॥పల్లవి॥కింకదీర ‘నదైవం కేశవాత్పర’ మనిఉంకువైవనాలో నీవుపమ లివే॥చ1॥కంటి నీవొక్కఁడవే లోకములకు దైవమనివొంటి మఱి నిన్నుఁ బోల నొకరిఁ గానవింటి నీవే ఘనమని వేదాంతమందు నీ-కంటె నితరము విన గరుణానిధీ॥చ2॥తోఁచె నాకు నీసేవే తుదిపదమని మఱితోఁచ దీబుద్ధికి; సరితూఁగ దెందునుపూఁచి నాగురుఁడు నిన్నే బోధించేగాని మఱిదాఁచఁడాయ నీమహిమ ధరణిధరా॥చ3॥సమ్మతించె నామతి జవియైనా కథలెసమ్మతించ దెక్కడో రచ్చల సుద్దులునమ్మిక శ్రీవేంకటేశ నంటున నీపాదాలేనమ్మితి నేమియు నమ్మ నారాయణా రాగము: ధన్నాసి రేకు: 0082-03 సంపుటము: 1-395 Tags: Annamacharya Keerthanalu, […]పూర్తి వివరాలు ...
Tags :తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు
॥పల్లవి॥సులభుఁడు మధుసూదనుఁడు మన-మెలమి నమ్మిన నిట్టే సుండీis-aber.net॥చ1॥పడుచు మాటన కా ప్రహ్లదునెదుటపొడచూపె నాదిపురుషుఁడుఅడవి దేహనక అదంతిమొఱకునుతడవి కాచిన దైవము సుండీ॥చ2॥ఆడుమాటలనక అంతలో ద్రౌపదినివాడిమి గాచిన వరదుఁడుపోఁడిమిఁ బేదనక పొందిన కుచేలునివీఁడె సంపదిచ్చె విష్ణుఁడు సుండీ॥చ3॥వీరువారన కిదె వేఁడిన వరములుసారేకు నిచ్చిన సర్వేశుఁడుమేరతో లోకముల మెఱసె నిప్పుడునుయీరీతి శ్రీవేంకటేశుఁడే సుండీ రాగము: రామక్రియ రేకు: 0082-02 సంపుటము: 1-394 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య [&పూర్తి వివరాలు ...
॥పల్లవి॥విధి నిషేధము లకు వెఱవఁగఁ బనిలేదుమధుసూదన నీమన్నన దాసుడైతే॥చ1॥విడువరానిధర్మ విధుల పురుషులనువిడిచి గోపికలు విచ్చనవిడిబడి నిన్ను దగులుటే పరమధర్మ మాయయెడయునితర ధర్మాలిక నేటికయ్యా॥చ2॥మానరాని కర్మమార్గము లటు మానిపూనినయతులే పూజ్యులటనీనారాయణనియతే ధర్మమాయయీనిజ మొకటియు నెఱగఁగఁవలయు॥చ3॥యిన్నిట శ్రీవేంకటేశ నీదాసుఁడైవున్న విచారాల నొదుగనేలానిన్ను గూర్చినట్టి నిజభ క్తి గలదనితిన్ననై తెలిపేటి తెలివే కలది రాగము: దేవగాంధారి రేకు: 0082-01 సంపుటము: 1-393 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవాసౌమిత్రి భరత శత్రుఘల తోడ జయమందు దశరథ రాఘవా॥చ1॥శిరసు కూఁకటుల రాఘవా చిన్నారి పొన్నారి రాఘవాగరిమ నావయసునఁ దాటకిఁ జంపిన కౌసల్యనందన రాఘవాఅరిది యజ్ఞముగాచు రాఘవా అట్టె హరువిల్లు విఱిచిన రాఘవాసిరులతో జనకుని యింటను జానకిఁ జెలఁగి పెండ్లాడిన రాఘవా॥చ2॥మలయు నయోధ్యా రాఘవా మాయామృగాంతక రాఘవాచెలఁగి చుప్పనాతి గర్వ మడఁచి దైత్యసేనలఁ జంపిన రాఘవాసొలసి వాలిఁజంపి రాఘవా దండి సుగ్రీవునేలిన రాఘవాజలధి బంధించిన రాఘవా లంక సంహరించిన రాఘవా॥చ3॥దేవతలు చూడ రాఘవా […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుఁడే రక్షకుఁడుతటుకున స్వతంత్రముడిగిన యాత్మకు తగునిశ్చింతమే పరసుఖము॥చ1॥ఆఁకటి కడుగని శిశువుకుఁ దల్లి యడిచి పాలు ద్రాగించినరీతి,యీకడఁ గోరికలుడిగిన యోగికి నీశ్వరుఁడే రక్షకుఁడుచేకొని బుద్దెఱిఁగిన బిడ్డలపైఁ జింతింపరు తొల్లిటివలెఁ దల్లులుయీకొలఁదులనే స్వయత్న దేహుల కీశ్వరుఁడును వాత్సల్యము వదలు॥చ2॥తతిఁ గరిరాజుఁ గాచినయట్లు ద్రౌపదిమానము గాచినయట్లు,హితమతి స్వతంత్రముడిగిన యోగికి యీశ్వరుఁడే రక్షకుఁడుఅతనుఁడు భస్మంబయ్యిననాఁడు అజునిశిరంబటు ద్రుంచిననాఁడుచతురుఁడుదా నడ్డము రాఁడాయను స్వతంత్రముడుగని జీవులుగాన॥చ3॥దిక్కని యనిశముఁ జిత్తములోనఁ జింతించేటి శరణాగతజనులకు,యిక్కడనక్కడ శ్రీ వేంకటగిరియీశ్వరుఁడే రక్షకుఁడుమక్కువతోఁ దనయంతర్యామిని మఱచినస్వామి ద్రోహులకెల్లాఅక్కరతోఁ బుట్టుగులే […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పరులసేవలు చేసి బ్రదికేరటాసిరివరుదాసులు సిరులందు టరుదా॥చ1॥కోరి వొక నరునిఁ గొలిచిన వారలుదీరులై సలిగెలఁ దిరిగేరటకూరిమి బ్రహ్మండ కోటులేలెడివాని-వార లింతటఁ జనవరులౌ టరుదా॥చ2॥చేకొన్న తుమ్మిద చేపడ్డ కీటము –లాకడఁ దుమ్మిదలయ్యీనటశ్రీకాంతుని పాదసేవకులగు వార –లేకులజు లయినా నెక్కుడౌ టరుదా॥చ3॥ధరణీశు నాజ్ఞల తమదేశములందుసిరులనాణెపు ముద్ర చెల్లీనటతిరువేంకటాద్రి శ్రీదేవుని ముద్రలుధరియింపఁగా నింతటఁ జెల్లు టరుదా రాగము: దేసాళం రేకు: 0081-03 సంపుటము: 1-390 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పనిమాలినట్టి వట్టి పఱఁదుగాక మాకుననిచి యిదియు నొక్కనగుఁబాట్లా॥చ1॥కన్నవారినెల్లా వేఁడేకష్టమే దక్కుటగాకపన్ని దైవమియ్యనిది పరులిచ్చేరాయెన్నికతోఁ దేహమిచ్చె నిహమెల్లాఁ జెందనిచ్చెవున్నవారింతటి పని కోపఁగలరా॥చ2॥బడలి తానెందైనాఁ బడ్డపాటే దక్కెఁగాకకడఁగి రానిది దే నొక్క రివసమాకడుపులో నుండఁగానే కలవి నుదుట వ్రాసెతడవి దైవముచేఁత దాఁట వసమా॥చ3॥దెప్పరపు సంపదకుఁ దిమ్మటలే దక్కెఁగాకయెప్పుడూ శ్రీవేంకటేశుఁడీక మానీనాచప్పుడుగా నతనికే శరణన్న జాలుఁగాకతప్పులును వొప్పులు నాతనివే కావా రాగము: సాళంగం రేకు: 0081-02 సంపుటము: 1-389 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥వీనిఁ జూచియైన నేము విరతిఁబొందగలేముపూని మాబ్రదు కిందుఁబోలదాయఁగా॥చ1॥పరుల వేడఁగబోవు పరనిందకుఁ జొరవుపరపురుషార్థమే ఫలవృక్షతతులెల్లనరులమై ఘనులమై నానాబుద్ధు లెఱిఁగిపొరి మాబ్రదుకు లిందుఁబోలదాయఁగా॥చ2॥కామక్రోధాదులు లేవు కామతత్వ మెఱఁగవుకామించినట్లవు నెక్కడనైనా శిల లివిదీమసము గలిగియుఁ దెలివి గలిగియునుభూమిలో మాబ్రదు కిందుఁబోలదాయఁగా॥చ3॥వొకరిఁ గొలువఁబోవు వొకపంట సేయఁబోవువొకమానిగడు చేరివుండు పక్షు లాడనాడవొక శ్రీ వేంకటపతి నమ్మియుండలేముమొకెమో మాబ్రదు కిందుఁబోలదాయఁగా రాగము: దేసాళం రేకు: 0081-01 సంపుటము: 1-388 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కోరు వంచరో కోటారుఆరసి మనసా అంతరాత్మకు॥చ1॥కొండలపొడవులు కోరికకుప్పలుపండినపంటలు భవము లివినిండినరాసులు నిజకర్మంబులుఅండనె యివె మాయారంభములు॥చ2॥వెలిధాన్యంబులు విషయపురాసులుపొలివారేటివూరుపుగములుకలుషపుమదమున కావుగప్పినవిఅలవిమీర మాయారంభములు॥చ3॥బడి నింద్రియములబంతులు నురిపికడురతుల దండగట్టలతోయెడనెడ శ్రీవేంకటేశుమహిమ లవేఆడియాలపుమాయారంభములు రాగము: ఆహిరి రేకు: 0080-06 సంపుటము: 1-387 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరిపూర్తి వివరాలు ...