Tags :ధర్నా

రాజకీయాలు

వైకాపా ధర్నా విజయవంతం

కడప: ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని.. లేదంటే ప్రభుత్వ మెడలు వంచి చేయిస్తామని వైకాపా నేతలు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కడప కలెక్టరేట్ ఎదుట వైకాపా నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీరుపైన విమర్శలు గుప్పించారు. సొంతమామనే వెన్నుపోటు పొడిచిన బాబుకు రైతుల్ని, మహిళల్ని నిలువునా ముంచడం పెద్ద విశేషమేమి కాదని పలువురు శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. నగర మేయర్ సురేష్‌బాబు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు వార్తలు

నగరంలో ట్రాఫిక్‌పై ఆంక్షలు… పోలీసు బలగాల పహారా

కడప: నగరంలో నేడు వైకాపా ధర్నా కార్యక్రమానికి వచ్చే నేతలు, రైతులు, పార్టీ కార్యకర్తల వాహనాల రాకపోకలకు సంబంధించి కడప డీఎస్పీ అశోక్‌కుమార్‌ ఆంక్షలు విధించారు. మైదుకూరు, కమలాపురం, పులివెందుల రోడ్డు మార్గంలో వచ్చే వాహనాలను మోచంపేట వద్ద ఉన్న మరాఠీ మఠం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. బద్వేలు, రాజంపేట, రాయచోటి మార్గం నుంచి వచ్చే వాహనాలకు రాజారెడ్డివీధిలోని సీఎస్‌ఐ చర్చి వెనుక ఖాళీ స్థలాల్లో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

రుణమాఫీ అమలు కోసం జిల్లావ్యాప్తంగా ధర్నాలు

కడప: ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ బుధవారం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు తహసీల్ధార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేశాయి. ఈ ధర్నాల్లో వైకాపాకు చెందిన నేతలు, శాసనసభ్యులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హామీ ఇచ్చిన విధంగా తక్షణమే ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్వోలకు వినతిపత్రాలను సమర్పించారు. పులివెందులలో మాజీ మంత్రీ వివేకానందరెడ్డి, వేముల, వేంపల్లెలలో కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరులో […]పూర్తి వివరాలు ...