॥పల్లవి॥ఏమి గలదిందు నెంత పెనగినఁ వృధాకాముకపు మనసునకు కడ మొదలు లేదు॥చ1॥వత్తిలోపలి నూనె వంటిది జీవనమువిత్తుమీదటి పొల్లు విధము దేహంబుబత్తిసేయుట యేమి పాసిపోవుట యేమిపొత్తుల సుఖంబులకు పొరలుటలుగాక॥చ2॥ఆకాశ పాకాశ మరుదైన కూటంబులోకరంజకము తమలోనిసమ్మతముచాకిమణుఁగుల జాడ చంచలపు సంపదలుచేకొనిననేమి యివి చెదిరిననునేమి॥చ3॥గాదెఁబోసినకొలుచుకర్మి సంసారంబువేదు విడువనికూడు వెడమాయబదుకువేదనల నెడతెగుట వేంకటేశ్వరు కృపా-మోదంబు వడసినను మోక్షంబు గనుట రాగము: వరాళి రేకు: 0064-01 సంపుటము: 1-328 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
Tags :తాళ్ళపాక అన్నమయ్య
॥పల్లవి॥జీవుఁ డెంతటివాఁడు చిత్త మెంతటిది తనదైవికము గడవ నెంతటివాఁడు దాను॥చ1॥విడిచిపోవని యాస విజ్ఞానవాసనలఁగడచి మున్నాడె నెక్కడివివేకములువుడుగనియ్యనిమోహ ముబ్బి పరమార్ధములమెడవట్టి నూకె నేమిటికింక నెరుక॥చ2॥పాయనియ్యనిమహాబంధ మధ్యాత్మతోరాయడికిఁ దొడఁగె సైరణలేల కలుగుమాయనియ్యనికోపమహిమ కరుణామతినివాయెత్తనియ్య దెవ్వరికిఁ జెప్పుదము॥చ3॥సరిలేనియాత్మచంచల మంతరాత్మకుని-నెరఁగనియ్యదు దనకు నేఁట్టిపరిణతలుతిరువేంకటాచలాధిపునిమన్ననఁగానివెరసి యిన్నటి గెలువ వెరవు మఱిలేదు రాగము: దేశి రేకు: 0063-06 సంపుటము: 1-327 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేశిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥కాకున్న సంసారగతులేలలోకకంటకములగు లోభంబులేల॥చ1॥వినికిగనవలసినను విష్ణుకీర్తన చెవికివినికిచేసిన నదియె వేదాంతబోధమనికిగనవలసినను మధువైరిపై భక్తివునికి ప్రాణులకు బ్రహ్మోపదేశంబు॥చ2॥చదువు గనవలసినను శౌరినామము దిరుగఁజదువుటే సకలశాస్త్రముల సమ్మతమునిదుర గనవలసినను నీరజాక్షునికిఁ దన-హృదయసమర్పణ సేయుటిది యోగనిదుర॥చ3॥ఆస వలసిన వేంకటాధీశ్వరుని కృపకు-నాససేయుటే పరమానందసుఖమువాసి గనవలసినను వైష్ణవాగారంబువాసి సేయుట తనకు వైభవస్ఫురణ రాగము: శ్రీరాగం రేకు: 0063-05 సంపుటము: 1-326 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥మాదృశానాం భవామయ దేహినాంయీదృశం జ్ఞానమితి యేపి న వదంతి॥చ1॥వాచామ గోచరం వాంఛాసర్వత్రనీచ కృత్యైరేవ నిబిడీకృతాకేచిదపి వా విష్ణుకీర్తనం ప్రీత్యాసూచయంతో వాశ్రోతుం న సంతి॥చ2॥కుటిల దుర్భోధనం కూహకం సర్వత్రవిట విడంబన మేవ వేద్మ్యధీతంపటు విమల మార్గ సంభావనం పరసుఖంఘటయితుం కష్టకలికాలే న సంతి॥చ3॥దురిత మిదమేవ జంతూనాం సర్వత్రవిరస కృత్యైరేవ విశదీకృతంపరమాత్మానాం భవ్య వేంకటానామ-గిరివరం భజయితుం కేవా న సంతి రాగము: ముఖారి రేకు: 0063-04 సంపుటము: 1-325 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఆదిదేవుఁడనఁగ మొదలు నవతరించి జలది సొచ్చివేదములును శాస్త్రములును వెదకి తెచ్చె నీతఁడు॥చ1॥వాలి తిరుగునట్టి దైత్యవరుల మోహవతులనెల్లమూలమూలఁ ద్రోసి ముసుఁగుపాలు సేసె నీతఁడువేలంఖ్యలైనసతుల వేడుకలలరఁజేసి వొంటినాలిమగనిరీతిఁ గూడి యనభవించె నీతఁడు॥చ2॥కడుపులోని జగములెల్లఁ గదలకుండఁ బాఁపరేని-పడుక నొక్కమనసుతోడఁ బవ్వళించె నీతఁడుఅడుగుకింద లోకమెల్ల నడఁచఁదలఁచి గుఱుతుమీరపొడవు వెరిగి మిన్నుజలము పొడిచి తెచ్చె నీతఁడు॥చ3॥కోడెవయసునాఁడు మంచి గోపసతుల మనములెల్లఆడి కెలకు నోప కొల్లలాడి బ్రదికె నీతఁడువేడుకలర వేంకటాద్రి వెలసి భూతకోటి దన్నుఁజూడుఁడనుచు మోక్షపదము చూరవిడిచె నీతఁడు రాగము: కాంబోది రేకు: 0063-03 సంపుటము: […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥త్వమేవ శరణం త్వమేవ శరణంకమలోదర శ్రీజగన్నాథా॥చ1॥వాసుదేవ కృష్ణ వామన నరసింహశ్రీసతీశ సరసిజనేత్రాభూసురవల్లభ పురుషోత్తమ పీత-కౌశేయవసన జగన్నాథా॥చ2॥బలభద్రానుజ పరమపురుష దుగ్ద-జలధినిహార కుంజరవరదసులభ సుభద్రాసుముఖ సురేస్వరకలిదోషహరణ జగన్నాథా॥చ3॥వటపత్రశయన భువనపాలన జంతుఘటకారకరణ శృంగారాధిపాపటుతర నిత్యవైభవరాయ తిరువేం-కటగిరినిలయ జగన్నాథా రాగము: శ్రీరాగం రేకు: 0063-02 సంపుటము: 1-323 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥వీఁడివో యిదె వింతదొంగవేఁడిపాలు వెన్న వెరఁజినదొంగ॥చ1॥వెలయ నీటఁ జొప్పువేనేటి దొంగతలగాననీక దాఁగు దొంగతలఁకక నేలదవ్వేటిదొంగతెలసి సందెకాడఁ దిరిగేటి దొంగ॥చ2॥అడుగుకింద లోకమడఁచేటి దొంగఅడరి తల్లికినైన నలుగుదొంగఅడవిలో నెలవైయున్న దొంగతొడరి నీలికానెతో నుండు దొంగ॥చ3॥మోస మింతుఁల జేయుముని ముచ్చుదొంగరాసికెక్కిన గుఱ్ఱంపు దొంగవేసాల కిటు వచ్చి వేంకటగిరిమీఁదమూసినముత్యమై ముదమందు దొంగ రాగము: భైరవి రేకు: 0063-01 సంపుటము: 1-322 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కొండ దవ్వుట యెలుక గోరిపట్టుట దీనబండాయ సంసారబంధము॥చ1॥వెలయఁ జిత్తంబునకు వేరుపురువై బుద్ధిఁగలఁగించె మోహవికారముకలకాలమునకు లింగము మీఁది యెలుకయైతలకొనియె నాత్మ పరితాపము॥చ2॥అరయఁ జంచలముచే నాలజాలంబువలెఁదిరుగదొరకొనియెఁ దనదేహముతిరువేంకటాచలాధిపుని మన్ననఁగానిపరిపాటిఁ బడదు తనభావము రాగము: బౌళి రేకు: 0062-06 సంపుటము: 1-321 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥జనులు నమరులును జయలిడఁగాఘనుఁడదె వుయ్యాలగంభముకాడ॥చ1॥వదలక వలసినవారికి వరములుయెదురెదురై తానిచ్చుచునునిదురలేక పెనునిధినిధానమైకదలఁ డదే గరుడగంభముకాడ॥చ2॥కోరినవారికి కోరినవరములువోరంతప్రోద్దు నొసఁగుచునుచేరువయై కృపసేసీ నిదివోకూరిముల పడిమిగోపురమాడ॥చ3॥వడి వేంకటపతి వరములరాయఁడునుడుగఁగాళ్ళుఁగన్నులు సుతులబడిబడి నొసఁగుచు బ్రాణచారులకుకడిమి నీడ దిరుగని చింతాడ రాగము: ముఖారి రేకు: 0062-05 సంపుటము: 1-320 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారిపూర్తి వివరాలు ...