బొబ్బిళ్ళ నాగిరెడ్డి గడేకల్లులో వెలసిన భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఇతడు శ్రీమంతుల ఇల్లు దోచి బీదలకు పంచి పెట్టేవాడట. పట్టపగలు నట్ట నడివీధిలో ప్రత్యర్ధులు నాగిరెడ్డిని హతమార్చినారుట. ఆ సంఘటనను జానపదులు ఇలా పాటగా పాడినారు… చుట్టూ ముట్టూ పల్లెలకెల్ల శూరుడమ్మ నాగిరెడ్డి డెబ్బై ఏడు పల్లెలకెల్లా దేవుడమ్మా భీమలింగ రామ రామా కోదండరామా భై రామ రామా కోదండరామా పక్కనున్న పల్లెలకెల్ల పాలెగాడు నాగిరెడ్డి దిక్కుదిక్కుల పల్లెలకెల్ల దేవుడమ్మ భీమలింగ ||రామ|| మోపిడీ […]పూర్తి వివరాలు ...
Tags :జానపదగేయాలు
నలుగు పెట్టేటప్పుడు పెండ్లి కొడుకును వేణుగోపాలునిగా భావించి ముత్తైదువులు పాడే పాట ఇది… వర్గం: నలుగు పాట నలుగూకు రావయ్య నాదవినోదా వేగామె రావయ్య వేణూగోపాల ||నలుగూకు|| సూరి గన్నెరి పూలు సూసకము కట్టించి సుందరుడ నాచేత సూసకమందుకో ||నలుగూకు|| సన్నమల్లెలు దెచ్చి సరమూ కట్టించి సరసూడ నాచేత సరమందవయ్య ||నలుగూకు|| చెండుపూలూ దెచ్చి చెండు గుట్టించి చెందురుడ నాచేత చెండందువయ్య ||నలుగూకు|| సిరిచందనపు చెక్క గంధము తీయించి కామూడ నాచేత గంధము అందుకో ||నలుగూకు|| జాజికాయ […]పూర్తి వివరాలు ...
వర్గం: పిల్లల పాట నీళ్ళకు బోర తిమ్మ నిద్దరొస్తాదమ్మ కట్టెలు తేరా తిమ్మ కడుపు నస్తాదమ్మ నట్టుకు బోర తిమ్మ నడుము నస్తాదమ్మ పిన్నె దీసుకోర తిమ్మ ఇంతె సాలు మాయమ్మ సేనికి బోర తిమ్మ సినుకులొస్తాయమ్మ ఇంట్లో పడుకోర తిమ్మ ఇంతె చాలు మాయమ్మ పాడినవారు: వడ్లూరి నారాయణరెడ్డి, రాకట్ల, రాయడుర్గము తాలూకా, అనంతపురం జిల్లాపూర్తి వివరాలు ...
వర్గం: హాస్యగీతాలు (పసలకాపర్లు పాడుకొనే పాట) పాడటానికి అనువైన రాగం : తిలకామోద్ స్వరాలు (ఆదితాళం) పొద్దన్నె లేసినాడు కాదరయ్యా వాడు కాళ్ళు మగం కడిగినాడు కాదరయ్యా(2) కాళ్ళు మగం నాడు కాదరయ్యా వాడు పంగనామం పీకినాడు కాదరయ్యా పంగనామం పీకినాడు కాదరయ్యా వాడు సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా వాడు బుట్టి సంకన పెట్టినాడు కాదరయ్యా బుట్టి సంకన పెట్టినాడు కాదరయ్యా వాడు పల్లె దావ పట్టినాడు కాదరయ్యా పల్లె […]పూర్తి వివరాలు ...
బేట్రాయి సామి దేవుడా-నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమి రాయుడా ! కదిరి నరసిమ్మడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా 1బే1 శాపకడుపున చేరి పుట్టగా-రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీళ్ళలోన వలసీ వేగమె తిరిగి బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ 1బే1 తాబేలై తాను పుట్టగ -ఆ నీల్లకాడ దేవాసురులెల్ల గూడగ దోవసూసి కొండకింద దూరగానె సిల్కినపుడు సావులేని మందులెల్ల దేవర్ల కిచ్చినోడ !బే1 అందగాడవవుదు లేవయా-గోపాల గో విందా రచ్చించ రావయా పందిలోన సేరి కోరపంటితో […]పూర్తి వివరాలు ...
వదినకు ఒకసరి బిందెకు బిగసరి బంగారు జడ కుచ్చుల మా వదిన అహ బంగారు జడ కుచ్చుల మావదిన ।వదినకు । తాటి తోపులో పామును చూసి (2) వడ్డాణమంటది మా వదిన తన నడుముకు కట్టమంటది మా వదిన ।వదినకు । చెరువులొ ఉండే కప్పల్ని చూసి బోండాలంటది మా వదిన తాను భోంచేస్తానంటది మా వదిన ।వదినకు । బండిని తోలే బండోణ్ని చూసి నా మొగుడంటది మా వదిన ఎగిరి బండెక్కి కూర్చుంటది […]పూర్తి వివరాలు ...