బొబ్బిళ్ళ నాగిరెడ్డి గడేకల్లులో వెలసిన భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఇతడు శ్రీమంతుల ఇల్లు దోచి బీదలకు పంచి పెట్టేవాడట. పట్టపగలు నట్ట నడివీధిలో ప్రత్యర్ధులు నాగిరెడ్డిని హతమార్చినారుట. ఆ సంఘటనను జానపదులు ఇలా పాటగా పాడినారు… చుట్టూ ముట్టూ పల్లెలకెల్ల శూరుడమ్మ నాగిరెడ్డి డెబ్బై ఏడు పల్లెలకెల్లా దేవుడమ్మా భీమలింగ రామ రామా కోదండరామా భై రామ రామా కోదండరామా పక్కనున్న పల్లెలకెల్ల పాలెగాడు నాగిరెడ్డి దిక్కుదిక్కుల పల్లెలకెల్ల దేవుడమ్మ భీమలింగ ||రామ|| మోపిడీ […]పూర్తి వివరాలు ...
Tags :గుత్తి
నలుగు పెట్టేటప్పుడు పెండ్లి కొడుకును వేణుగోపాలునిగా భావించి ముత్తైదువులు పాడే పాట ఇది… వర్గం: నలుగు పాట నలుగూకు రావయ్య నాదవినోదా వేగామె రావయ్య వేణూగోపాల ||నలుగూకు|| సూరి గన్నెరి పూలు సూసకము కట్టించి సుందరుడ నాచేత సూసకమందుకో ||నలుగూకు|| సన్నమల్లెలు దెచ్చి సరమూ కట్టించి సరసూడ నాచేత సరమందవయ్య ||నలుగూకు|| చెండుపూలూ దెచ్చి చెండు గుట్టించి చెందురుడ నాచేత చెండందువయ్య ||నలుగూకు|| సిరిచందనపు చెక్క గంధము తీయించి కామూడ నాచేత గంధము అందుకో ||నలుగూకు|| జాజికాయ […]పూర్తి వివరాలు ...
వర్గం: హాస్యగీతాలు (పసలకాపర్లు పాడుకొనే పాట) పాడటానికి అనువైన రాగం : తిలకామోద్ స్వరాలు (ఆదితాళం) పొద్దన్నె లేసినాడు కాదరయ్యా వాడు కాళ్ళు మగం కడిగినాడు కాదరయ్యా(2) కాళ్ళు మగం నాడు కాదరయ్యా వాడు పంగనామం పీకినాడు కాదరయ్యా పంగనామం పీకినాడు కాదరయ్యా వాడు సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా వాడు బుట్టి సంకన పెట్టినాడు కాదరయ్యా బుట్టి సంకన పెట్టినాడు కాదరయ్యా వాడు పల్లె దావ పట్టినాడు కాదరయ్యా పల్లె […]పూర్తి వివరాలు ...
తెలుగు శాసనాలను గురించి మాట్లాడేటప్పుడు తెలుగు భాషకు తొలి అక్షరార్చన కడప జిల్లాలో జరిగిందనే విషయాన్ని తప్పనిసరిగా స్మరించుకోవలసి ఉంటుంది. ఇప్పటివరకు లభించిన తెలుగు శాసనాల్లో రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శాసనం మొట్టమొదటిది. ఈ రాజుదే ఇంకొక శాసనం ఎర్రగుడిపాడులో కూడా లభించింది. శాస్త్రాన్ని బట్టి ఈ శాసనాలు క్రీ.శ.575 ప్రాంతానికి చెందినవిగా నిర్ణయించబడ్డాయి. ప్రాచీన తెలుగు శాసనాల్లో ఎక్కువభాగం రేనాటి చోళులవే కావడం వల్ల ప్రాచీనాంధ్ర భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ శాసనాలే […]పూర్తి వివరాలు ...
విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి. సాహితీ సమరాంగణ చక్రవర్తిగా చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ప్రస్తుత కడప ప్రాంతం రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రధాన భూమికను పోషించింది. కడప ప్రాంతంలో లభించిన […]పూర్తి వివరాలు ...
1933-34 సంవత్సరాలలో గాంధీజీ కడప జిల్లాలో పర్యటించి సుమారు మూడు రోజుల పాటు జిల్లాలోనే బస చేసి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో సందర్శకుల కోసం ప్రత్యేకం…. గాంధీజీ , ఆయన పరివారం తిరుపతి నుండి రేణిగుంట మీదుగా రైలులో కడపకు వెళుతుండగా శెట్టిగుంట రైల్వే స్టేషన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకోబారావు గారు ఆయనను కలుసుకొన్నారు. ప్రతీ రైల్వేస్టేషనులో ప్రజలు గాంధీజీని సాదరముగా ఆహ్వానించారు. రాజంపేట రైల్వే స్టేషనులో ఆ పట్టణ […]పూర్తి వివరాలు ...
అనుకున్నట్లుగానే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మళ్లీ మొండి చేయి చూపారు. రాష్ట్రానికి చెందిన ముప్పై ముగ్గురు అధికార పార్టీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలు గానే మిగిలారు. లాలూప్రసాద్ బాటలోనే మమతాబెనర్జీ కూడా తెలుగు ప్రజల ఉనికిని ఏ మాత్రం లెక్కచేయలేదు. రెండు కొత్త రైళ్లను, రెండు రైళ్ల పొడి గింపును, కొత్త రైలు లైన్ల నిర్మాణానికి మూడు చిన్నా చితక ప్రతిపాదనలనూ, ఒక డబ్లింగ్ పనినీ, ఒక విద్యుద్దీకరణనూ, ఒక గేజ్ మార్పిడి పనినీ ఆంధ్ర ప్రజలకు […]పూర్తి వివరాలు ...