సరాల పాటు బౌద్ధం వైభవంగా విరాజిల్లింది. అనంతపురం జిల్లాలోని ఎర్రగుడిలోనూ, కర్నూలు జిల్లా పత్తికొండ […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, రైల్వేకోడూరులోని ఎర్రచందనం పార్కు, ఇడుపులపాయలోని ఎకోపార్కు, నెమళ్ళ పార్కు, కడప నగరంలోని శిల్పారామం, రాజీవ్ స్మృతివనం. పుణ్యక్షేత్రాలు: అద్వైత: పుష్పగిరి దేవాలయాలు (విశేషం: […]పూర్తి వివరాలు ...
నన్నెచోడుడు కడప జిల్లాలో తూర్పు ప్రాంతాలను పొత్తపి రాజధానిగా పాలించిన అర్వాచీన చోళవంశికుడైన మహారాజు. ప్రాచీన చోళులలో ప్రసిద్ధుడైన కరికాలచోళుని వంశం తనదని చెప్పుకున్నాడు. నన్నెచోడుని తండ్రి చోడబల్లి, తల్లి శ్రీసతి. వీరి రాజ్యం కడప జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉండేది. ఈ రాజులు నందలూరు సౌమ్యనాథుని సేవించినారు. ఈ నన్నెచోడుడు ‘కుమార సంభవము’ అనే ఉత్కృష్ణ కావ్యాన్ని రచించిన కవిరాజశిఖామణి సూర్యవంశరాజు గనుక ఇతనికి టెంకాణాదిత్యుడు అని […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా వాసుల ఆశలన్నీ ఆవిరి కందుల సోదరులను భాజపాలో చేర్చుకోవడానికి మొన్న 18న కడపకొచ్చిన వెంకయ్య నాయుడు గారు కడప జిల్లా అభివృద్ధి విషయంలో మినుకుమినుకుమంటున్న ఆశల మీద నిర్దాక్షిణ్యంగా చన్నీళ్ళు గుమ్మరించి చక్కా వెళ్ళిపోయారు. కేంద్ర కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ వాణిని బలంగా వినిపించగల నాయకుడిగా, చాలాకాలంగా ఈ ప్రాంత సమస్యలు, పరిస్థితుల గురించి అవగాహనతోబాటు బాధ్యతకూడా కలిగిన సీనియర్ నాయకుడిగా ఆయన్నుంచి కడప జిల్లావాసులు ప్రధానంగా కోరుకున్నది నాలుగు విషయాల్లో స్పష్టత – అవి: […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, […]పూర్తి వివరాలు ...
18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ పంటకు అను వైన జూన్, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల్లో 393.5 మిల్లి మీటర్ల వర్షపాతం జి ల్లాలో నమోదు కావాల్సి ఉండగా 180.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. వాస్తవికంగా 54 […]పూర్తి వివరాలు ...
తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. బద్వేల్, అట్లూరు, గోపవరం, బికోడూరు, కలసపాడు, పోరుమామిళ్ళ, కాశినాయన, మైదుకూరు, బీమఠం, దువ్వూరు, […]పూర్తి వివరాలు ...