”మా ఉళ్ళో ఏ పండగ వచ్చినా, ఏ సంబరం జరిగినా, గవినికాడి పుల్లయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు ! సిన్నప్పటి నుంచీ పుల్లయ్య యవ్వారమే అంత అని మా నాయన చెబుతా ఉంటాడు. సంకురాత్రి పండగయితే పుల్లయ్యను పట్టుకోడానికి పగ్గాలుండవ్! ఊళ్ళో ఇళ్ళిళ్ళూ తిరుగుతా ఉంటాడు. ఏ ఇంట్లో ఏ వంటలు సేచ్చాండారు? ఏఏ ఊర్లనుండీ చుట్టాలు వచ్చినారు? ఊళ్ళో దేవుని మేరవని ఎట్ల జేచ్చే బాగుంటది? పార్యాట ఆపొద్దు ఏ జామున యాటపొట్టేళ్ళు, […]పూర్తి వివరాలు ...
Tags :తవ్వా ఓబుల్ రెడ్డి
దేశంలోని అన్ని నదులకూ 12 యేళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తే.. పెన్నానదికి ప్రతియేటా ఫాల్గుణ మాసం లో పున్నమి రోజున ఒకరోజు పుష్కరాలు వస్తాయని ప్రముఖ సిద్ధాంతి శ్రీ సొట్టు సాంబమూర్తి వెల్లడించారు. రాష్ట్రంలొ గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల తర్వాత అతి పెద్దనదిగా పెన్నానది గుర్తించబడింది. కర్నాటకలోని నంది కొండల్లో పుట్టి రాష్ట్రంలోని అనంతపురం, కడప, నెల్లురు జిల్లాలలో దాదాపు 597 కిలోమీటర్లు ప్రవహించి నెల్లూరు జిల్లా ఊటకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. రాయలసీమలోని అనంతపురం, […]పూర్తి వివరాలు ...
రాయలసీమలో ఇప్పటికీ గుక్కెడు నీటికోసం అలమటించే అభాగ్య జీవులున్నారు. ఇంటికి భోజనానికి వచ్చిన చుట్టాన్ని కాళ్లు కడుక్కోమనడానికి బదులుగా, చేయి కడుక్కోమని చెప్పాల్సిన దుర్భర పరిస్థితులు సీమ ప్రాంతంలో తారసపడుతుంటాయి!గంజి కరువూ, డొక్కల కరువూ పేరేదైనా బుక్కెడు బువ్వ కోసం, గుక్కెడు నీటి కోసం నకనకలాడిన రాయలసీమ చరిత్రకు కైఫీయత్తులు సైతం సాక్ష్యాధారంగా నిలుస్తున్నాయి. సీమ రైతులు , తమ కంట్లో పెల్లుబుకుతున్న కన్నీటి చెమ్మను తుడుచుకుంటూ నీటిచెమ్మ కోసం భూమిని 500 అడుగుల లోతు దాకా […]పూర్తి వివరాలు ...
బుధవారం కడపలో జరిగిన 22వ రాష్ట్ర మహాసభలో కథకుడు, కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్‌రెడ్డిని జర్నలిస్ట్స్ అషోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( జాప్ ) ఘనంగా సత్కరించింది. సీనీయర్ పాత్రికేయులైన ఓబుల్ రెడ్డి గతంలో జాప్‌కు కడప జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేసినారు. జాతీయ పాత్రికేయ సంఘం ( ఎన్.యు.జె ) అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ , జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగా రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గూడూరు రవి, […]పూర్తి వివరాలు ...
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయావా? గణనాయకా ఈ అభాగ్యుల క్షమించు..! ఉండ్రాళ్ళు తినే ఓ బొజ్జ గణపయ్యా..! గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? మా గుండె చప్పుళ్ళన్నీ ఆర్తనాదాలై అధికారాన్ని అంధత్వం ఆవరించినవేళ కన్నీళ్ళే ఇంకిపోయిన ఈ సీమలో నిమజ్జనానికి మాత్రం నీళ్ళీక్కడివి? ఆప్యాయతలకూ అనురాగాలకూ కొదువలేని ఈ రాయలసీమలో ఎండిన చెరువులూ, బావులూ గుండెలు బాదుకునే జీవులూ ఎడారిలో ఎండమావులై తడారిపోయిన గొంతులతో ఆకాశం దిక్కు ఆశగా చూస్తూ ఆశ సచ్చి అంతమై పోతున్నారెందరో! గుక్కెడు నీళ్ళకు […]పూర్తి వివరాలు ...
ఒరే అబ్బీ..ఒరే సిన్నోడా పొగబండీ..ల్యాకపాయ ఒరే సంటోడా..ఒరే సన్నొడా ఎర్ర బస్సూ కరువైపాయ అబ్బ పాలెమాలినా.. జేజికి బాగ లేకపొయినా గుంతల దోవలే దిక్కైపాయ తాతల కాలం నుంచీ పొగబండ్లని ఇనడమేకానీ ఎక్కిన పాపాన పోల్యా ఉత్తర దిక్కు రైలు యెల్తాంటే సిత్తరంగా ముక్కున ఎగసూడ్డమే కానీ కాలు మింద కాలేసుకోని కూచ్చోని రోంత దూరమన్నా పోయింది ల్యాకపాయ మా సిన్నాయన ఒకసారి కనకదుర్గమ్మ తిన్నాలకు పోయుండ్య పొగబండ్లతోనే పైన మోడాలు ఆడ్తాండయంట ఊరూరికీ పొగబండ్లలోనే జనాలంతా […]పూర్తి వివరాలు ...
ఈనెల 27,28 తేదీలలో (గురు,శుక్రవారాలలో) బ్రహ్మంగారిమఠం మండలంలోని ఓబులరాజుపల్లె నారాయణస్వామి 100వ ఆరాధనోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మంగారిమఠంలోని సాలమ్మ మఠం, బొమ్మువారి మఠాలలో ఈ ఆరాధనోత్సవాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈ ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం, సంస్కృతిక,ఆధ్యాత్మిక కార్యక్రమాలను, భజనలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మంగారి మఠం సమీపంలోని శ్రీ నారాయణ స్వామి మఠం ఆధ్యాత్మిక భావనలతో వెలుగొందింది. కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం మిట్టపల్లె, గంగిరెడ్డిపల్లె గ్రామంలో నర్రెడ్డి గంగిరెడ్డి, రామాంబ దంపతులకు 1834 లో […]పూర్తి వివరాలు ...
కడప.ఇన్ఫో మరియు తెలుగు సమాజం మైదుకూరులు సంయుక్తంగా ప్రచురించిన ‘గండికోట’ పుస్తకానికి గాను పర్యాటక శాఖ అందించే ‘ఉత్తమ పర్యాటక రచన’ పురస్కారం లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27 రాత్రి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంత కుమార్, చేనేత, జౌళి శాఖా మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా పుస్తక రచయిత, కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు.పూర్తి వివరాలు ...
వాణిజ్య ప్రకటనల యవనిక పై ఏ సూడో రైతు నాయకుడో వెండితెర వేలుపో ప్రత్యక్షమై బహుళజాతి చిలుకల్లా పలుకుతున్నారు చితికిన కొబ్బరి రైతు సాక్షిగా బోండాముల్లో హలాహలాన్ని చిమ్మి కోలాల కోలాహలం సృష్టిస్తున్నారు ఖాజీపేట గోళీసోడా, మైదుకూరి నన్నారి షర్బత్, అనాగరిక పానీయాలంటున్నారు పులియో గరే, కుర్ కురే, పిజ్జా, బర్గర్లను మహాప్రసాదాలుగా అభివర్ణిస్తున్నారు చింతకుంట సాయిబులు ఒంటెద్దు బండ్లో ఉప్పునూ వంకమర్రి వాళ్లు చెంబుల పిండినీ అమ్మొచ్చినప్పుడు వీధుల్ని అలుముకునే జీవన నాదాన్ని నిర్ధాక్షిణ్యంగా నులిమేస్తున్నారు […]పూర్తి వివరాలు ...